పిల్లలు చదువులు శీర్షికలో
"పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రహసనం "
పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రహసనమా మరీ టూ మచ్ అనుకుంటున్నారా అవును టూ మచ్ మామూలుగా కాదు అత్యంత ఎక్కువ చాలా మచ్ (కొత్త పదం నేనే కనిపెట్టా ఎవరూ కనిపెట్టకపోతే పదాలు ఎలా పుడతాయి అని ) .
కొన్ని స్కూల్ లో నెలకో రోజు ..శనివారం స్కూల్ కి హాలిడే కనుక పేరెంట్స్ కూడా ఆఫీస్ లు సెలవు మంజూరు చేసేస్తాయి అని భ్రమించే స్కూల్ అవసరం ఉన్నా లేకున్నా క్లాస్ లో ఉన్న ప్రతీ పిల్లల పేరెంట్స్ జీ హుజూర్ అంటూ హజారీ వేయించుకోవాలి అంటూ నోటీసు జారీ చేసేస్తాయి . బాగా చదివే పిల్లల క్రెడిట్ ..స్కూల్ అకౌంట్ వేసేసుకుంటారు.
పాపం చదవని పిల్లకాయల పేరెంట్స్ బుర్రకాయలు అప్పడాల్లా నమిలేస్తారు .పిల్లల ముందు వాళ్ళ గురించి నెగెటివ్ చెప్పకూడదని సైకాలజీ కోడై మేకై కూడా కూస్తుంది . టీచర్ లు " నేరాలు ఘోరాలు " లో యాంకర్ మీ పిల్లాడు ..అంటూ చిట్టా విప్పడం..చెప్పడం . పేరెంట్స్ టీవీ ప్రేక్షకుల్లా ఆవేశపడి ఊగిపోతూ .బిక్కు బిక్కు మంటున్న బుజ్జి పిల్ల కాయల అమాయక మొహాల వంక కోర కోరా ..రా “ఇంటికి రా నీ తాట తీస్తా “ టైపు లో చూడ్డం. పాపం పిల్లలు ..
సరిగ్గా ఇలాంటప్పుడు నాకో డౌటానుమానసందేహం వస్తూ ఉంటుంది. అంత మంది టీచర్ లు కూడబలుక్కొని పొద్దున్న 8 నుండీ సాయంత్రం 3 వరకూ చెప్పినప్పుడు కూడా సరిగ్గా చదవలేకపోతున్న పిల్లవాడు . కేవలం ఇంటిదగ్గర తల్లి తండ్రులు చెప్పే గంటలో అద్బుతాలేమైనా సృష్టించేస్తాడా. అసలు ఆ పిల్లాడి శక్తి ఎంతవరకూ అని ఆలోచించి తల్లి తండ్రుల సహాయం కూడా తీసుకొని “సమష్టి గా” ఏదైనా చేయడం లో అర్ధం ఉంది కానీ. మొత్తం పేరెంట్స్ మీదే నెట్టేసి వాళ్ళకి క్లాస్ పీకడం ఏంటి. పాపం వాళ్ళు కళ్లలో నీళ్లు దిగమింగుకొని దోషుల్లా నిలబడ్డం ఏంటి వేలకి వేలు స్కూల్ చేతుల్లో పోస్తూ కూడా .మొత్తం భాద్యత పేరెంట్స్ దే అయితే ఇక స్కూల్ ఎందుకు ?
సరే బాగా చదవని పిల్లల పేరెంట్స్ బుర్రలే తింటారా ఆబ్బె లేదు బాగా చదివే పిల్లకాయల పేరెంట్స్ బుర్రలూ యధోశక్తి తింటారు మాథ్స్ ఒలింపియాడ్ , సైన్స్ ఒలింపియాడ్ ,, abacus , క్యూ మాథ్స్ , ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్సీ లాంటి బుక్స్ కొనిపించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎగ్జామ్స్ కి అటెండ్ కావాలి అంటారు. ఇక్కడ ఛాయస్ ఉండదు. మస్ట్ అంతే .
బాగా చదివే పిల్లలకీ ఏవో బుక్స్ అంటగట్టి divert చేయడం ..మళ్ళీ తర్వాత మీ వాడు డల్ అయ్యాడు అంటూ మాకే క్లాస్ లు పీకడం మళ్ళీ ఆ వంక పెట్టి ఇంకొన్ని బుక్స్ అంటగట్టడం స్కూల్ లో చదువుకుంటూ ,ఇంటిదగ్గర రివిజన్ చేసి కాసేపు హోమ్ వర్క్ చేసి తర్వాత ఆడుకుంటూ హ్యాపీగా ఎదగనివ్వాలి . వాళ్ళకి మంచి చదువులు చెప్పించగలం కానీ పోగొట్టుకున్న బాల్యాన్ని తిరిగి ఇవ్వగలమా ? ఎడ్యుకేషన్ లోనే కాదు ఎమోషనల్ గా కూడా balanced గా ఎదగనివ్వాలి కదా.
మెజారిటీ స్కూల్ లో ఇప్పుడు ఇదే పరిస్థితి అని నిర్ధారించుకుని రాసాను. గత దశాబ్ద కాలంగా చదువుల తీరు మారుతూ వస్తోంది. ఇంజనీరింగ్, IIT అనే గోల్ లో పిల్లల్ని పడేయడం తల్లి తండ్రుల లక్ష్యం ..వారి బలహీనతలను ఆకర్షించే కాన్సెప్ట్ స్కూల్ , ఆరోతరగతి నుండే IIT ఫౌండేషన్ లు.
ఇక్కడ తల్లి తండ్రులదీ తప్పే . పిల్లలు అంటే చదువుకోడం తప్ప వాళ్ళకి ఆటలు అవసరం అనే తలంపు రాని ఎంతో మంది పేరెంట్స్ ని చూసాను. ఈ వత్తిడి విద్యావిధానం పట్ల ఫిర్యాదులు లేకుండా హ్యాపీగా కార్పొరేట్ స్కూల్ కి cooperate చేస్తున్నారు మన కోసమే కదండీ అంటూ .
యధా పేరెంట్స్. తదా స్కూల్స్ అనుకోవాలేమో. పిల్లలు వత్తిడి లేకుండా హాయిగా ఎదగాలి అని తాపత్రయ పడే మా లాంటి పేరెంట్స్ మాత్రం కొద్దీ మందే
No comments:
Post a Comment