Showing posts with label కధలు. Show all posts
Showing posts with label కధలు. Show all posts

Wednesday, October 26, 2016

అన్నపూర్ణ కిచెన్

పాపం   అన్నపూర్ణ  సార్ధక నామదేయురాలు వండడం ..తినడం రెండూ ఇష్టమే. అందులోకి తను చేతి వంట తనకి మహా ఇష్టం. ఇంకా ఏమి ఇష్టం అని ఎవరైనా పొరపాటున అడిగినా ఇంత కన్నా వేరే ఇష్టాలు కూడా ఉంటాయ అని హాస్చర్య పోయేంత ఇష్టం

అలాంటి అన్నపూర్ణ తండ్రి పనిచేసే  ఆఫీసు లోనే పనిచేసే మన పరాకుశమ్  ఇతగాడికీ కాస్త ఫుడ్ పిచ్చే . ఓ పని మీద వాళ్ళింటికి  వెళ్ళినప్పుడు ఆ చేతి  వంట తిని బోల్డు మూర్చ పోయి పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అని పట్టు పట్టి కాస్త బెట్టు చేసి అప్పటికి తన వంట సంగతి మాత్రమె తెలిసి తిండి సంగతి తెలియక  అదే అండి ఆ వంట తను మహా ఇష్టం గా కూడా తింటుంది అన్న  సంగతి తెలియక అరచి గోల పెట్టి  మరీ చేసుకున్నాడు. 

పాపం అక్కడికీ వాళ్ళమ్మ పిల్ల కాస్త మరీ ఎక్కువ బొద్దుగా ఉన్నట్లుందేమో రా అని చెప్పినా . పెళ్ళయ్యాకా ఏ జిమ్ లోనో చేర్పిస్తే సరి ఈ మాత్రం విషయానికి జీవితాంతం ఇంత  కమ్మటి వంట తినడం  మిస్ చేసుకోడం ఎందుకు అని తెగ ఫీల్ అయ్యి .. తనను మిస్ కాకుండా మిస్సెస్ గా తెచ్చేసుకున్నాడు .

అత్తారింటికి  వచ్చిన మరు క్షణం నుండీ మన అన్నపూర్ణ పుట్టింటి నుండీ అపురూపం గా తెచ్చుకున్న ఒక వంద వంట పుస్తకాలు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే బుద్దిమంతు రాలిలా రోజూ ఔపోసన పట్టేస్తుంటే మురిసి పోయాడు అప్పటికే  బాచిలర్ తిండి తినీ తినీ మొహం మొత్తిన పరాకుశమ్ రోజూ తినబోయ్ కొత్త కొత్త వంటలు తలుచుకుంటూ.
పెళ్ళికి ముందు వండడం తినడం మాత్రమె ఇష్టమైన మన అన్నపూర్ణకి కి ఇప్పుడు అదనంగా మరో ఇష్టం కూడా ఇష్టం గా వచ్చి చేరింది. తన వంటలను ఎవరికైనా తినిపించి ఆనక వారిచేత పొగిడించుకొడం కూడా. అపార్ట్ మెంట్ ఏ పూట ఎవరికీ భద్దకం అనిపించినా ఆ పూట అన్నపూర్ణకి నాలుగు పొగడ్తలు ఫీజుగా చెల్లించి ఫుడ్ పట్టికెల్లడం కూడా నేర్చేసుకున్నారు.
పెళ్లి అయిన కొద్ది రోజులకు  కాని తెలియలేదు తన ఇంటి వంట గది ఒక చిన్న కుటీర పరిశ్రమ గా మార బోతోందని. ఆ పరిశ్రమ కు రోజూ కూరగాయలు అవీ ఇవీ తెచ్చే పెట్టె సప్లయర్ గా మారి పోతాడని.  అప్పటికీ కాస్త జ్ఞానోదయం అయ్యి చూసుకుంటే కాని ఏముందీ   రెండు నెలలలోనే తనో 20 కేజీలు అవలీలగా పెరిగి  సెంచరీ దాటి విరాట్ కోహ్లి బాటింగ్ కన్నా స్పీడు గా దూసుకు పోతోందని తెలిసి బావురుమన్నాడు .

తన జీతం లో ముప్పావ్ వంతు వంట ఇంటి కిచెన్ లో ఆవిరి అయిపోతోందన్న విషయం కాస్త ఆలస్యంగా అయిన గ్రహించి దిద్దు బాట్లు చర్యలు మొదలెట్టాడు మనోడు.  ఓ రోజు మన అన్న పూర్నని కూర్చో బెట్టి ఆరోగ్య సమస్యల మీద ఓ దండకం చదివి భయపెట్టి. జిమ్ లో చేరడానికి తనని అతి కష్టం మీద ఒప్పించి . దగ్గరలోనే ఓ మంచి జిమ్ లో చేర్పించే హుమ్మయ్య అనుకునే లోపే .. జిమ్ ఓనర్ ఓ పాతిక వేలు బిల్ చేతిలో పెట్టాడు. మన అన్నపూర్ణ వంట చేసినంత వీజీగా సైకిల్ తొక్కే ప్రయత్నం లో అది కాస్త పూర్తిగా విరగ్గోట్టేసిందని.

అయినా ఇదంతా తినడం వల్లనే కదండీ ..నేను కొన్నాళ్ళు డైటింగ్ చేస్తాను మన దగ్గరలోనే నాచురోపతి డైటింగ్ సెంటర్ లో ఓ నాలుగు నెలలు ఉంటె చాలు .ఫీజు తక్కువే ..వాళ్ళు పెట్టె ఫుడ్ కి మాత్రం చెల్లిస్తే చాలు  భాధ పడుతూ చెప్పిన అన్న పూర్ణ  మాటలు అంతే  చల్లగా  గా మనోడికి తాకేసాయి

ఇదేదో బాగుంది కనీసం ఓ నాలుగు నెలలు తను కిచెన్ వైపు కన్నెత్తి చూడక పొతే భవిషత్తులో వంట అంటే విరక్తి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో అని ఆశపడి ఇంకేం ఆలస్యం చేయకుండా చేర్పించేసాడు . ముందుగా మీరేమీ చెల్లించక్కర్లేదు. నాలుగు నెలలు అయ్యాక ఫుడ్ బిల్ కడితే చాలు. 20 kgs తగ్గడం గ్యారంటీ అన్న వాళ్ళ మాటల మీద బోల్డు బరోసాతో .

ఇంతలో నాలుగు నెలలు యిట్టె గడిచాయి. అన్న పూర్ణ ని మెరుపు తీగలా ఊహించేసుకున్న మనోడికి అతి కష్టం మీద పది కేజీలు మాత్రమె తగ్గిన  అన్నపూర్ణ ఎదురొచ్చింది.

పోనీ ఇంకో నాలుగు నెలలు ఉంచితే ఇంకో పది కేజీలు తగ్గుతుందేమో అనుకునే లోపే .. చేతిలో పెట్టిన బిల్లు కేసి చూసి మూర్చ పోయాడు పది కేజీలు పెంచడం అంత ఈజీ కాదు తగ్గించడం అని ..ఆ పది లక్షల బిల్లు చూసి .  తేరుకున్నాకా .. మళ్ళీ ఇంకో సారి మూర్చ పోయాడు. రుచీ పచీ లేని వంట పెడుతున్నారంటూ అక్కడ వంట వాళ్ళని వెంటబడి కాస్త వేధించి వేపుకొని తిని .. వంట గదిలో అడపాదడపా తన పాక శాస్త్ర ప్రావీణ్యం అక్కడా చూపెట్టిందని .. "అమ్మ గారు వంట అద్బుతం గా చేస్తారు అండి మీరు చాల  అదృష్టవంతులు " అంటూ మెలికలు తిరిగుతూ చెప్పిన రిసెప్షనిస్ట్ మాటలతో .

ఆ తర్వాత మనోడు ఎప్పుడూ  అన్నపూర్ణ బరువు తగ్గడం  గురింఛి పెద్దగా ఆలోచించ లేదు కాని  ఏ రోజైన తన వంట మీద తనకు  విరక్తి  రోజు కోసం ఎదురు చూస్తూ ఆ దిశగా రక రకాల ప్రయోగాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు. . ఈలోపల మనోడిని ఎవరైనా  వచ్చి  పెళ్లి చూపులకి వెళ్తున్న అంటే మాత్రం ఇదిగో ఇలా ఓ సలహా పడేస్తాడు .


" ఆడపిల్ల అందం అంత ముఖ్యం కాదు. వంట చేయడం అంటే ఏ మాత్రం ఇష్టం  లేని పిల్లను చేసుకో " అని
// నాణానికి మరో వైపు //
ఇంత చదువుకున్న వాడివి మరీ అంత సంస్కారం లేకుండా ఈ వయసులో తల్లి తండ్రులను వృద్దాశ్రమం లో చేర్పించడం ఏమైనా బాగుందా .  మీ ఆవిడ చూడనంటే మాత్రం మగాడివి ఆ మాత్రం అదుపులో పెట్టలేవా  బాబాయ్ అలా మందలిస్తుంటే నిశ్శబ్దంగా వింటున్నాడు సమీర్
ఏరా మాట్లాడవే నేనింతలా చెప్తూ ఉంటె నీ పాటికి నువ్వు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావ్. అవును పెద్దవాళ్ళ మాట అంటే నీకు లేక్కేది తల్లి తండ్రులనే దిక్కూ మొక్కూ లేకుండా వృద్దశ్రమం లో వదిలేసిన వాడివి ఇక నా మాటలకేం విలువ ఇస్తావ్ . నిన్నని ఏమి లాభం మా అన్నయ్య ఖర్మ ఇలా రాసుంది నీ లాంటి కొడుకుని కానీ అనుభవిస్తున్నాడు 
బాబాయ్ ఇక చాలు ఆపు అని గట్టిగా అరవాలి అనిపించింది సమీర్ కి. కాని ఇక నుండీ ఇలాంటి మాటలు తనకు తప్పవు అలవాటు చేసుకోవాలి .ఇప్పుడు సమాజం ముందు తను దోషిగా నిలబడాల్సిందే .అలా ఆలోచిస్తూ గతం లోకి జారుకున్నాడు
……………………….
అమ్మకి  కాస్త అనారోగ్యం చేసినప్పటి  నుండీ చూస్తున్నా నీ ధోరణి.  నాన్న మీద రోజు ఏదో ఒక కంప్లైంట్ చేస్తున్నావ్. నాకు తెలుసు నీ బాధ  వాళ్ళకి చాకిరీ చేయాల్సి వస్తుందనేగా . చూడు అనితా నేను అందరి లాంటి వాడిని కాదు. అమ్మా నాన్న అంటే నాకు ప్రాణం . వాళ్ళో నువ్వో తేల్చు కోవాల్సి వస్తే ముందు నువ్వే బయటకి వెళ్ళాల్సి వస్తుంది .. ఆవేశం గా అరిచాడు సమీర్
ఇంతలో ఎంత మారి పోయావ్ సమీర్ అసలు నేను చెప్తోంది విన్పించుకొనే ప్రయత్నం నువ్వు ఎందుకు చేయడం లేదు.  అత్తయ్య గారికి అనారోగ్యం తో మంచం పట్టినప్పటి నుండీ మావయ్య గారి ప్రవర్తన లో తేడా వస్తోంది. నువ్వు ఆఫీసు కి వెళ్లి నప్పటి నుండీ నాతో అసభ్యం గా ప్రవర్తిస్తున్నారు . ఇక ఒక్క నిముషం ఇక్కడ ఉండలేను ప్లీజ్ అర్ధం చేసుకో
అనితా జస్ట్ స్టాప్ ఇట్. నాన్న గురించి ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు .  నాన్న ఏంటో నువ్వు చెపితే కానీ తెలుసుకోలేని స్థితి లో నేను లేను. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతె జస్ట్ గెట్ అవుట్
అసలు ఏమైంది సమీర్ కి తను ఏం చెప్పాలని అనుకుంటుందో కనీసం వినిపించే ప్రయత్నం కూడా చేయడం లేదు.   ఒకప్పుడు తనంటే ప్రాణం అనీ వెంటపడి తిరిగి తను లేకుడా బతకలేనని చెప్పిన సమీర్ ఈరోజు తనని గెట్ అవుట్ అంటుంటే దుఖం ముంచుకొచ్చింది అనితకి . ఛీ ఈ మనిషి కోసమేనా అమ్మ నాన్న అందరినీ వదిలేసి వచ్చేసింది. తన చుట్టూ ఎంత అందమైన జీవితం ఊహించుకొంది తను. జీవితాంతం తోడుంటా అన్న మనిషి   ఈరోజు ఇలా ఉబికి వస్తోన్న కన్నీళ్లు తుడుచుకొని అమ్మకి ఫోన్ చేసింది.
సమీర్ ఈ వొక్క సారి నేను చెప్పింది విను. మనం డాక్టర్ లతా గారి దగ్గర counselling  వెళ్దాం.  మావయ్య గారి గురించి ఆవిడతో చెపితే ఏమైనా మావయ్య గారికి counselling ఇస్తారమో .
డాక్టర్ లతా అంటే తనకీ నమ్మకమే. వరసుకు తనకు  పిన్ని కోర్ట్ లో లాయర్ కూడా అయినా తను విడాకుల కోసం వచ్చే ఎన్నో జంటలను తిరిగి కలపడం తనకు తెలుసు  ఒక సారి వెళ్లి కలిస్తే కనీసం ఆవిడ అయినా అనిత  మనసు మార్చే ప్రయత్నం చేయొచ్చు అనుకుంటూ సరే అన్నాడు సమీర్.
జరిగింది అంతా వివరంగా చెప్తోన్న అనితా కేసి చూస్తూ . ఇంట్లో మీ నాన్నకి తెలియకుండా CC TV పెట్టు సమీర్   అనిత చెప్పిన  దానిలో నిజం ఉందొ లేదో తెలుసుకోవచ్చు గా అంటూ సలహా ఇచ్చిన పిన్ని కోసే ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సమీర్
అంటే పిన్నీ నువ్వు నాన్నని అనుమానిస్తున్నావా ? నాన్న నా కంటే నీకు ఇంకా బాగా తెలుసు నాన్న మంచి తనం గురించి ఎన్నో సార్లు చెప్పిన మనిషివి నువ్వే ఇలా అంటే ఎలా పిన్ని
కాదు రా సమీర్. ప్రతి మనిషీ ప్రతి వక్కరి దగ్గర ఒకే లా ప్రవర్తిస్తాడు అనే గ్యారంటీ ఏమీ లేదు సమాజం కోసం వేసుకొనే ముసుగులు కొన్ని ఉంటాయి. నాన్న ఒక తండ్రిగా మంచి వ్యక్తే అయ్యి ఉండవచ్చు కాని పరాయి ఇంటి నుండీ వచ్చిన ఆడపిల్ల మీద అదే లా  ప్రవర్తిస్తాడని గ్యారంటీ ఏమీ లేదు గా.  తను నీతో చెప్పినా నువ్వు నమ్మవు అన్న ధైర్యం కూడా ఉండవచ్చు   నాణానికి ఒక వైపే చూసి ఏది నిజమో చెప్పలేము. ఒక వేళ అనిత చెప్పింది అబద్ధం అయితే అప్పుడే ఏం చేయాలో నిర్ణయం తీసుకోవచ్చు
సరే పిన్ని నాన్న వచ్చే వారం ఊరు వెడుతున్నాడు ఈ లోపల పెట్టిస్తాను . తను  చెప్పింది అబద్ధం అయితే నువ్వే మా ఇద్దరికీ విడాకులు ఇప్పించేయాలి . అత్తా మామలు బరువు అనుకునే కోడలు నాకు భార్య కావడం ఇష్టం లేదు.  అంటూ బయటకి వచ్చేసాడు సమీర్.
కొద్ది రోజుల తరవాత ఆఫీసు నుండీ రాగానే దిగాలుగా ఉన్న అనిత ను చూస్తే మళ్ళీ ఏదో జరిగింది అని అర్ధం అయింది. అనిత ఈ సారి ఏమీ మాట్లాడలేదు కాని తనకే కర్తవ్యమ్ అర్ధం అయ్యింది
అసలు నీ భార్యకు ఇష్టం లేదురా మాతో కలిసి ఉండడం అందుకే ఇలాంటి వేషాలు వేస్తోంది . బోలెడు కట్నం ఇచ్చే వాళ్ళను వదిలి తన వెంట పడీ మరీ పెళ్లి చేసుకుని అలుసై పోయావ్ . ఛీ ఇన్నాళ్ళు ఎంత గౌరవం గా బ్రతికాను చివరకి ఇలా మాట పడాల్సి వస్తోంది నీ పెళ్ళాం మూలంగా. పెళ్ళాన్ని అదుపులో పెట్టడం చేతకాని వాడివి అందుకే అది నిన్నలా ఆడిస్తోంది అంటూ ఆవేశపడుతోన్న నాన్నని చూసి అసహ్యంగా చూసాడు అప్పుడే CC TV లో తను లేనప్పుడు నాన్న తనని ఎలా వేధిస్తోంది కళ్ళారా చూసిన  సమీర్ .
రేపే తననీ అమ్మని దగ్గరలో ఉన్న వృద్దశ్రమం లో చేర్పించాలని నిర్ణయించుకొని మర్నాడు ఆ CC TV పుటేజి  తో డాక్టర్ లత ని కలిసాడు సమీర్ తను తీసుకొన్న నిర్ణయం ఆమె తో చర్చించాలని ఈ సారి  ఒంటరిగానే వెళ్ళాడు.



అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావ్ పిన్నీ ఆశ్చర్యం గా అడిగాడు.
అనిత చెప్పిన దానిలో నిజాయితీ కనిపించిది సమీర్. తను ఎంతగానో నిన్ను ప్రేమించింది నీ కోసం అందరినీ వదులుకొని వచ్చింది. కేవలం భాద్యత నుండీ తప్పించుకోవాలని నిన్ను వదులుకుంటుందా అనిపించింది ఆ రోజు. తనతో చాల సేపు మాట్లాడాకా నీకు ఆ సలహా ఇచ్చాను. నీకు చెప్పడానికి ముందు తనూ ఎంతో వేదన అనుభవించింది అని నాకు ఆ క్షణమే అర్ధం అయ్యింది. ఇప్పుడ నాణానికి మరో వైపు చూసావు గా ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ..అంది డాక్టర్ లత
కాని నాన్న ఇంతా నీచం గా ప్రవర్తించడం చూసాకా అసహ్యం వేస్తోంది. ఇక ఆ మనిషిని జీవితం లో క్షమించలేను పిన్ని. తనని ఎంత బాధ పెట్టానో అపార్ధం చేసుకొని. అసలు నాన్న ఇలా  ప్రవర్తించడం నాకే ఆశ్చర్యం గా ఉంది . నాన్నని మాత్రమే  చేర్పించాలని అనుకున్నా కాని జీవితం చివర్లో అమ్మకి నాన్న అసలు స్వరూపం చెప్పి ఆవిడకి ప్రశాంతతని  దూరం చేయాలని లేదు. అందుకే ఇద్దరినీ చేర్పిస్తున్నా అమ్మ నన్ను తిట్టుకొన్నా పర్వాలేదు . నా కొడుకు మంచి వాడే కోడలే ఇలా మార్చేసింది అనుకొని అయినా తనకు తానూ సమాధాన పడగలదు. కానీ  నాన్న గురించి ఈ వయసులో ఇలా తెలిస్తే తట్టు కోలేదు.  ఇన్నాళ్ళు గౌరవం గా బ్రతికిన నాన్నని  సమాజం ముందు ఈ వయసులో దోషిగా నిలబెట్ట లేను.
హ్మ్మ్ నిజం సమీర్. ప్రతీ మనిషి లో కొన్ని బలహీనతలు ఉంటాయి. కొందరు సమాజ విలువలు , నైతిక విలువలకు కట్టుబడి ఉంది ఆ బలహీనతలను జయిస్తారు. కాని కొందరు స్వార్ధ పూరితమైన వ్యక్తులకు  తమ ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తారు . ఇలాంటి ఆలోచనలే ప్రమాదం అనుకుంటే ఇంకా వారిని మరింత మూర్ఖులుగా మార్చే అశ్లీల వీడియో లు అంతర్జాల్లాన్ని ముంచెత్తుతున్నాయి. అరచేతులో మొబైల్ ఒక బటన్ తో ప్రత్యక్షమయ్యే ఈ చిత్రాలు మనిషిని మరింత ఉన్మాదిగా మారుస్తున్నాయి. తండ్రుల చేతుల్లోనే బలి అవుతున్న కధలు చదువుతూ ఉంటే..ఇక  ఆడపిల్లని అత్తారింటికి పంపించాలి అన్నా భయపడే పరిస్థితులు వచ్చేసాయి.  ప్రతి విషయం లోనూ ఆందోళన చేసే మీ లాంటి యువుకులు ఈ విషయం లో మౌనం వహించడం చాల ఆశ్చర్యం గా నూ, భాధ గానూ ఉంటుంది ఒక్కో సారి అంది డాక్టర్ లత
అవును పిన్ని నిజమే .ఇంత వరకూ ఆలోచించని విషయం మీద ఆలోచింప చేసావు. నా వంతు నేనూ అవేర్నెస్ తీసుకు రావడానికి ప్రయత్నిస్తా అంటూ సెలవ్ తీసుకున్నాడు సమీర్
……………………….

జరిగిందందంతా మరోసారి గుర్తు తెచ్చుకుంటూ . ఆలోచిస్తున్నాడు సమీర్

గతం లోనూ స్త్రీల పై అత్యాచారాలు జరిగాయి కాని అప్పటికీ ఇప్పటికీ తేడా మనిషి చచ్చిపోయేలా హింస . వావి వరుసలు లేవు. పసి పిల్లల మీద జరుగుతున్నాయి. ఇదంతా మాట్లాడితే  వస్త్ర ధారణ అంటూ లెక్చర్ ఇచ్చేవాళ్ళకు సమాజం లో కొదవ లేదు.  అది ఒక కారణం అవ్వచ్చు కాని అరచేతి మొబైల్ లో  పూర్తి నగ్న దృశ్యాలు అనుక్షణం చూసే ప్రస్తుత యుగం లో ఎక్కడో ఎవరో వేసుకున్న దుస్తులు వీటికి ప్రేరణ అంటూ నిందితులను కాపాడడానికి ప్రయత్నించడం ఎంత హాస్యాస్పదం .

ఇలాంటి పరిస్థితి మరే ఆడపిల్లకి రాకుండా సమాజం లో మార్పు కోసం తనూ భాగం కావాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు







// తొలిప్రేమ చిగురించిన వేళ//


"చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం " పేపర్ లో కనిపించిన వార్త కేసి చూస్తూ అనుకున్నాడు తనూ వస్తుందా ? ఒక సారి మళ్ళీ తనని కలవచ్చు ఉహూ వద్దు ఇప్పిడిలా కనిపించి మళ్ళీ ప్రశాంతం గా తన జీవితం లో ఎందుకు కొత్త అలజడి రేపడం. తను ఆలోచిస్తూ ఉండగానే విశ్వ నుండీ ఫోన్

"రేయ్ చందు వస్తున్నావా మన వాళ్ళంతా వస్తున్నారు మళ్ళీ అందరినీ కలవచ్చు .అందరికీ దూరం గా వెళ్లిపోయావ్ . ఇప్పుడైనా రారా  ఇదిగో మీ శైలు కూడా వస్తుందిలే . "

"లేదు విశ్వ నేను రావడం లేదు. అవును శైలు గురించి ఏమైనా తెలిసిందా ఎలా వుంది తను ?"

"లేదు చందు మన వాళ్ళెవరికీ తను ఎక్కడుందో తెలియదు. అసలు పెళ్లి అయ్యాక మళ్ళీ ఎవరికీ కనిపించ లేదు బహుసా ఎక్కడో ప్రశాంతంగా ఉంటుందిలే. మళ్ళీ నిన్ను కలవాల్సి వస్తుందనే అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది  . అయినా తను నిన్ను మర్చిపోయి హాయిగా బతికేస్తుంటే ఇంకా నువ్వు శైలు శైలు అంటూ సరే గాని నువ్వు వస్తున్నావా లేదా "
వద్దురా తన గురించి అలా అనకు అయినా నేను వస్తున్నా లే సరే నువ్వింతగా చెప్తే  రానంటానా  మళ్ళీ అందరినీ కలవాలని నాకూ ఉంది  విశ్వా అంటూ ఫోన్ లో సెలవు తీసుకుంటూ అనుకున్నాడు చందు ఎలాగైనా వెళ్ళాలి కాలేజీ చుట్టూ అల్లుకున్న అందమైన  జ్ఞాపకాలను మరొక్క సారి ఏరుకోవాలని .
***

తన ఇంటి దగ్గరే ఉండే శైలు  తను ఒకే స్కూల్ లో చదివే వారు . స్కూల్ లో తనని ఆట పట్టిస్తూ ఏడిపించి ఏడిపించి ఇంటికి వచ్చాక కూడా స్కూల్ బాగ్ పడేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వాళ్ళింటికి వెళ్లి తనని సతాయిస్తే కాని ఏమీ తోచేది కాదు . తను మాత్రం తక్కువ తిందా మగపిల్లలతో సమానంగా కాదులే ఇంకాస్త ఎక్కవే అల్లరి చేసి తను చేసే teasing మొత్తం వడ్డీ తో సహా తిరిగిచ్చేసేది .అయినా ఎందుకో తనంటే చాల ఇష్టం . క్లాసు లో ఎప్పుడూ ఇద్దరికీ కాంపిటీషన్ పోటీ పడి మరీ చదివేవాళ్ళు  .
టెన్త్ అవ్వగానే ఇద్దరికీ చెరో కాలేజీ లో చేర్పిస్తే బెటర్ లేకపోతె ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు .ఇంటర్ తేడా వస్తే కష్టం అని నాన్న మొత్తుకుంటున్నా పట్టుబట్టి మరీ శైలు  చేరిన కాలేజీ లో తనూ చేరాడు .

"ఇలా పదే పదే శైలు చుట్టూ తిరగకు ఎవరైనా చూస్తే బాగోదు ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నారా రేపో మాపో అత్తారింటికి వెళ్ళాసిన పిల్లా దాన్నల్లా విసిగించకు " అమ్మ మందలించిందో తెలియకుండా తనకి ఒక హింట్ ఇచ్చిందో తెలియదు కాని అప్పటి నుండీ శైలు అంటే ఇంకా ఒక స్పెషల్ ఇష్టం ఏదో పెరిగింది అనిపించింది.  దూరం జరగాలి అనుకుంటూనే ఇంకా ఇంకా తనకి దగ్గర అవ్వాలి అనిపిస్తోన్న   ఆ ఇష్టం ప్రేమే అన్న విషయం అర్ధం కావడానికి చందు కి ఎక్కువ రోజులు పట్టలేదు.  

ఓ రోజు శైలు కిష్టమైన చలం పుస్తకాన్ని తనకు ప్రెజెంట్ చేస్తూ  ఆ ఇష్టం ప్రత్యేకత ఏంటో కొన్ని అక్షరాల్లో   అందం గా ప్రెజెంట్  చేసి మరీ ప్రేమ లేఖగా ఇచ్చేసాడు

వోయ్ ఏంటిది ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే చంపుతా అని కోపంగా వెళ్ళిపోయింది శైలు.

తర్వాత తనతో పూర్తిగా మాట్లాడడం మానేసిన శైలు ని ప్రసన్నం చేసుకోడం కోసం చందు పడే పాట్లుని చూసి నవ్వుకునేది శైలు.

అక్క పెళ్ళికి ఒక రోజు ముందే వచ్చింది శైలు .. పందిట్లో అంతా సందడి సందడి గా ఉంది. ముహూర్తం తెల్లవారు జామున ఏమో అంతా మెలుకువ గా అటు ఇటూ తిరుగుతూ హడావిడి గా ఉన్నారు .

ఏయ్ శైలు అమ్మ పిలుస్తోంది డాబా మీద నీతో ఏదో పని ఉందట. చందు మాట విని దాబా మీద కి వెళ్లి అటు ఇటూ చూస్తూ ఆంటీ ఎక్కడ అని అడిగిన శైలు కు నవ్వుతూ చెప్పాడు చందు .అలా చెపితే తప్ప నువ్వు రావని. 
"చాల రోజుల నుండీ అడుగుతున్నా సమాధానం చెప్పకుండా దాటేస్తున్నావ్ . సూటిగా గా .. నా కళ్ళలోకి చూసి చెప్పు   శైలూ నేనంటే ఇష్టమేనా .. అయినా వెన్నెల్లో మెరుస్తోన్న నీ నవ్వు చెప్పేస్తోంది లే నేనంటే ఇష్టమే అని. “

“తెలుసుగా మళ్ళీ అడగడం దేనికి అంది నవ్వుతూ  “
“ కాని ఆ ముక్క ఏదో నా కళ్ళల్లోకి చూసి చెప్పెయోచ్చుగా  కాస్త రొమాంటిక్ గా “

“ ప్లీజ్ నన్ను వెళ్ళనీ చందు “ ఇలా ఎవరైనా వస్తే బాగోదు అంటూ చేయి విడిపించుకొని వెళ్ళిపోయింది శైలు

అలా ఇంటర్ లో మొదలైన ప్రేమ ,, ఇంజనీరింగ్ కాలేజీ కి వచ్చేసరికి గాఢమైన ప్రేమగా మారిపోయింది ఒకరినొకరు విడిచి వుండలేనంతగా .

చదువు పూర్తవ్వగానే వాళ్ళిద్దరి ప్రేమ గురించి ఇంట్లో తెలియడం ,అప్పటి వరకూ  రెండు కుటుంబాల మద్య ఉన్న స్నేహం  రెండు కులాల మద్య భీకర  పోరాటం లా మారిపోయింది . తారస్థాయికి చేరిన ఈ గొడవలు ఇలా సాగుతుండగానే చందు వాళ్ళ బామ్మ  చనిపోయారన్న వార్తా విని వాళ్ళ కుటుంబం ఢిల్లీ వెళ్లారు. అక్కడే అంత్యక్రియలు ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తీ చేసుకొని పదిహేను రోజుల తర్వాత తిరిగి వచ్చిన చందుకు శైలు వాళ్ళ  కుటుంబం ఊరు విడిచి వెళ్ళిపోయింది అని తెలిసింది . ఆ తర్వాత శైలు ఎక్కడుందో ఏమైందో అని తన ఆచూకి కోసం చందు చేయని ప్రయత్నం లేదు



కాని ఈ లోగా తనకి వివాహం అయ్యిందనే వార్త మాత్రం తెలిసింది.  ఆ తర్వాత తన గురించిన సమాచారమే లేదు
.ఎన్ని రోజులు ఇలా అంటూ ఎప్పుడూ లెక్కలేసుకోలేదు చందు .  కంటి పాపను అదిమిపెట్టుకున్న వాళ్ళిద్దరి  క్షణాలను గుండెని పెకిలించినా రానంటున్న తన  రూపాన్ని అలా భద్రంగా దాచేసుకొని  ఉన్నంతలో హ్యాపీ గా గడపడానికి ప్రయత్నిస్తున్నాడు
 ---------------------------
"చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం “
మీటింగ్ ప్రారంభం అయ్యింది. ఒక్కోకరుగా పాత స్నేహితులు జాయిన్ అవుతూ ఉన్నారు. చందు కళ్ళు మాత్రం శైలు కోసం వెతుకుతూనే ఉన్నాయి . కాని తను మాత్రం రాలేదు. అందరినీ ఇలా కలుసుకోవడం చాల ఆనందంగా ఉన్నా శైలు కనిపించక పోడంతో ఒకింత నిరాశగా ఫీల్ అయ్యాడు చందు.  
“హాయ్ చందు ఎలా వున్నావ్ శైలు కోసం వెతుకుతున్నావా “  అంటూ పలకరించింది వర్ణిక

 “ హాయ్ వర్ణికా Iam fine శైలు  గురించి ఏమైనా తెలిసిందా “. ఆత్రుతగా అడిగాడు

" ఈ మధ్యనే తను నాకు కనిపించింది చందు   తను  ఇప్పుడు మీరిద్దరూ చదివిన జూనియర్  కాలేజీ లోనే లెక్చరర్ గా పనిచేస్తోంది. నిజానికి తనూ వద్దామనే అనుకుంది కాని ఎందుకో చివరి నిముషం లో మనసు మార్చుకొంది మళ్ళీ ప్రశాంతంగా ఉన్న నీ సంసారం లో అలజడిగా రావడం ఎందుకు అని ఆగిపోయింది"

సంసారమా ఆ మాట వింటూనే నవ్వేసాడు చందు అసలు నాకు పెళ్లి అయ్యిందని ఎవరు చెప్పారు అంటూ

అదేంటి ? ఆ రోజు  నీ మ్యారేజ్ అయ్యిందని చెప్పారు మీ నాన్న .

కులం తక్కువ వాడితో తన కూతురి ప్రేమ పరువు కు సంభదించిన విషయంగా భావించి  ఊరు విడిచి వెళ్ళారని తెలుసుగా. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లో  తనని ఆరునెలల పాటు  పూర్తిగా హౌస్ అరెస్ట్ చేసారు పాపం ఎక్కడకీ కదల నీకుండా.   తను నీకు ఫోన్ చేయడానికి వీలు లేని పరిస్థితి. వాళ్ళ బావతో బలవంతంగా నిశ్చయించిన పెళ్లి ఇష్టం లేక  చివరకి బావతో తన ప్రేమ విషయం చెప్పి అతని సహాయం తోనే ఆ ఇంటి నుండీ బయటపడింది.అక్కడ నుండీ పిన్ని ఇంటికి చేరిన వెంటనే మీ ఇంటికి  ఫోన్ చేసింది.  ఫోన్ ఎత్తిన మీ ఫాదర్ తన ఆచూకి తెలియక పోవడం తో  మరదలితో వివాహానికి చందు ఒప్పుకున్నాడని. వారం రోజుల క్రితం నీకు మీ మరదలితో  మ్యారేజ్ అయ్యిదని చెప్పారు . ఆ తర్వాత ఎప్పుడూ తనూ పెళ్లి మాట ఎత్తనివ్వలేదు  ప్రస్తుతం వంటరిగానే ఉంటోంది.
--- - -- --
ఆ మర్నాడు
క్లాసు అయిపోగానే బయటకు వచ్చిన శైలు కి కాలేజీ బయట బైక్ మీద కూర్చొని నవ్వుతూ  కూర్చున్న చందుని చూసి ఒక్క సారిగా కళ్ళు చమర్చాయి.  ఆశ్చర్య పోతూ చూసింది  . కాసేపు కలో నిజమో అర్ధం కాలేదు. ఓ పక్క సంతోషాన్ని మరో పక్క బాధని అదిమి పెట్టి ఎలాంటి భావన పైకి కనిపించకుండా అడిగింది

"ఎలా వున్నావ్ చందూ ?  "
" పెళ్లి చేసుకుందామా  శైలు "  
“సరే మీ ఆవిడని పరిచయం చేయి తన  పర్మిషన్ కూడా  తీసుకొని  చెప్తా అని నవ్వుతూ ఆత్రంగా అడిగింది
" ఎలా వున్నావ్ చందు ?
"కాలం గోడల మీద  మన  స్నేహాన్ని ఓ అందమైన స్మృతి చిహ్నంగా వేలాడదీస్తూ  కొన్ని జ్ఞాపకాలతో ఒంటరిగా చక్రవాకం ఆలపిస్తూ ఇలా ఉన్నా  ప్రస్తుతం single శైలు. అప్పుడు ప్రేమ కోసం దరఖాస్తు చేశాగా. ఇప్పుడు  మళ్ళీ మన పెళ్లి కోసం అప్లికేషను పెట్టా . అమ్మాయి గారు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే

"అంటే ....."
“ అయినా శైలు నిన్ను మరచి పోయి  నేను మాత్రం వేరే పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకున్నావ్ “
ఊపిరాడనివ్వని భావావేశం లో  చందూని గట్టిగా హత్తుకొని నవ్వుతూ అడిగింది  "పెళ్ళెప్పుడు చేసుకుందాం ?"
దూరం గా ఎక్కడి నుండో వినిపిస్తోంది  " దో దిల్ మిల్ రహీ హాయ్ .మగర్ చుప్ చుప్ కే "

అదే జూనియర్ కాలేజీ లో  ఓ పదేళ్ళ క్రితం అలా మొదలైన ప్రేమ. అనేక మలుపులు తిరిగి తిరిగీ  మళ్ళీ అదే కాలేజీ సాక్షిగా ఇద్దరి జీవితం గా మళ్ళీ అలా మొదలయ్యింది. 

Monday, October 24, 2016

// 1 జీవన విధ్వంసం //

మిట్ట మద్యాహ్నం అసలే వేసవి . గతుకుల రోడ్డు మీద కార్ లో చాల దూరం ప్రయాణం చేసి రావడం .. .తీవ్ర మైన దాహం తో గొంతు ఎండి పోతోంది.వెంట తెచ్చుకున్న బాటిల్స్ అయిపోడం తో చాల సేపటి నుండీ ఉగ్గ బెట్టుకొని ఉన్నాడు ప్రతీక్ ..   తనతో పాటు వచ్చిన మిగిలిన ఇద్దరిదీ ఇంచు మించు అదే పరిస్థితి ఇంకో అర కిలోమీటర్ నడిస్తే కాని ఊరు పొలిమేరకు చేరుకోలేమని డ్రైవర్ చెప్పిన విషయం గుర్తొచ్చింది

అయిదారేళ్ళ  క్రితం వచ్చినప్పుడు ఇంతలా లేదు ఊరు. కాస్త పచ్చగా పొలాలతో కళ కళ లాడుతూ ఉండేది. ఇప్పడు ఊరు కుచించుకు పోయింది.ఎక్కడా కను చూపు మేరలో పచ్చటి జాడే లేదు .ఎక్కడ చూసిన బీడు భూములే. ఒకింత ఆశర్యానికి గురయ్యాడు ప్రతీక్ . అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా .

" అక్కడ బోర్ కనిపిస్తోంది  సర్. "

డ్రైవర్ చెప్పడంతో  కారు దిగి  దగ్గరలో ఉన్న బోర్ బావి దగ్గరకి వెళ్ళాడు కాస్త గొంతు తడుపు కుందామని. అప్పటికే అందులో మిగిలి ఉన్న రెండు చుక్కలూ తాగేసి వెళ్లి పోయాయేమో పక్షులు ఆ కాస్త నీరు కూడా లేవని బోర్ మొండి చేయి చూపించింది.


అతి కష్టం మీద ఊరు చేరుకోగాని .  ఓ చిన్న పూరి గుడిసె హోటల్  . కాస్త ప్రాణం లేచొచ్చింది. అక్కడే ఉన్న ఓ గ్లాస్ నీళ్ళు  అందుకున్నాడు ..ఒకటే కెమికల్ వాసన.

"మంచి నీళ్ళు తెమ్మంటే ఈ నీళ్ళు తెచ్చావేంటి ..చూడు ఎంత వాసన వస్తున్నాయో చూడు "

"అయి  మంచి నీళ్ళే బాబు ..ఊరికి ఆ మద్య  వచ్చిన ఫ్యాక్టరీ పుణ్యమా అని ఇప్పుడు ఈడ  నీళ్ళు అంతా కలుషితం అయిపోనాయి బాబు . నీళ్ళే కాదు  తినే తిండి . పీల్చే గాలి కూడా ఇప్పుడు ఇయే వాసనే.  అక్కడ నుండీ వచ్చే వ్యర్దాలతో  చెరువులు రసాయనాలతో నిండి .. పొలాలకు నీరు లేక ఎండి పోయాయి .ఊరు అంతా ముక్కు మూసుకొని బ్రతకడం మాకు అలవాటు అయి పోనాది .  మీరు ఊరికి కొత్త కదయ్యా మీకే అలవాటు అవుతుందిలే  నెమ్మదిగా "
"హ్మ్మ్ ఇక్కడకి దగ్గరలో ఉన్న రామ పురం లో ఇలాంటి  ఫ్యాక్టరీ పెట్ట బోతున్నా . ఆ విషయం పైన ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ ని అద్యయనం చేయడానికి వచ్చాను.. అయినా మీ అందరికీ పునరావాస లు వేరే చోట ఏర్పాటు చేసినట్లు విన్నానే. "

" చేసారు బాబు. కాని మేమంతా భూమి పుత్రులం .ఇక్కడ నేలను కాదని ఏడ బోయినా బతకలేము  .  మేము ఉండగానే ఇట్టా నరికేస్తా పోతున్నారు . ఇక మేమూ వలస పొతే ఈ అడవి తల్లి నెవరు కాపాడుతారయ్య . అడువులు పచ్చగా ఉంటేనే గదా అయ్యా  వర్షాలు పడేది  భూసారం బాగుంటాది. అట్టా నరుకుతా బోతూ ఉంటే .. ఏటి కేడాది ఎండలు మండి పోయి  . వర్షాలు లేక   భూతాపానికి.. భూమిలో నీటి చుక్క లేకుంటే ముందు ముందు ఎట్టా బతుకుతారయ్య. నీళ్ళ ప్రాజెక్ట్ ల కోసమూ  అడవి తల్లిని నరుకుతా పోతా ఉన్నారు. పల్లానికి పోతా దారంటా పొలాలని తడపల్సిన నీటిని ..స్వార్ధానికి ఎగువ ప్రాంతాల్లోనే ఆపేస్తా ఉండారు "

" నిజమే రంగయ్య కాని ఉద్యోగాలు కావలి అంటే తప్పదు కదా. సైన్స్ ఏదో పరిష్కారం కనుగొంటుంది లే "

" మీరు చెప్తా వుంటే నవ్వు వస్తుండాది ..మేమంటే చదువుకోనోల్లం ఇదంతా మాకు అర్ధం కాదు. కాని మీరు చదూకున్నోల్లు నీరు గాలి అంతా పాడయ్యినాక ..ఇక ఎవరు చేసేది మాత్రం ఏటుటుందయ్యా ? మనిషి  ఇజ్ఞానం ప్రకృతిని కొత్తగా తయారు చేయలేదు కదా. నీరు .గాలి మనిషి పుట్టించగలడా ? అది ఆ దేవుడి ఇచ్చింది మన బతుకుల కోసం. ఇట్టా కూర్చున్న కొమ్మనే నరుక్కునే ఇజ్ఞానం కన్నా . మా బోటొల్ల  అజ్ఞానమే మేలు కదా. చెట్టూ చేమా కాపాడుకుంటా ముందు తరాలను బతికిస్తున్నాం "

నెమ్మదిగా ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా వారం క్రితం హారికకీ తనకీ మధ్య జరిగిన వాదన గుర్తొచ్చింది .సరిగ్గా హరికీ ఇదే అంది కదూ


" be practical  హారిక  ఇన్నాళ్ళు చాలీ చాలని జీతం తో ఒక పక్క ,,నా నైపుణ్యం ప్రదర్శించే అవకాశం లేని ఉద్యోగాల్లో ఇమడలేక మరో పక్క. ఇక చాలు,  ఇదిగో ఇన్నాళ్ళకి నా తెలివి తేటలు ఉపయోగించుకునే అవకాశం  వచ్చింది నువ్వెంత చెప్పిన ఈ కెమికల్ ఫ్యాక్టరీ లో partnership తీసుకోడం మాత్రం ఖాయం " 

" అదేంటి ప్రతీక్ నీకు తెలుసుగా  ఆల్రెడీ ఇలాంటి కెమికల్ ఫాక్టరీస్ వలన కలుగుతున్న నష్టాల గురించి  ప్రజల తరపున నేను పోరాడుతున్న సంగతి . తెలిసి కూడా నువ్విలా ?  విజ్ఞానం మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. కాని ప్రకృతిని ద్వంసం చేసేలా కాదు "

" ఎవరి కోసం ఈ పోరాటాలు ఈ ఉద్యమాలు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి హారిక . నైతిక విలువలు అన్నం పెట్టవు.  నేను కాదంటే ఇంకోడు  వస్తాడు .నేనీ అవకశం వదలదలుచుకోలేదు.    ఇక ఈ విషయం లో ఇద్దరి మద్య వాదన అనవసరం . ఇంకో వారం లో నేను చేరుతున్నాను నువ్వూ నాతో వస్తున్నావ్ అంతే "

తన అభిప్రాయం కోసం   ఎదురుచూడకుండా తన నిర్ణయాన్ని ప్రకటించేసినప్రతీక్ కేసి చూస్తూ ఉండి పోయింది  భూములు కోల్పోతున్న ఆదివాసీల గురించి , ఈ ప్రాజెక్ట్ కోసం నరకబడుతున్న అటవీ భూముల కోసం ఇన్నాళ్లుగా తను పోరాడుతూ ఉంటె ఇప్పుడు ఇవేమీ పట్టనట్లు ప్రతీక్ ప్రవర్తించడం మింగుడు పడడం లేదు

"సారీ  ప్రతీక్ ఈ ప్రాజెక్ట్ లో నేనూ భాగం కాలేను. ఇన్నాళ్ళు ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతూ ఉన్న నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను అన్యాయం చేయలేను. ఇప్పటి వరకూ అక్కడ ఉన్న ఫ్యాక్టరీ తో పాటు రేపు నువ్వు పెట్టబోయే ఫ్యాక్టరీ కి  వ్యతిరేకం గా కూడా  నా పోరాటం ఉంటుంది "

"ఓహ్ అయితే నాకు  వ్యతిరేకం గా ఆందోళన కూడా చేస్తావన్న మాట . సరే ఇప్పుడే చెప్తున్నా నా నిర్ణయం మాత్రం మారదు. ప్రభుత్వ అనుమతులు అన్నీ వచ్చాక ఎవరి కోసమో నా భవిష్యత్తు పణంగా పెట్టలేను "

" సరే నీ ఇష్టం "

మళ్ళీ ఆ రోజు తమ ఇద్దరి మద్యా జరిగిన సంభాషణ గుర్తొచ్చి . ఇప్పుడు ఇక్కడ చూసింది అంతా తలచుకుని   ఆలోచన లో పడ్డాడు  ప్రతీక్
" హలో భాస్కర్  నేను ఈ ఫ్యాక్టరీ విషయం లో నా నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నా . ఈ ప్రాజెక్ట్ లో నేను భాగం కావడం లేదు :

" అదేంటి ఇంత సడన్ గా "

" నాది ఎంత తొందర పాటు చర్యో ఈ రోజే ప్రత్యక్షంగా చూసాను భాస్కర్. మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనమే ద్వంసం చేసుకుంటూ ..మన ముందు తరాలకి స్వచ్చమైన గాలి నీళ్ళు లేకుండా చేసి ఏమి సాధిస్తాం. ఈ జీవన విధ్వంసం ఇక  చాలు  . ఇక పై వీటికి వ్యతిరేకం గా పోరాడానికే నిర్ణయించు కున్నా "

ఈ విషయాన్ని హారిక తోనూ చెప్పాలి . ఇక పై ప్రజల హక్కుల కోసం తాను చేస్తున్న పోరాటం లో తాను సైత్యం ఓ సమిధగా మారడానికి నిశ్చయించు కున్నా అని

" డ్రైవర్ కారు మళ్ళించు మనం తిరిగి హైదరాబాద్ వెళుతున్నాం. రామా పురం వెళ్ళబోవడం లేదు " 

:ఈ విషయాన్ని హారిక తోనూ చెప్పాలి . ఇక పై ప్రజల హక్కుల కోసం తాను చేస్తున్న పోరాటం లో తాను సైత్యం ఓ సమిధగా మారడానికి నిశ్చయించుకున్న అని