ఒక కుక్కని చంపాలి అంటే ముందు దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేయాలీ అని సామెత . ఇప్పడూ ఫెమినిజాన్ని చంపాలి అంటే .ముందు అదో పనికి మాలిన వ్యవహారం లా చిత్రీకరించాలి . ఇలా చిత్రీకరించడం లో పురుషులు దాదాపు విజయం సాధించారు. ఇప్పుడు ఫెమినిజం బూతు పదమే. దురదృష్టవశాత్తు కొందరు స్త్రీలూ అదే బాటలో వెళ్తున్నారు.
కొందరు ఫెమినిస్టు లో , కొన్ని సంఘాల్లో తప్పు చేస్త్తే నిందించాల్సింది వారి భాద్యతా రాహిత్యాన్ని తప్ప స్త్రీ వాదాన్ని కాదు. స్త్రీ వాదం ఒక భావజాలం. అది ఏ ఒక్క సంఘానికో , వ్యక్తికో చెందింది కాదు
"స్త్రీ సమస్య గురించి స్పందించే ప్రతి మనిషి/హ్యూమన్ భావజాలమే ఫెమినిజం."
అలాంటి వ్యక్తులెవరైనా అందరూ ఫెమినిస్టు లే. అలా సహాయం చేయాలి అనుకుంటే ముందుగా సమాజం లో ,ఇంట్లో ఆ భావజాలం పట్ల గౌరవము ఉండాలి. అది మనమే పోగొట్టుకుంటే అంత కన్నా ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు . ఒకరికి సహాయం చేయడం మాట దేవుడెరుగు ముందు మనల్ని మనమే రక్షించుకోలేం . స్త్రీ వాదం కనుమరుగైతే ప్రతి మూడాచారం తిరిగి మొదలుతుంది. మతపరమైన రాజ్యాలుగా పరిణామం చెందిన ప్రతీ దేశము లో అదే జరిగింది. ఒకప్పుడు ఉన్నత చదువులు చదివిన స్త్రీలు ఉన్న దేశాల్లో ఇప్పుడు స్త్రీల చదువు నిషిద్ధం చేయబడింది.
పేద దళిత ఆదివాసీ స్త్రీల వ్యధలూ అర్ధం చేసుకొని పరిష్కారం దిశగా స్త్రీ వాదాన్ని మరింత విస్తృత పరుచుకోవాలి.. కానీ అసలు స్త్రీ వాదులే వద్దు స్త్రీ వాదమే వద్దు అని వెక్కిరించుకుంటూ కూర్చుంటే వారి జీవితాల్లో మార్పు కి ప్రయత్నించే స్త్రీలు/పురుషులు మాత్రం ఎక్కడ నుండీ పుట్టుకొస్తారు ?
" ఫెమినిజమ్ అంటే పురుషులని ద్వేషించడం కాదు. పురుష ద్వేషంగా మారాల్సిన అవసరమూ లేదు "
పురుషుల సానుభూతి లేదా వారి సహాయం కోరడం అంత కన్నా కాదు. స్త్రీల విషయంలో పురుషుడి ఆలోచన విధానం లో మార్పు కోరుకోవడం. స్త్రీ ల పట్ల ఇంకా ఉన్న కొన్ని ఆచారాలను పూర్తిగా రూపు మాపడం. స్త్రీ సొంత వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవల్సిన అవసరాన్ని గుర్తించడం .
మానతా దృక్పధం తో స్పందిచడమే స్త్రీ వాదం కూడా. మానవతా ఒక చెట్టు అయితే లో ఇదో కొమ్మ అంతే. స్త్రీల గురించి స్పందించడం అంటే మిగిలిన వాటి గురించి స్పందించక పోవడం కాదు .స్త్రీల గురించి కూడా ఆలోచించడం.
No comments:
Post a Comment