Tuesday, December 26, 2017

దిగులు దేహాన్నై

ఆరాటం గా అనుకుంటా
ఈ సారన్నా
నన్ను నీ దగ్గర నుండీ
తిరిగి తెచ్చేసుకోవాలని
గడ్డి పూల మధ్య
ఓ సాయంత్రాన్నలా పరిచేసి
కబుర్ల కాగితాలన్నీ
మడత విప్పి చదివేస్తూ
ఆప్త క్షణాలు అద్ది
జీవితం ఖాళీతనాల మీద
సంతోషాన్ని బొమ్మగా గీసేస్తుంటే
వెళ్లాల్సిన సమయమొకటి
వచ్చేసిందని
వదిలీ వదల్లేక
భారంగా నే అనుకో
దిగుళ్ళని దాచేయాలనే తొందర్లో
నవ్వుని నటించడం రాక
బెంగటిల్లుతున్న నీ కళ్ళకి
నవ్వుతూ వాన చినుకుల్ని
తోడిచ్చి పంపాను కానీ
ఈ సారీ ఎప్పటిలా
నన్ను మాత్రం
నీలో మర్చిపోయి
దిగులు దేహాన్నై తిరిగొచ్చేసా


ఈ వర్మకేమైయింది ...

ఈ వర్మకేమైయింది ...

డిషుమ్ డిషుమ్ అంటూ సౌండ్ లతో షర్ట్ నలగని హీరో చేతిలో ఒక్కోడు వచ్చి కొట్టించుకొని వెళ్లి కాలవలో పడ్డం చూసి చూసి ఉన్నా జనాలకు ఫైటింగ్ లు ఇంత అందం గా కూడా తీయొచ్చు అని చూపించిన సినిమా శివ. నేను నాలుగో క్లాస్ లో ఉండగా వచ్చిన ఆ సినిమా అప్పట్లో బాగా నచ్చేసింది ఆ తర్వాత ఎన్ని సార్లు చూశానో . పాపని చేతిలో పట్టుకొని chasing ని తప్పించుకుంటూ సైకిల్ మీద హీరో వెళ్లడం ..వర్షం లో చీకట్లో ఫైటింగ్ , కాలేజీ క్యాంపస్ వెకిలి తనం లేకుండా చూపించడం ఇలా చాలా సన్నివేశాల్లో 'డైరెక్టర్ ' మార్క్ ని మెచ్చుకోకుండా ఉండలేం.

ఇక ఆ తర్వాత వచ్చిన క్షణం క్షణం ఈరోజుకి ఈ సినిమా వస్తే ఇక రిమోట్ పక్కన పడేసి టీవీ కి అతుక్కొని పోతా , అసలు పాటలో హీరోయిన్ కి వంద డ్రెస్ లు మార్చడం అలవాటయిన సినిమాకి . శ్రీదేవి లాంటి అందమైన హీరోయిన్ సగం పైగా సినిమాలో ఒకే డ్రెస్ లో అదీ మట్టి కొట్టుకుపోయిన డ్రెస్ లో అందంగా చూపించడం ఓ ఎత్తు అయితే ..అమాయకంగా హాస్యం పండించే క్యారెక్టర్ లో తన expression నిజంగా ఓ ట్రెండ్ .. ఎక్కడ వెకిలి హాస్యం ఉండదు. క్రైమ్ సస్పెన్స్ హాస్యం మూడు మిక్స్ చేసి తీసిన ఈ మూవీ నా అల్ టైం ఫేవ్ మూవీ . కామెడీ విలన్ గా పరేష్ రావల్ నటన ఎన్ని సార్లు చూసిన కొత్తగా ఉంటుంది. ,. ఆ తర్వాతే వచ్చిన మనీ మనీ .బ్రహ్మానందం కామెడీ ..ఖాన్ దాదా తో గేమ్స్ వద్దు, వారెవ్వా ఏమీ పేస్ అనే సాంగ్ కామెడీ విలన్ మీద తీయడం క్రెడిట్ ఇక్కడా మళ్ళా వర్మ కే


రాత్రి మూవీ లో అందమైన దయ్యం హీరోయిన్ రేవతి రూపం లో నవ్వుతోనే భయపెట్టేస్తుంది. ఇక్కడ కేవలం ఓ నవ్వు ఓ చూపు ఆ వెనకాలే వచ్చి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ . ఓ బొమ్మ కేసి కెమెరా అలా చూపిస్తూ ఉంటే వెనక ఏ మ్యూజిక్ ఉండదు అంతా సైలెంట్ . ఉన్నట్లుండి ఆ బొమ్మ నవ్వుతుంది ఆ వెనుకే ఒక్కసారిగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక వెన్నులో వణుకే . సినిమాలో భయంకరమైన ముఖాలు లేవు దృశ్యాలు లేవు అయినా భయపెట్టిస్తాడు వర్మ .


కౌన్ అని ఓ హిందీ సినిమా ముగ్గురే ముగ్గురు .ఓ ఇల్లు సినిమా మొత్తం అక్కడే. అయినా రెండు గంటలు పాటు సినిమాని ఆపకుండా చూసేసా. ఆ మూడు క్యారెక్టర్ ల లోనే విలన్ ఎవరు అనే సస్పెన్స్ మైంటైన్ చేయడం నిజంగా హైలైట్ .చివర్లో ఊర్మిళ ఆమ్మో సూపర్ acting అసలు. ఇక్కడ కూడా ప్లేట్ లో ఉన్న బ్రెడ్ ముక్క భయపెట్టేస్తుంది.


మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సత్య అసలు అంత పెద్ద సినిమాకి చక్రి లాంటి చిన్న హీరో ని సెలెక్ట్ చేసుకోడం అదీ హిందీ పరిశ్రమకి ఏ మాత్రం పరిచయం లేని పేస్. అయినా సినిమా లో అది లోటు అనిపించదు. సత్య ,సర్కార్ .. .ఇండియా లో అంతర్లీనం గా రాజకీయాలను సినీ రంగాలను శాసిస్తోన్న మాఫియా ని తనదైన స్టైల్ లో చూపించాడు. వర్మ మార్క్ మాఫియా.


గాయం ,అంతం ,రంగీలా ,shool ,కంపెనీ, అనగనగా ఒక రోజు గోవిందా గోవిందా ఇలా ఎన్నో మంచి సినిమాలు తీసిన వర్మ కి సినిమాలు తీయడం మర్చిపోయారా లేదా ప్లాప్ తీయాలని కంకణం కట్టుకున్నారో తెలియదు కానీ .మొత్తానికి వర్మ మార్క్ సినిమా ఓ గడిచిపోయిన చరిత్రలా మిగిలిపోయింది.


వివాదాలు , ట్విట్టర్ ల జబ్బు నుండీ వర్మ కోలుకొని మళ్ళీ పాత వర్మలా మారిపోయి హీరోజబ్బు పట్టి పోయిన తెలుగు సినిమా కి మళ్ళీ వైవిధ్య మైన సినిమాలు అందించాలని కోరుకుంటూ


 ..GET WELL SOON. .from twitter disease 

విశ్వనాధ్ గారి గురించి



బాధలో బావి మీద నిలబడి తాగిన మైకం లో వేదాంతం పాడుకుంటూ ఉంటాడు. 

ఇంతలో ఆమె వస్తుంది. అప్పుడే మొదలవుతుంది వాన. ఆ బొట్టు చెరిగిపోతూ ఉంటే నుదిటి మీద చేయి అడ్డం పెడతాడు హీరో .

భర్త పొతే బొట్టు తీయాలన్న సంప్రదాయాన్ని విశ్వనాధ్ గారు సమర్ధించారు అనే కోణం లో చూసి ఈకలు పీకే వారికి ఆ దృశ్యం తప్పుగా కనిపించవచ్చు చూసే కళ్ళను బట్టే. అక్కడ సమర్ధించలేదు విమర్శించలేదు. అక్కడ చూడాల్సింది ఆచారం కాదు తాను చెప్పదల్చుకున్న విషయాన్ని ఎంత సున్నితంగా చూపించారు అన్న విషయాన్నీ

మనసుకి తడి తెలిసిన మనిషికి ఆ దృశ్యం హత్తుకుంటుంది. సినిమా అయిపోయినా ఆ దృశ్యాలు వెంటాడతాయి. చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్నాక తాను సంతోషంగా లేను అని తెలిస్తే భాధ పడతాడని ఆమె బొట్టు పెట్టుకొని రావడం . ఆమె సంతోషం లో తన సంతోషం వెతుక్కునే ప్రేమికుడి పాత్రలో అతను . టీవీ లో సాగర సంగమం సినిమా చూసిన చాలా రోజుల వరకూ ఆ సినిమా వెంటాడింది. ఆ తర్వాత ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు.

ప్రేక్షకులకి పరిచయం లేని వయసు మళ్ళిన వ్యక్తి ని హీరో గా పెట్టి , కథానాయకి ని వేశ్య పాత్రలో చూపించి శంకరాభరణం తీసి ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు. స్వాతి కిరణం లో అహం ఈర్ష్య తో రగిలిపోయే హీరో పాత్రలో ముమ్ముట్టి , అమాయకుడిగా స్వాతి ముత్యం లో కమల్ హాసన్. చెప్పులు కొట్టుకునే వ్యక్తి పాత్రలో అగ్ర హీరో చిరంజీవి ,సిరి వెన్నెల లో గుడ్డి వాడైనా హీరో, శోభన్ బాబు కున్న అందాల హీరో ఇమేజ్ కి భిన్నంగా నల్లగా అనాకారిగా చెల్లెలి కాపురం లో ఇలా చూపించినా అభిమానులు బ్రహ్మ రధం పట్టారు .

హీరో లకు ఆపాదించే హీరోయిజమ్ వెర్రిగా మారి సమాజం పై యువత పై చెడు ప్రభావం చూపిస్తున్నా నోరెత్తని కుహనా మేధావులు విశ్వనాధ్ గారి సినిమాలు సమాజం పై ఏ దుష్ప్రభావం చూపించాయని విరుచుకుపడుతున్నారు. హీరోయిన్ కి ప్లాస్టిక్ మేకప్ లు ఉండవు. హీరో మగతనాలు ఆకాశం లో నుండీ ఊడిపడేట్టుగా అసహజంగా నూ కూడా ఉండవు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని తన సినిమాలో చూపించారు అదీ కళాత్మకంగా
తనని తానూ ఏమీ అభ్యుదయవాదిగా అయన ప్రకటించుకోలేదు సమాజాన్ని తన సినిమాలతో ఉద్దరించేస్తున్న అని చెప్పుకోలేదు. తనకి నచ్చిన కళని కలలుగా కన్నారు ఆ కలల్ని తనకి తెలిసిన సినిమా కళ ద్వారా కళాత్మకం గా తీశారు. హాయిగా సినిమా చూద్దాం అనుకునే సగటు ప్రేక్షకుడిని కట్టి పడేసే సినిమాలు తీశారు. అలాగని అవేమీ నేల విడిచి సాము చేయలేదు. ప్రతీ సినిమాలో అంతర్లీనంగా ఒక గొప్ప మానవతా భావాన్ని చూపించే ప్రయత్నం ప్రతి సినిమాలో చేశారు . కులాంతర వివాహాన్ని సమర్థిస్తూ సప్తపది తీశారు, ప్రేమ మనసుకు మాత్రమే అని వైకల్యం అడ్డం కాదని సిరిసిరి మువ్వ సిరివెన్నెల సినిమాలోకి చూపించారు, అహంకారం సాటి కళాకారులను ఎలా తొక్కేస్తుంది స్వాతి కిరణం లో చూపిస్తే, పెళ్లయి భర్తని పోగుట్టుకున్న స్త్రీకి ఓ మనసు ఉంటుందని తోడు కోరుకుంటుందని చూపించిన సినిమా స్వాతి ముత్యం . ఓ వేశ్య కి సహాయం చేయడం వల్ల సమాజం లో తనకున్న గుర్తింపుని ,వృత్తిని కూడా వదులుకున్న హీరో కథతో శంకరాభరణం. సుడి గుండాలు సినిమాలో విశ్వనాథ్ గారు అందించిన కధే కాదు ప్రతి మాట ఈరోజు సమాజానికీ వర్తిస్తూ ఆలోచింప చేస్తుంది. నేరమూ శిక్ష కూడా అలాంటిదే
ఓ సీత కధ, సీత మహాలక్ష్మి , సిరి వెన్నెల, శంకరాభరణం, స్వాతి ముత్యం ,స్వర్ణ కమలం ,స్వాతి కిరణం, సప్తపది శృతి లయాలు, జీవన జ్యోతి ,చెల్లెలి కాపురం ,సాగర సంగమం ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. చూసి ఎన్నేళ్లయినా అవి ఎప్పటికీ మనసులో గుర్తుండి పోతాయి సినిమా చూసి థియేటర్ బయటకి వచ్చేసి మర్చిపోయే మామూలు సినిమాలు కావు ఏవి.
అలాంటి కళాకారుడి విద్వత్తుకి ఈ రోజుకి పురస్కారం లభిస్తే ..తనలో లో కళను కాకుండా కులాన్ని మాత్రమే చూస్తున్న సో కాల్డ్ కుల గజ్జి మేధావులను చూసి జాలి వేస్తోంది.
యూనివర్సిటీ లో పిల్లని విప్లవ భావాలూ నూరిపోసి అడవులకు పంపి, జీతం తో పాటు భారీగా కొసర్లు సంపాదిస్తూ, తమ పిల్లని అమెరికాలకు పంపి , ధనువంతుల ఇళ్ల మధ్య లక్సరీ ఫ్లాట్ లో లో కులాసాగా ఓ చేత్తో బూర్జువా పెట్టుబడి దారి సిగిరెట్ లు పట్టుకుని విప్లవాలు కారాలు మిరియాలుగా నూరేసే ఏ ముద్దు గోపాలాల సర్టిఫికెట్ లు .. విశ్వనాధ్ గారికి అక్కర్లేదు.
ప్రేక్షకులు పట్టిన నీరాజనమే ఆయన కళకు నిజమైన సర్టిఫికెట్ ఎప్పుడో ఇచ్చేసింది. ఇప్పుడీ అవార్డు ఆయన్ను వరించి తనను తానూ గౌరవించుకొంది.
లాజికల్ లాజికల్ అంటూ వెతికే వాడికి మనిషి పుట్టుకలనూ అసభ్యత మాత్రమే కనిపిస్తుంది. అమ్మ తనాన్ని చూసే వాడికి పదినెలల అమ్మ కష్టం ప్రేమ కనిపిస్తుంది. చిత్రంగా రెండు వాదనలూ కరెక్టే. కానీ ఏది చూస్తున్నాం అనేది మాత్రం మన సంస్కారం నిర్ణయిస్తుంది.

avee ivee

ప్రతి రోజూ ఎంతో మంది గృహిణులు ఉరేసుకోడం , అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపుల్లో చావడం, భర్త కోపం తో కొట్టే చావు దెబ్బలు తిని చచ్చిపోడం ఇలాంటి వార్తలూ రోజు ..ఎంత లేదన్న ఓ పదో పాతికో చావులు ..లైఫ్ టెలికాస్ట్ లుండవ్. గోడ మీద పిడకలూ ఉండవ్
ఎందుకంటే.. ఎందుకంటే ఈ దేశం లో ఆడవాళ్ళూ "సాంప్రదాయ పద్ధతుల్లో " ఎంచక్కా చచ్చిపోవచ్చు
అప్పుడు అలా అలా ఇంట్లో స్త్రీలను చంపేసుకున్న సాంప్రదాయ కుటుంబాల పట్ల గౌరవంగా ఆ వార్తని చూసి చూడనట్లు అలా స్కిప్ చేసి. సదరు గౌరవనీయ కుటుంబాల గౌరవాన్ని మర్యాదనీ కాపాడేస్తాం . అలా పద్దతిగా చంపేసుకున్న భర్త గారి పేరు కూడా చెప్పకుండా ఆమె భర్త అని మాత్రమే చెప్పి ప్రైవసీ ని కాపాడేస్తాం
ఎటొచ్చి అలా చావకపోతెనే. .నీ చావేదో నువ్వే చచ్చినా . మేం చచ్చినంతగా ఫీల్ అయ్యి .చచ్చేంతలా ఊగిపోతాం .. నర హంతకుల ముఖాలకి సైతం ముసుగేసి గౌరవం కాపాడమని చెప్పే చట్టాన్ని కాసేపు అవతల పెట్టేసి . నీ ముఖాన్ని నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మొత్తం TV లో వెండి తెర మీద చూపించేస్తాం
యు నౌ ఈ దేశం లో ప్రైవసీ applicable ఓన్లీ సంప్రదాయ ఆత్మహత్యలూ సంప్రదాయ హత్యల కే హా 

క్యాలిక్యులేటెడ్ హ్యూమన్ రిలేషన్స్

! musings !!

అవసరానికో అవకాశాలకో స్నేహాలను అనుబంధాలను సునాయాసంగా వాడేస్తూ కృతిమ నవ్వులద్దిన మోములు పలికించే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ ల క్యాలిక్యులేటెడ్ హ్యూమన్ రిలేషన్స్ ని నిజమని భ్రమించే ఇల్యూషన్ ల లైఫ్ నుండీ విసుగొచ్చి పక్కకు ఒదిగి ఒక్క క్షణం నిలబడ్డప్పుడల్లా స్వచ్ఛంగా పలకరించే ఒకానొక అచ్చమైన నవ్వుతో జత కలిపి నడుస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది జీవించడం అంటే మరేం లేదు కాస్త నదిలా ఉరకలేస్తూ ప్రవహించడమేనేమో అని .

విరగ కాసిన వెన్నెల ఒడిసిపట్టిన రెళ్ళు పూలు వెదజల్లే కాంతి మధ్య తడుస్తూ నక్షత్రాల వైపు అనంతంగా సాగిపోతున్న నడక మిగిల్చిన శాశ్వతానందాల ముందు అశాశ్వతమైన కాలం కూడా ఓడిపోవాల్సిందే. తీరికలేని నాగరిక జీవనం ఉరుకుపరుగుల మధ్య నిష్ప్రయోజనం గా కదిలిపోతున్న క్షణాలను చూసి అశాశ్వతమైన క్షణాలు తిరిగి రావనుకుంటాం కానీ కొన్ని నిశ్చలమైన ఆనందాలను దిగంతాలు వ్యాపించిన వెలుగుపూల మధ్య ఆంతరంగిక ప్రేమైక భావనను ఒంపుకున్నప్పుడు క్షణాలకూ అమరత్వమేదో వచ్చేస్తుంది కాకుంటే రూపు మార్చుకొని జ్ఞాపకంగా గుండెలో స్థిరపడతాయేమో

అసలు ఇన్నాళ్లూ అజ్ఞాతంగా నాలోనే దాక్కున్నా కొన్ని అభావ వాక్యాలేవో ఇప్పుడిప్పుడే ప్రకృతినద్దుకొని అడవి మల్లెల అక్షరాలై రాలుతున్నాయి .ఎప్పటిదో ఎప్పుడు ఎలా మొదలయ్యిందో కానీ ఈ అన్వేషణ కృతిమత్వం నుండీ నెమ్మదిగా సహజత్వాన్ని కోరుకుంటూ కాస్త ప్రకృతి దిశగా అడుగులేస్తూ ఇలా సాగిపోవాలని బహుశా చెంతగా వెన్నెల విసిరే నీ నవ్వులని తోడు తీసుకెళ్లడం మొదలైనప్పటి నుండేమో



మార్నింగ్ రాగ (musings )



కురుస్తున్న తెలి మంచు తునకల నడుమ , మబ్బు తెరల మధ్య తొంగి చూస్తున్న నులి వెచ్చని తొలి వేకువ కిరణాలను హత్తుకుంటూ ఉషోదయాస్వాదనతో మన నడక సాగించడం అంటే ఓ రోజు మొత్తాన్ని నడిపించే తేజోమయ శక్తిని హృదయం లోకి ప్రవహింప చేయడమేగా .

చీకటి అశాశ్వతమని ప్రతీ చీకటి ముగింపు ఎప్పుడూ వెలుగు మాత్రమే అని ప్రభాత వెలుగు పూలు అందించే సందేశాన్ని అందుకుంటూ ..నిశ్శబ్డాలను చీలుస్తూ శ్రావ్యంగా వినిపించే కువకువల ప్రణవ నాదాలకు క్షణాలను శృతి చేస్తూ జతగా నడవడం ..అలసట దరిజేరని పగటి సమయాలపై రాస్తున్నముందుమాటలా ఉంది కదా.

ప్రకృతి తో సమయాలను అంటుకట్టడం అంటే కాలప్రవాహం లో దొర్లిపోయే ప్రతీ రోజుపై అనుభూతుల సంతకాలను బ్రతుకు పుస్తకం లో లిఖించుకోడమే కదూ .

ఇప్పుడు ఇలా నవ్వులు విత్తనాలు దారంతా జల్లుకుంటూ వెళ్తున్నాం గానీ ..మళ్ళీ ఈ దారంతా నడిచినప్పుడల్లా ఈ మోదుగు పూలు చెట్లకు ఆ కబుర్లు అన్నీ జ్ఞాపకాలుగా పూసి గాలి రెక్కలపై ఎన్ని పరిమళాలు మోసుకొస్తాయో

నిజంగా కాలం విలువ ఇప్పటిదాకా తెలియలేదు కానీ. విరిగిపడిన శూన్య శకలాలపై తిరిగి కలల్ని నిర్మించడం మొదలు పెట్టాక లిప్తలు కూడా ఎంత విలువద్దుకున్నాయో. అవ్యక్తమైన ఆనందాలన్నీ సజీవంగా మారితే అది నువ్వే అని ఇదిగో ఇప్పుడిప్పుడే నాకూ తెలుస్తోంది సుమా!!

ప్రాజెక్ట్ హింసలు

పిల్లల్ని స్కూల్ వేసేసి ఇక మా బుడంకాయలు హ్యాపీ గా చదివేసుకుంటారు ఓ మంచి స్కూల్ లో వేసేసాం అని హ్యాపీ గా ఫీల్ అయి సంబరపడి పోయినంత సేపు పట్టలేదు . "ప్రాజెక్ట్ వర్క్ " అనే ఓ భూతం అల్లావుద్దీన్ అద్భుత దీపం నుండీ హఠాత్తుగా వచ్చేసినట్లు అడుగుపెట్టి నా జీవితం తో ఆడుకోడం మొదలు పెట్టింది.
చిత్ర విచిత్రమైన ప్రాజెక్ట్ హింసలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు రోజూ రోడ్డు మీద పడి సెర్చింగ్ లే . దొరికాక ఇంకో గంటో రెండు గంటలో మొత్తం రెండు మూడు గంటలు ప్రాజెక్టార్పణం .
హమ్మయ్య ప్రాజెక్ట్ వర్క్ అయిపొయింది అని గాట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలినంత సేపు పట్టదు మమ్మీ అంటూ బస్సు దిగుతూనే "మా టీచర్ ఈ రోజు ప్రాజెక్ట్ ఇచ్చింది అంటూ ఇంకో బాంబు పేల్చడానికి
అయినా అన్ని ప్రాజెక్ట్ రోజులూ ఒక్కలాగే ఉండవ్  కొన్ని మరీ ఇబ్బంది పెట్టేస్తాయ్ అలాంటి ఓ దుర్దినం  సరిగ్గా ఆ రోజు మా కార్ డ్రైవర్ కూడా రాలేదు.
ఇండియా మ్యాప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫ్రీడమ్ కొని A4 షీట్ మీద పేస్ట్ చేయమంది అంటూ వచ్చాడు.ఇంట్లో ప్రింటర్ ఉంది నెట్ నుండీ ప్రింట్ తీస్తా నాన్న అంటే నెట్ లో డౌన్లోడ్ చేసిన ప్రింట్ not allowed అని రాసిన డైరీ చూపించాడు. ఆ ముక్క రెడ్ ఇంకుతో రాసి మరీ నొక్కి వక్కాణించేసింది టీచరమ్మ .
తప్పుతుందా. . ఇక ఆటో ఎక్కి మ్యాప్ కొనడం అనే ప్రక్రియ మొదలు పెట్టా. ఆబ్బె స్టేషనరీ షాప్ లు బిక్క మొహం వేశారు అలా వెతుకుతూ వెతుకుతూ కొంపదీసి దేశం దాటేస్తా నెమో అని భయం కూడా వేసి దొరకట్లే ఇక ఇంటికెళదాం అనగానే మా వాడు ఏడుపు మా టీచర్ కొట్టేస్తుంది అని .
పనిలో పనిగా ఆగిన ప్రతీ స్టేషనరీ షాప్ లో ..వాడి కంటికి ఆకర్శించిన వస్తువు కొనిపించేస్తూ వాడి పనిలో వాడున్నాడు. వెతగ్గా వెతగ్గా ఓ స్టేషనరీ షాప్ వాడు దయతలచి దుమ్ము కొట్టుకుపోయిన పేపర్లు అటక మీది నుండీ తీసి. ఇందులో వెతుక్కోండి అని జాలి పడ్డాడు. సరే తుమ్ముకుంటూ వెతుకుతూ ఉంటే అదృష్టం మ్యాప్ రూపం లో వచ్చి దొరికేసింది.
హుమ్మయ్య అని కొనేసి బయటకి రాగానే పెద్ద వర్షం దొరక్క దొరక్క దొరికింది తడిసిపోతే ఎలా అబ్బా అని ఆలోచించే లోగా మా వాడు దయతలచి పోనీలే అమ్మ అక్కడ McDonald కాసేపు కూర్చుందాం .ఆ మాట వినగానే ఇక మా పొట్టిది ఐస్క్రీమ్ కావాలి అంటూ పాట మొదలు పెట్టింది నాలుగు వీధులు వినబడేంత పెద్ద గొంతు వేసుకొని .అలా కొంటూ ఉంటే అలవాటయి పోతుంది అనేసి . భీష్మించి కూర్చున్నా
నా దురదృష్టం పక్కన నిల్చున్న వాళ్ళ రూపం లో మళ్ళీ తగులుకుంది పాపా అంతలా ఏడుస్తోంది పాపం కొనివ్వమా అంటూ ..ఇంకాసేపు అలాగే ఉంటే.. వల్లే తోసేసేట్టు ఉన్నారు ..సరే తప్పుతుందా McDonald లో కూర్చున్నాక ఇద్దరూ ఆర్డర్ చేసిన లిస్ట్ లు చదివించుకున్నాక ..బతుకు జీవుడా అని ఇంటికి చేరాం
లెక్క చూసుకుంటే. ఓ రెండు రూపాయల మ్యాప్ కోసం ఖర్చు పెట్టింది రెండువేల రూపాయలు, ఆటో ఖర్చులు, స్టేషనరీ షాప్ లో వాడు కొన్నవి, McDonald తిన్నవి ప్లస్ ఆ రోజులో ఓ మూడు గంటల సమయం
పొద్దున్న స్కూల్ వెళుతున్నప్పుడు వాడి మొహం లో ఆనందం చూసి ఆనందపడినంత సేపు పట్టలేదు ..సాయంత్రం రాగానే మా చిన్నది అమ్మ రేపు స్కూల్ లో రాఖీ మేకింగ్ competition అంటూ డైరీ చూపించింది. చూస్తే పెద్ద లిస్ట్ . ఇన్నేళ్ల జీవితం లో తయారు చేసిన రాఖీలు కొనడమే తప్ప ఎప్పుడూ తయారుచేసింది లేదు. పోనీ అదేమన్నా ఇంట్లో available వస్తువులతో అంటే కాస్త creativity తొక్క తోలూ అనుకోవచ్చు ఆబ్బె అదీ లేదు. "రాఖీ మేకింగ్ స్టఫ్ " అని మార్కెట్ లో కొత్తగా వచ్చాయట అగొ అవి మాత్రమే కొని వాడు చెప్పిన ప్రకారం మాత్రమే చేయాలి. .ఇక అందులో క్రియేటివిటీ ఏముంటుందో నా చిన్ని బుర్రకి అర్ధం కాక మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ దుర్దినం అని తిట్టుకుంటూ ..ఊరంతా వెతికి వెతికి మొత్తానికి కొని .. ఈ రోజు వెళ్లి స్కూల్ ..లో దాని చేత చేయించడం అదే లెండి పేరుకే బుజ్జి దాన్ని పక్కన కూర్చోబెట్టి నేను చేసి వచ్చా. అలా ఈరోజు శ్రమదానం
అసలు నాకో విషయం అర్ధం కాదు.
సబ్జెక్టు ఇంపార్టెంట్ అయితే.. నెట్ నుండీ డౌన్లోడ్ చేసినా సరిపోతుంది. కానీ ఇలా స్టేషనరీ షాప్ లో కొన్నదే ఎందుకో అర్ధం కాలే . ఈ రాఖీ మేకింగ్ కూడా నిండా నాలుగేళ్లు లేని పిల్ల ఏం చేస్తుంది. దాని బదులు మేము చేయడం వళ్ళ కలిగే ప్రయోజనాలు ఏమిటి. సొంతంగా తయారు చేయాలి అంటే కాస్త బుర్ర పెట్టి చేసేవాళ్ళం కానీ వాడిచ్చిన పాకెట్ లో వాడి ప్రకారం జాయింట్ చేసుకుంటూ పోడం లో పొడిచేసి creativity ఏముంటుంది. ఇలా తన్నుకొచ్చిన ఆవేశం అప్పుడే ఫోన్ చేసిన friend తో కక్కగానే అదీ మొదలెట్టింది దాని ప్రాజెక్ట్ కస్టాలు.
హోల్ పెపంచం అంతా ఐదో క్లాస్ లోపు పిల్లలకి హోమ్ వర్క్ వద్దు మొర్రో అంటాయి కనీసం ఆక్టివిటీస్ కూడా ఇంటిదగ్గర చేయమని చెప్పరు. మొత్తం స్కూల్ లోనే చేయిస్తారు. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు హోమ్ వర్క్ చేసే స్టేజి ఆరో తరగతి తర్వాతే నమ్ముతారు. ఆ మాట కొస్తే ఇండియా లో కూడా అధికారికంగా ఒక GO ఉంది ఇదే విధంగా కానీ ..ఆచరణలో నర్సరీ పిల్లలకీ హోమ్ వర్కులు ప్రాజెక్ట్ వర్క్ లు. .స్కూల్ నుండీ రావడం తోనే ఆడుకునే రోజులు పోయి. స్టేషనరీ షాప్ ల చుట్టూ తిరిగితే రోజులు మొదలయ్యాయి. ఫెస్టివల్ వస్తే ఈ కస్టాలు ఇక రెట్టింపు .
ఈ దేశానికేమయ్యింది.. .ఒక వైపు చదువులూ .ఇంకో వైపు ప్రాజెక్ట్ లు. ఎవరూ మాట్లాడరేం .. 
నాకేంటో మళ్ళీ LKG చేరినట్లు కలలొస్తున్నాయ్ రోజూ......పేరెంటింగ్ అంటే ఇదివరకటిలా ప్రోగ్రెస్ కార్డు లో సంతకం పెట్టినంత వీజి కాదు వాళ్ళతో పాటు మళ్ళీ చదువుకోడం .

"పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రహసనం "

పిల్లలు చదువులు శీర్షికలో
"పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రహసనం "
పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రహసనమా మరీ టూ మచ్ అనుకుంటున్నారా అవును టూ మచ్ మామూలుగా కాదు అత్యంత ఎక్కువ చాలా మచ్ (కొత్త పదం నేనే కనిపెట్టా ఎవరూ కనిపెట్టకపోతే పదాలు ఎలా పుడతాయి అని ) .
కొన్ని స్కూల్ లో నెలకో రోజు ..శనివారం స్కూల్ కి హాలిడే కనుక పేరెంట్స్ కూడా ఆఫీస్ లు సెలవు మంజూరు చేసేస్తాయి అని భ్రమించే స్కూల్ అవసరం ఉన్నా లేకున్నా క్లాస్ లో ఉన్న ప్రతీ పిల్లల పేరెంట్స్ జీ హుజూర్ అంటూ హజారీ వేయించుకోవాలి అంటూ నోటీసు జారీ చేసేస్తాయి . బాగా చదివే పిల్లల క్రెడిట్ ..స్కూల్ అకౌంట్ వేసేసుకుంటారు.
పాపం చదవని పిల్లకాయల పేరెంట్స్ బుర్రకాయలు అప్పడాల్లా నమిలేస్తారు .పిల్లల ముందు వాళ్ళ గురించి నెగెటివ్ చెప్పకూడదని సైకాలజీ కోడై మేకై కూడా కూస్తుంది . టీచర్ లు " నేరాలు ఘోరాలు " లో యాంకర్ మీ పిల్లాడు ..అంటూ చిట్టా విప్పడం..చెప్పడం . పేరెంట్స్ టీవీ ప్రేక్షకుల్లా ఆవేశపడి ఊగిపోతూ .బిక్కు బిక్కు మంటున్న బుజ్జి పిల్ల కాయల అమాయక మొహాల వంక కోర కోరా ..రా “ఇంటికి రా నీ తాట తీస్తా “ టైపు లో చూడ్డం. పాపం పిల్లలు ..
సరిగ్గా ఇలాంటప్పుడు నాకో డౌటానుమానసందేహం వస్తూ ఉంటుంది. అంత మంది టీచర్ లు కూడబలుక్కొని పొద్దున్న 8 నుండీ సాయంత్రం 3 వరకూ చెప్పినప్పుడు కూడా సరిగ్గా చదవలేకపోతున్న పిల్లవాడు . కేవలం ఇంటిదగ్గర తల్లి తండ్రులు చెప్పే గంటలో అద్బుతాలేమైనా సృష్టించేస్తాడా. అసలు ఆ పిల్లాడి శక్తి ఎంతవరకూ అని ఆలోచించి తల్లి తండ్రుల సహాయం కూడా తీసుకొని “సమష్టి గా” ఏదైనా చేయడం లో అర్ధం ఉంది కానీ. మొత్తం పేరెంట్స్ మీదే నెట్టేసి వాళ్ళకి క్లాస్ పీకడం ఏంటి. పాపం వాళ్ళు కళ్లలో నీళ్లు దిగమింగుకొని దోషుల్లా నిలబడ్డం ఏంటి వేలకి వేలు స్కూల్ చేతుల్లో పోస్తూ కూడా .మొత్తం భాద్యత పేరెంట్స్ దే అయితే ఇక స్కూల్ ఎందుకు ?
సరే బాగా చదవని పిల్లల పేరెంట్స్ బుర్రలే తింటారా ఆబ్బె లేదు బాగా చదివే పిల్లకాయల పేరెంట్స్ బుర్రలూ యధోశక్తి తింటారు మాథ్స్ ఒలింపియాడ్ , సైన్స్ ఒలింపియాడ్ ,, abacus , క్యూ మాథ్స్ , ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్సీ లాంటి బుక్స్ కొనిపించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎగ్జామ్స్ కి అటెండ్ కావాలి అంటారు. ఇక్కడ ఛాయస్ ఉండదు. మస్ట్ అంతే .
బాగా చదివే పిల్లలకీ ఏవో బుక్స్ అంటగట్టి divert చేయడం ..మళ్ళీ తర్వాత మీ వాడు డల్ అయ్యాడు అంటూ మాకే క్లాస్ లు పీకడం మళ్ళీ ఆ వంక పెట్టి ఇంకొన్ని బుక్స్ అంటగట్టడం స్కూల్ లో చదువుకుంటూ ,ఇంటిదగ్గర రివిజన్ చేసి కాసేపు హోమ్ వర్క్ చేసి తర్వాత ఆడుకుంటూ హ్యాపీగా ఎదగనివ్వాలి . వాళ్ళకి మంచి చదువులు చెప్పించగలం కానీ పోగొట్టుకున్న బాల్యాన్ని తిరిగి ఇవ్వగలమా ? ఎడ్యుకేషన్ లోనే కాదు ఎమోషనల్ గా కూడా balanced గా ఎదగనివ్వాలి కదా.
మెజారిటీ స్కూల్ లో ఇప్పుడు ఇదే పరిస్థితి అని నిర్ధారించుకుని రాసాను. గత దశాబ్ద కాలంగా చదువుల తీరు మారుతూ వస్తోంది. ఇంజనీరింగ్, IIT అనే గోల్ లో పిల్లల్ని పడేయడం తల్లి తండ్రుల లక్ష్యం ..వారి బలహీనతలను ఆకర్షించే కాన్సెప్ట్ స్కూల్ , ఆరోతరగతి నుండే IIT ఫౌండేషన్ లు.
ఇక్కడ తల్లి తండ్రులదీ తప్పే . పిల్లలు అంటే చదువుకోడం తప్ప వాళ్ళకి ఆటలు అవసరం అనే తలంపు రాని ఎంతో మంది పేరెంట్స్ ని చూసాను. ఈ వత్తిడి విద్యావిధానం పట్ల ఫిర్యాదులు లేకుండా హ్యాపీగా కార్పొరేట్ స్కూల్ కి cooperate చేస్తున్నారు మన కోసమే కదండీ అంటూ .
యధా పేరెంట్స్. తదా స్కూల్స్ అనుకోవాలేమో. పిల్లలు వత్తిడి లేకుండా హాయిగా ఎదగాలి అని తాపత్రయ పడే మా లాంటి పేరెంట్స్ మాత్రం కొద్దీ మందే

Monday, December 25, 2017

సుప్రీమ్ కోర్ట్ తీర్పు

మైనర్ భార్య విషయం లో సుప్రీమ్ కోర్ట్ తీర్పు మీద ఎంతో మంది పెద్దలు అనుకున్న వాళ్ళు ఇలాంటి తీర్పుని స్వాగతించాల్సింది పోయి అవమానకరం గా హేళన గా పోస్ట్ లు పెడుతున్నారు. ఇంత సున్నితమైన విషయం మీద కామెడీ చేస్తుంటే బాధేస్తుంది. దాని వెనుక సామజిక ఆర్ధిక కోణాలు చూడాలి అంటూ తర్కాలు చేసే వాళ్ళు కొందరు. ఏముంటాయి సామజిక ఆర్ధిక కోణాలు ?

పున్నామ నరకము అదీ ఇదీ అంటూ మగపిల్లల కోసం హిందువులు . అల్లాహ్ శపిస్తాడు అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే అని ముస్లిం లూ సంతానం పెంచుకుంటూ పోవడం . తర్వాత పోషించే స్తోమత లేక ..ఆడపిల్లల్ని పెళ్లి పేరుతో వదిలించుకోడం. ఎలా సమర్ధిస్తాం ఇంత చెత్తని.నిజానికి ఇవి పెళ్లిళ్లు కావు. ఆడపిల్లని బెదిరించి .పెళ్లి చేసి బలవంతంగా శోభనం గదిలో తోసి మానసికంగా ఇష్టం లేని వ్యక్తి తో కలవాలని శాసించడం అంటే తల్లి తండ్రులే దగ్గరుండి మరీ వ్యభిచారం చేయించడం కాదా ?

50 శాతం వివాహాలు బాల్యవివాహాలు అందులో చాల వరకూ ఆ పిల్ల ఇష్టాలతో ప్రమేయం లేకుండా జరిపేవి. అని స్పష్టంగా అధికారిక నివేదికలు చెప్తున్నాయి. దాదాపు చాలా వరకూ మాత శిశు మరణాలు , ప్రసవానంతర మరణాలూ అన్నీ ఇలా బాల్య వివాహాలు బారిన పడ్డ స్త్రీలవే.

ఇన్నాళ్లూ మతాల పేరుతో స్త్రీ శారీరక స్థితి ఆమె మనసునూ ఏదీ పట్టించుకోకుండా తెలుసుకోకుండా పురుషులు తమని తమ అవసరాలని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారంగా అశాస్త్రీయమైన మత గ్రంధాలు రాసి ఎంతో మంది స్త్రీలను బలి తీసుకున్నది చాలదా ? ఇప్పుడైనా ఇలాంటి తీర్పులను మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో మంచి అడుగులుగా గుర్తించాల్సిన అవసరం లేదా ? మార్పు కోసం జరిగే ప్రక్రియలో ఇలాంటివి అన్నీ ఉపయోగపడతాయి. శాస్త్రీయ విషయాల మీద ఏ మాత్రం అవగాహనా లేని రోజుల్లో రాసిన అన్ని మత గ్రంధాలను ఇప్పటికీ పట్టుకొని వేళ్ళాడుతూ అదే ప్రామాణికం అనుకోడం మూర్ఖత్వమే. .
ఎంతో మంది బాల్యవివాహాలు చేసుకున్న పిల్లలని కలిసాం ఓ ngo లో వర్క్ చేస్తున్నప్పుడు. కళ్ళలో నీళ్లు ఆగవు. మనిషిగా పుట్టినందుకు ఒక్కక్షణం అసహ్యం వేసి చచ్చిపోవాలి అనిపిస్తుంది. సామాజిక కోణాలు ఆర్ధిక కోణాలు తొక్కా తోలూ అంటూ సమర్ధించే ప్రయ్నతాలు చేయడం కాదు పెంచే స్థోమత లేనప్పుడు ఎందుకు కనడం పందులూ కంటాయి వాటికీ మనకీ తేడాలేదూ ... నిర్ణయాలు తీసుకునే వయసూ, లైంగిక జీవితం పట్ల అవహగానా రెండూ ఉండని వయసు. తీరా పెళ్లి అయ్యాక భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
ఆమె ఇష్టప్రకారం జరిగితే ఆమె కోర్ట్ కి వెళ్ళదు కదా ..బలవంతంగా పెళ్లి జరిగినప్పుడు ఇక అలాంటి పరిస్థితి తాను భరించలేనని ఆమె అనుకున్నప్పుడు ఎవరి సహాయంతో నైనా కోర్ట్ గడప తొక్కితే ..ఇలాంటి తీర్పులు ఆమెకి సహాయపడతాయి. ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేకుండా బాల్యవివాహాలు తప్పని తెలిసీ చేసుకోడం ఆ పై బలవంతంగా పసిపిల్లలను రమించేవాడు బతికినా చచ్చిన శవంతో సమానం ఆలాంటి వెధవలు నుండీ ఆమె కి రక్షణ అక్కర్లేదా ? ఎందుకు ఈ తీర్పుని వ్యతిరేకిస్తున్నాం ?
ఇలాటి చట్టాలు దుర్వినియోగం అవుతాయని కొందరి వాదన. .ఈ తీర్పు పూర్తిగా మైనర్ వివాహాలకి సంభందించినది ..మైనర్ వివాహం కాకపొతే గొడవే లేదు దుర్వినియోగం అవుతుందని. ఒకవేళ మైనర్ వివాహమే అయితే అసలు అలా చేసుకోడమే చట్ట విరుద్ధం అయినప్పుడు .ఇక దుర్వినియోగం ప్రసక్తి ఎక్కడుంది .చట్ట విరుద్ధమైన పని చేసి. ..వాళ్లెవరో చట్టం దుర్నివియోగం చేసి కేసు లు పెడతారని భయపడడం ఏంటి వింతగా

ఈ లలితా కిరణాలూ



ఈ లలితా కిరణాలూ ,, ధన సంహరణాలు ,, చైతన్య రహితాలు , మౌన రోదనలూ "
(ఈ ఉష కిరణాలూ సాంగ్ లా పాడుకోండి కాస్త )

టీవీ లో లలితా జెవెల్లెర్స్ ప్రకటనల పుణ్యం కాస్త , పండగ లు కాస్త మొత్తానికి ఆ షాప్ ముందర ఉన్న ట్రాఫిక్ ,వాహనాలు చూసి కళ్ళు జిగేల్మని . అలా సాంగ్ సింగేసుకున్నాక ఇలా రాయాలనిపించి

బంగారం మంచి ఇన్వెస్ట్మెంట్ అని మన దగ్గర అనుకుంటాం అవసరానికి ఆదుకుంటుంది కానీ నిజానికి ఇక్కడ మనల్ని ఆదుకునేది .."పొదుపు" ..బంగారం కాదు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా ఆదుకుంటుంది అది బంగారమే కానక్కర్లేదు .

భర్త సంపాదన ,ఎంత సేవ్ చేస్తున్నాడు ఇత్యాది విషయాలు ఇంటి ఆర్ధిక పరిస్థితి భర్త షేర్ చేయనప్పుడు అభద్రతా భావంతో ఉన్న సంపాదన లేని స్త్రీలకి మాత్రమే తమవంతుగా భవిష్యత్తు కోసం బంగారం రూపం లో దాచి ఉంచడానికి ఇన్వెస్ట్మెంట్ గా కాస్త ఉపయోగపడేది .

ఒక వేళ ఆ understanding భార్య భర్తల మధ్య నిజంగా ఉండి కలిసి ఆర్ధిక పరమైన విషయాల మీద నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడు బంగారం నగలు కొనడం .. ఇన్వెస్ట్మెంట్ కి బెటర్ ఛాయస్ మాత్రం కాదు ఎంత బ్రాండెడ్ షాప్ అయినా మనం వాళ్ళ దగ్గర కొన్న నగని ఆ మర్నాడు అదే షాప్ లో అమ్మడానికి ప్రయత్నిస్తే అంతే డబ్బు వస్తుందా రాదు అంతెందుకు కొన్న పది నిముషాల్లో ఆ పక్క కి తీసుకెళ్లి అమ్మినా ఎంత ధరకి కొన్నామో అంత రాదు. బంగారం ధర పెరుగుతుంది కదా అంటే అది ఇతర ఇన్వెస్ట్మెంట్ ల పెరుగుదల తో పోలిస్తే ఎక్కువ ఏమీ కాదు. పైగా అమ్మేటప్పుడు బంగారం ధర మీద 80 శాతం మాత్రమే పొందగలుతాం అదీ కాకా అందులో పొదిగిన రాళ్ళూ ఇవేవీ consider చేయరు .కొనేటప్పుడు వీటన్నటికీ మనం పే చేస్తాం

మనదేశం లో బంగారం ఖనిజ నిల్వలు లేవు ఉన్నదల్లా దాని మీద మోజే . బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలి అవసరాలకి తగ్గట్లుగా . దాని కోసం దేశం చేసే ఖర్చు పరోక్షంగా Current Account Deficit కారణం అవుతోంది . పెట్రోల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ కన్నా కూడా మన దగ్గర ఎక్కువ గా ఉండడానికి బంగారం దిగుమతి కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే విదేశ మారక నిల్వలూ ఒక కారణం . ఎకానమీ మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తూ GDP గ్రోత్ రేట్ నెమ్మదించడానికి ..ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా కాకుండా ఎన్నేళ్లయినా "developing country " గానే మిగిలిపోడానికీ బంగారం బంగారం లాంటి పాత్ర పోషిస్తోంది. దేశం లో నల్ల కుబేరాలకూ అడ్డా ..ఈ బంగారమే

ఇది ఆర్ధికపరమైనవి అయితే సామాజికంగా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి

బంగారం ఫంక్షన్ లలో ఒక ఆర్ధిక బల ప్రదర్శనగా మారిపోయింది. ఎప్పటికప్పుడు మారుతోన్న లేటెస్ట్ మోడల్ లను తమ మెడల్లో దింపేసుకుంటే కానీ మనశాంతి పొందని స్త్రీలెందరో . సరే తమ సంపాదనతో కొనుక్కుంటే అది వేరు కానీ భర్త మాత్రమే వంటి చేత్తో సంపాదించే కుటుంబాల్లోనూ ,బంగారం కొనుగోళ్లు కోసం భర్తలను వత్తిడికి గురి చేస్తున్నారు . పండగలు వస్తున్నాయంటే ..షాపింగ్ వ్యయాలకిలకి భయపడుతూ ఆదాయ వ్యయాల లెక్కలు చూసుకునే దుఃఖాన్ని దిగమింకుని మరీ బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించే మగ కోలీగ్స్ ని చూసి పాపం 
స్త్రీల మధ్య జరిగే ఈ ఆర్ధిక ప్రదర్శనల ల్లో పొంగి పొర్లే అహంకారాలూ , ఆత్మనూన్యతలూ, అసూయలు ..ఇంకా బంగారంలాంటి స్నేహాలు. ఉన్నట్లుండి బగ్గుమని మండి "పోవడానికి " అప్పుడప్పుడు కారణాలు కూడా ఈ బంగారమే

"వ్యక్తిత్వం , ఆత్మవిశ్వాసం తో నిండిన కళ్ళు , పెదవుల మీద చెరగని చిరునవ్వు " మనిషికి నిజమైన ఆభరణాలు కదా. ..అది వదిలేసి ఈ "లోహాల" వెంట పరుగులేంటి

మార్కెట్ లో కొత్త మోడల్ లు వచ్చాయనో, పండగ వచ్చిందనో , ఫాషన్ ప్రదర్శన కోసమో, బల ప్రదర్శన కోసం బంగారం కొనడం కాదు ..ఒక పద్దతితో చేసే ఇన్వెస్ట్మెంట్ లో భాగం గా అవసరార్ధం లేదా అవసరమైన చోట మాత్రమే బంగారం ..

ఆ చేత్తో కాస్త దేశ సేవ కూడా చేసినట్లే బంగారం లాంటి దేశాన్ని. . అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోడానికి మనమూ కాస్త ప్రయత్నించినా వాళ్ళం అవుతాం నిజంగా నిజం. లలిత జవెల్లెర్స్ మీద వట్టు. 
మన ఐడెంటిటీ నీ ఇతరులకన్నా మెరుగ్గా నిరూపించుకోడానికి ..వేసుకున్న బంగారమే ప్రాతిపదిక అయితే అంత కన్నా భావ దారిద్య్రం ఇంకోటి ఉండదు

ఇంతకన్నా ఎక్కువ చెపితే లేడీస్ దండ యాత్ర చేసే ప్రమాదం ఉందని ఆపేస్తున్నా 

పాపో రక్షతి రక్షితః by God

ఆ విధంగా పాపములు ఏడాదంతా చేసి . పర్వదినములందు భక్తితో . ఛానల్ లో అయ్యవార్ల పాప విమోచన సలహాలను "తూ" "ఛ " తప్పకుండా పాటించి మన పాపములన్నియూ భక్తిగా దేవునికి సమర్పించి చిత్ర గుప్తుడి బాలన్ షీట్ లో . పాప పుణ్యాల లెక్కలు సరి చేసుకోవచ్చును .

ఒక వేళ హిందూ మతం లో పుట్టకపోవడం వాళ్ళ ఈ ఫెసిలిటీ మిస్ అయిన వాళ్ళు ఏ మాత్రం చింతించ నవసరం లేదు. చర్చి లో పాస్టర్ ఇచ్చిన పవిత్ర జలం సేవించి .కిందపడి గిలా గిలా తన్నుకుంటూ దొర్లి దొర్లి శుద్ధుడై పోవచ్చును మీరు కింద పడి చిత్ర విచిత్రముగా గిల గిల మని తన్నుకోవటానికి చర్చి లో ధవళ వస్త్రధారులైన దేవ దూతలు సహాయం చేయుదురు .

అట్లే మీ పాపా భారం మోయలేక చతికలపడిన మీకు దర్గా యందు మంత్రించిన తాయెత్తు తో మిమ్ములను తిరిగి మామూలుగా చేయుదురు .

మరి యొక్క మిక్కిలి ఆనంద దాయక మైన విషయం ఏమనగా ఈ పాపముల చిట్టా అన్ని మతములు యందు ఒకే రీతి లేనందున ..కొన్ని మతములు అత్యంత పాపములనూ పాపముగా చూడనందున . .మాహా పాపులారా మన పాపములు ఏ మతం అనుమతించునో అక్కడ కి మనం జంప్ జిలానీలుగా దూక వచ్చు.

ఈ యొక్క పాపా విమోచన సదుపాయం మనకు అన్ని మతములందు వేరు వేరు ప్రక్రియల ద్వారా ,వేరు వేరు నామములతో అందుబాటులో ఉన్నందున. పాపులు ఇక యెంత మాత్రం చింతించనవసరం లేదు.

పాపులారా మతముల యొద్దకు రండు, వచ్చి నిద్రించుడి . పాపో రక్షతి రక్షితః

వచ్చి ఇట్టి సదవకాశం పెసాదించిన మన మతములనందు మిక్కిలి మోహావేశం కలిగి , ఆ సాలె గూటి యందు పెసాంతంగా చేరి పాపములు దాని ప్రక్షాళనములూ రెండునూ సమంగా చేయుచూ మన మెదడు పై భారం లేకుండగా స్థిత ప్రజ్ఞత సాధించి ఇక నిద్రించవచ్చును . ఇట్టి మన సుదీర్ఘ నిద్రావస్థకి భంగం కలిగించు వారినెవరినైనా ఉపేక్షించ తగదు. వీర సైనికులవలె పోరాడి పోరాడి ,మతమును సాలె గూడుని భద్రం గా కాపాడుకుంటూ తిరిగి మన మెదడు ని నిద్రపుచ్చవలెను. ఇట్లు చేయుట మీ యొక్క ముఖ్య విధిగా గుర్తించ వలెను.

ఈ కధ చదివిన వారికీ , విన్న వారికీ సకల పాపములు తొలగి ..మరిన్ని పాపములు చేయుటకు అనుమతి దొరకును.
..బ్లాగ్ యందు చదివినచో .ఫల శృతి దక్కును అని సూత మహాముని ఉవాచ

శుభం భూయాత్. ఓ శాంతి శాంతి .
ఆమెన్ (ఎహె ఆమెన్ అంటే "ఆ మెన్ " కాదహే దిక్కులు చూడకండి )
అల్లా అచ్చా కరేగా
సబ్ కా మాలిక్ ఏక్ హై (ఓ కౌన్ హై అని అడక్కండి నాకు భీ తెల్వద్) 
ఒక కుక్కని చంపాలి అంటే ముందు దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేయాలీ అని సామెత . ఇప్పడూ ఫెమినిజాన్ని చంపాలి అంటే .ముందు అదో పనికి మాలిన వ్యవహారం లా చిత్రీకరించాలి . ఇలా చిత్రీకరించడం లో పురుషులు దాదాపు విజయం సాధించారు. ఇప్పుడు ఫెమినిజం బూతు పదమే. దురదృష్టవశాత్తు కొందరు స్త్రీలూ అదే బాటలో వెళ్తున్నారు.

కొందరు ఫెమినిస్టు లో , కొన్ని సంఘాల్లో తప్పు చేస్త్తే నిందించాల్సింది వారి భాద్యతా రాహిత్యాన్ని తప్ప స్త్రీ వాదాన్ని కాదు. స్త్రీ వాదం ఒక భావజాలం. అది ఏ ఒక్క సంఘానికో , వ్యక్తికో చెందింది కాదు

"స్త్రీ సమస్య గురించి స్పందించే ప్రతి మనిషి/హ్యూమన్ భావజాలమే ఫెమినిజం."

అలాంటి వ్యక్తులెవరైనా అందరూ ఫెమినిస్టు లే. అలా సహాయం చేయాలి అనుకుంటే ముందుగా సమాజం లో ,ఇంట్లో ఆ భావజాలం పట్ల గౌరవము ఉండాలి. అది మనమే పోగొట్టుకుంటే అంత కన్నా ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు . ఒకరికి సహాయం చేయడం మాట దేవుడెరుగు ముందు మనల్ని మనమే రక్షించుకోలేం . స్త్రీ వాదం కనుమరుగైతే ప్రతి మూడాచారం తిరిగి మొదలుతుంది. మతపరమైన రాజ్యాలుగా పరిణామం చెందిన ప్రతీ దేశము లో అదే జరిగింది. ఒకప్పుడు ఉన్నత చదువులు చదివిన స్త్రీలు ఉన్న దేశాల్లో ఇప్పుడు స్త్రీల చదువు నిషిద్ధం చేయబడింది.

పేద దళిత ఆదివాసీ స్త్రీల వ్యధలూ అర్ధం చేసుకొని పరిష్కారం దిశగా స్త్రీ వాదాన్ని మరింత విస్తృత పరుచుకోవాలి.. కానీ అసలు స్త్రీ వాదులే వద్దు స్త్రీ వాదమే వద్దు అని వెక్కిరించుకుంటూ కూర్చుంటే వారి జీవితాల్లో మార్పు కి ప్రయత్నించే స్త్రీలు/పురుషులు మాత్రం ఎక్కడ నుండీ పుట్టుకొస్తారు ?

" ఫెమినిజమ్ అంటే పురుషులని ద్వేషించడం కాదు. పురుష ద్వేషంగా మారాల్సిన అవసరమూ లేదు "

పురుషుల సానుభూతి లేదా వారి సహాయం కోరడం అంత కన్నా కాదు. స్త్రీల విషయంలో పురుషుడి ఆలోచన విధానం లో మార్పు కోరుకోవడం. స్త్రీ ల పట్ల ఇంకా ఉన్న కొన్ని ఆచారాలను పూర్తిగా రూపు మాపడం. స్త్రీ సొంత వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవల్సిన అవసరాన్ని గుర్తించడం .

మానతా దృక్పధం తో స్పందిచడమే స్త్రీ వాదం కూడా. మానవతా ఒక చెట్టు అయితే లో ఇదో కొమ్మ అంతే. స్త్రీల గురించి స్పందించడం అంటే మిగిలిన వాటి గురించి స్పందించక పోవడం కాదు .స్త్రీల గురించి కూడా ఆలోచించడం.

నేనూ ..ఓ నంది కేశ్వరనోమూ

నేనూ ..ఓ నంది కేశ్వరనోమూ పెద్ద గాధ .కాస్త ఓపిగ్గా చదవండి ఫలశృతి దక్కుతుంది మరి : 
రేపు నందికేశ్వర నోము పొద్దునే 8 గంటలకి ప్రసాదానికి వచ్చేయండి అంటూ బొట్టు పెట్టి మరీ పిలిచింది మా పక్కింటావిడ .మర్నాడు ఆఫీసు మీటింగ్ . కస్టమర్ కి presentation ఇవ్వాలి అదీ వాళ్ళ ఆఫీసు లో నే బోర్డ్ అఫ్ directors ముందు . చాల పెద్ద టెలికాం కంపెనీ జాగ్రత్త ఈ ఆర్డర్ విషయం లో అంటూ వారం ముందు నుండీ ఊదర కొడుతున్నాడు మా బాస్. అదే విషయం చెప్పేసాను రేపు కుదరేదేమో ఆంటీ ఆఫీసు లో అర్జెంటు పని ఉంది అని. అయ్యో అలా అంటే ఎలా అమ్మాయి ఎంత సేపు ఓ పది నిముషాలే తినేసి వెల్లిపోదువులే అంటూ బతిమాలింది.
సరే తప్పుతుందా అనుకుంటూ మర్నాడు పొద్దునే 8 గంటలకి వెళ్లాను అప్పటికే అక్కడా అంతా హాడావిడి . ప్రసాదం అంటే ఏ పులిహారో పెడతారు అనుకుని బోల్డు ఆశపడ్డ నాకు అరిటాకులో భారీ ఎత్తున పరమాన్నం అదీ బెల్లం తో చేసింది పెట్టేసారు ద్యావుడా నేనసలే స్వీట్లు ఇష్టపడను పొద్దు పొద్దునే ఇదెలారా తినడం అనుకుంటూ ఉంటే ఆకులో ఏదీ మిగల్చకూడదమ్మ అంటూ వాళ్ళ అత్తగారు చిన్న సైజు ఆజ్ఞ వేసేసారు . పక్కనో గ్లాస్ నీళ్ళు పెట్టుకొని అతి కష్టం మీద ఏదో తినేసాను హమ్మయ్య అనుకుంటూ లేచే లోపు మళ్ళీ తిన్న దానికి రెండింతలు మళ్ళీ అడక్కుండా వేసేసింది ..
ఆంటీ నా వాళ్ళ కాదు ఇంతకన్నా తినలేను బాబోయ్ అని మొత్తుకున్నా . చేసిన ప్రసాదం మొత్తం సాయంత్రం లోపు అయిపోవాలి లేకపోతె ఫలితం దక్కదు ..మీరంతా ఈ వక్కరోజు కష్టపడాలి తప్పదు అంటూ నవ్వేసింది మహా తల్లి.
ఇలా ఆవిడకు పుణ్యం ప్రాప్తించడం కోసం తప్పని సరిగా భాద్యతను భుజాల మీద వేసుకొని రెండో సారి .. లోపల పొంగుకొస్తున్న ఏడుపు బలవంతంగా ఆపుకొని గంట కష్టపడి అయ్యిందనిపించాను మధ్య మధ్య చర్నాకోల్ జులిపిస్తూ పెద్దావిడ తిను తిను అంటూ .అప్పటికే టైం అవుతోంది తినేసి గబా గబా ఆటో పట్టుకొని బయలుదేరాను ..దారి మద్యలో ఒకటే తిప్పడం వోమిటింగ్ సెన్సేషన్ . చివరకి దారి మధ్య లో మొత్తం కక్కేసాను .డ్రెస్ కొంచెం పాడయింది. మీటింగ్ కి వెళ్ళాలి ఎలా రా బాబు అనుకుంటూ ..వెనక్కి వెళ్ళే టైం లేదు. బేగంపెట్ దగ్గర shopper stop దగ్గర కాసేపు ఆటో ఆపి ..మళ్ళీ ఇంకో డ్రెస్ కొని (షాప్ లో పాపం కాసేపు నన్ను క్షణం క్షణం లో బ్రహ్మానందం చూసినట్లు చూసారు  ) trial room lo మార్చుకొని ..మళ్ళీ ఆటో ఎక్కేసాను .
అయినా వోమిటింగ్ సెన్సేషన్ తగ్గదే..అతి కష్టం మీద ఆఫీసు చేరుకొని అపటికే నా కోసం వెయిటింగ్ అంతా . why late revathi అంటూ మా బాస్ question . stomach upset అంటూ సంజాయిషీ ఇస్తే ..ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ తెలుసుగా నిన్న ఒక్కరోజు ఫుడ్ విషయం లో కేర్ తీసుకోవచ్చు గా అంటూ .నిన్నల్లా అడ్డమైన గడ్డీ తినకపోతే ఏం నష్టం అనే టైపు లో ఓ సీరియస్ లుక్కొకటి విసిరాడు. .
సరే మొత్తానికి presentation ఇచ్చేసి ..ఊపిరి పీల్చుకున్నా .మీటింగ్ అయిపోతే ఇంటికి చెక్కేయోచ్చుఅని.
మీటింగ్ అవ్వగానే " you have done wonder full job ..we will conclude the meeting after lunch " ..అంటూ వచ్చారు managing director . అప్పుడు కాని వెలగలేదు మీటింగ్ followed by లంచ్ అన్న విషయం ..వామ్మో ఇంకో భోజనమా ఇంకా ఎక్కడ తినను.
సర్ vomiting sensation గా ఉంది మీరు కానివ్వండి అనేసి కాసేపు అలా సీట్లో relax అవుతుంటే .ఆఫీసు బాయ్ ఓ పెద్ద ప్లేట్ నా ముందు ఉంచాడు madam మీరు లంచ్ చేయలేదు అని మీకు స్పెషల్ గా ఇది ఆర్డర్ చేసారు మా సర్ అని చూద్దును కదా దాన్నిండా గులాబ్ జమూనులు ఇంకా ఏవేవో రకరకాల స్వీట్లు . నేను తినలేను అని సున్నితం గా వద్దు అని చెబుతుండగా మళ్ళీ ఊడిపడ్డాడు మా MD .
మనం కస్టమర్ ప్లేస్ లో ఉన్నాం ఫార్మాలిటీస్ maintain చేయాలి .లంచ్ చేయకున్నా పర్లేదు మరీ ఇది కూడా తినను అంటే ఎలా "It looks so embarrassing revathi " అంటూ మళ్ళీ ఇంకో ఆర్డర్ లాంటి వేడుకోలు తో కూడిన బతిమాలడం లాంటి బుజ్జగింపు 
.
మళ్ళీ కంపెనీ పరువు నిలబెట్టడం కోసం ఇంకోసారి ఒక్క స్వీట్ ముక్క నోట్లో వేసుకున్న అంతే .. ఈ సారి మాత్రం నా స్టమక్ నా మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది. మళ్ళీ vomiting s . ఈ సారి ఇంటికి వెళ్తా అని అడగాల్సిన అవసరమే రాలేదు. పాపం వాళ్ళే కంగారు పడి అర్జెంటుగా డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి మా వారికి ఫోన్ చేసారు.
ఆ తర్వాత ఓ నెల రోజులు ఫుడ్ ఉన్న ప్లేట్ చూస్తే.. ఏం జరిగిందో చెప్పకర్లేదు కదా. నందికేశ్వర నోము పుణ్యమా అని ఆ నెల రోజుల్లో అలా ఫుడ్ అలెర్జి వచ్చేసింది.
ఆవిడకు బోల్డు పుణ్యం వచ్చిందో లేదో తెలియదు కానీ ..నాకు బోల్డు అలెర్జి మాత్రం వచ్చేసింది అదండీ సంగతీ 

freindhsip..

ఎక్కడ మనం మనలా స్వేచ్ఛగా ఉండగలుగుతామో అక్కడ దొరికేదే "నిజమైన స్నేహం " మిగిలినవన్నీ స్నేహాలుగా భ్రమింపచేసే మంచి పరిచయాలు మాత్రమే
ఈ పరిచయాన్నీ రైలు ప్రయాణం మధ్యలో ఎక్కే కో పాసెంజర్ లాంటివి మనతో కొంత సేపు ప్రయాణించి నవ్వించొ ఏడిపించో మధ్యలో ఎక్కడో దిగాల్సిన స్టేజి రాగానే దిగిపోతాయి .
ఓ నిజమైన స్నేహం మాత్రమే మధ్యలో మిడిల్ డ్రాప్ కాకుండా మన గమ్యం చేరుకునే దాకా లైఫ్ జర్నీ మొత్తం ఉత్సాహపరుస్తూ తోడొస్తుంది.
అన్ని స్నేహాలు అవసరమే.. కొన్ని instant ఎనర్జీ కోసం . కొన్ని "ఇన్నర్ సెల్ఫ్ ఎనర్జీ " కోసం

తమిళనాడు సరికొత్త రాజకీయ సమీకరణాలు

సెంటిమెంటు బలంగా పండే తమిళనాడు లో. అన్నా మొదలెట్టిన ద్రవిడ సెంటిమెంట్ ని బలంగా ముందుకు తీసుకుపోయిన పార్టీ లు రెండు. aidmk ,dmk . ఈ ద్రవిడ సెంటిమెంట్ ఎంత బలమయ్యింది అంటే తమిళ నాడు లో వంద పార్టీ లు పేర్లు రాస్తే అన్నిట్లో ఈ పదం ద్రవిడ పదం ఖచ్చితం గా ఉంటుంది. .

తమిళనాడు లో కొన్నేళ్లుగా బలంగా పాతుకుపోయిన ఈ రెండు పార్టీ ల లో కూడా అంతర్గతంగా నడిచేది రాచరికమే. ఆ పార్టీ  నాయకులనబడే మర్రిచెట్టు నీడలో మరో నాయకులు తయారవ్వలేదు. జయ మరణం తో aidmk లో విభేదాలుఓ వైపు  అన్నాడీఎంకే పార్టీ రెండు గా చీలిపోవడం ఖాయం , మరో వైపు dmk లో స్టాలిన్ అళగిరి మధ్య విభేదాలు ఇద్దరి కొడుకుల మీద పట్టుకోల్పోయి వయోభారం తో కరుణాననిధి . రేపు కరుణ అనంతరం డీఎంకే కూడా రెండు గా చీలిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది.

సరిగ్గా ఇదే అదనుగా తమిళ్ నాడు కోటాలో పాగా కదపడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. నేరుగానో లేదా  అటు ఆ రెండు పార్టీ ల లో కలిసి వచ్చే ఎదో ఒక పార్టీ పొత్తు తోనో అధికారం చేప్పట్టే దిశగా అడుగులు వేస్తోంది

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నెల రోజుల పాటు హాస్పిటల్ ఉంటే అత్యంత గోప్యంగా ఆమె వివరాలు చెప్పకుండా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించడమో పరిస్థితి ని అదుపులో తీసుకొని పాలనా వ్యవహారాలు జయ రికవర్ అయ్యేవరకూ గవర్నర్ చేతిలో పెట్టడమో చేయాలి. కానీ అవేమీ చేయకుండా ఏ పదవీ లేని ఒక చెలికత్తె చేతిలో రాష్ట్ర పాలనా వెళ్లిపోతున్నా చూస్తూ ఊరుకొని పరోక్షంగా శశికళకి సహకరించింది. జయ మరణాంతరం మళ్ళీ శశికళ పుంజుకోకుండా ఆమె పై పాత కేసు లు తిరగతోడింది. అన్నాడీఎంకే పతనానికి ఏం చేయాలో అన్నీ చేసింది.

ఇప్పుడిక డీఎంకే వంతు ..2G స్కాం లో హఠాత్తుగా రాజా ,కనిమొళి నిర్దోషులైపోయారు. తన కవితాత్మక ప్రసంగాలతో .రచనలతో ,కొంచెం చురుకు గా ఉండే కనిమొళి మీద ద్రుష్టి పడింది.  కేసు లు నుండీ బయటపడిన కృతజ్ఞతతో తమ చెప్పు చేతల్లో ఉంటుంది కనుక ఇద్దరు అన్నదమ్ముల కు పోటీగా ఇప్పడు కనిమొళి డీఎంకే వారసురాలిగా దించే ప్రయత్నం చేస్తోంది.

తమిళ నాడు రాజకీయ తెర మీద బీజేపీ ఆడిస్తున్న ఈ డ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలిసిందే