Tuesday, December 26, 2017

ఈ వర్మకేమైయింది ...

ఈ వర్మకేమైయింది ...

డిషుమ్ డిషుమ్ అంటూ సౌండ్ లతో షర్ట్ నలగని హీరో చేతిలో ఒక్కోడు వచ్చి కొట్టించుకొని వెళ్లి కాలవలో పడ్డం చూసి చూసి ఉన్నా జనాలకు ఫైటింగ్ లు ఇంత అందం గా కూడా తీయొచ్చు అని చూపించిన సినిమా శివ. నేను నాలుగో క్లాస్ లో ఉండగా వచ్చిన ఆ సినిమా అప్పట్లో బాగా నచ్చేసింది ఆ తర్వాత ఎన్ని సార్లు చూశానో . పాపని చేతిలో పట్టుకొని chasing ని తప్పించుకుంటూ సైకిల్ మీద హీరో వెళ్లడం ..వర్షం లో చీకట్లో ఫైటింగ్ , కాలేజీ క్యాంపస్ వెకిలి తనం లేకుండా చూపించడం ఇలా చాలా సన్నివేశాల్లో 'డైరెక్టర్ ' మార్క్ ని మెచ్చుకోకుండా ఉండలేం.

ఇక ఆ తర్వాత వచ్చిన క్షణం క్షణం ఈరోజుకి ఈ సినిమా వస్తే ఇక రిమోట్ పక్కన పడేసి టీవీ కి అతుక్కొని పోతా , అసలు పాటలో హీరోయిన్ కి వంద డ్రెస్ లు మార్చడం అలవాటయిన సినిమాకి . శ్రీదేవి లాంటి అందమైన హీరోయిన్ సగం పైగా సినిమాలో ఒకే డ్రెస్ లో అదీ మట్టి కొట్టుకుపోయిన డ్రెస్ లో అందంగా చూపించడం ఓ ఎత్తు అయితే ..అమాయకంగా హాస్యం పండించే క్యారెక్టర్ లో తన expression నిజంగా ఓ ట్రెండ్ .. ఎక్కడ వెకిలి హాస్యం ఉండదు. క్రైమ్ సస్పెన్స్ హాస్యం మూడు మిక్స్ చేసి తీసిన ఈ మూవీ నా అల్ టైం ఫేవ్ మూవీ . కామెడీ విలన్ గా పరేష్ రావల్ నటన ఎన్ని సార్లు చూసిన కొత్తగా ఉంటుంది. ,. ఆ తర్వాతే వచ్చిన మనీ మనీ .బ్రహ్మానందం కామెడీ ..ఖాన్ దాదా తో గేమ్స్ వద్దు, వారెవ్వా ఏమీ పేస్ అనే సాంగ్ కామెడీ విలన్ మీద తీయడం క్రెడిట్ ఇక్కడా మళ్ళా వర్మ కే


రాత్రి మూవీ లో అందమైన దయ్యం హీరోయిన్ రేవతి రూపం లో నవ్వుతోనే భయపెట్టేస్తుంది. ఇక్కడ కేవలం ఓ నవ్వు ఓ చూపు ఆ వెనకాలే వచ్చి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ . ఓ బొమ్మ కేసి కెమెరా అలా చూపిస్తూ ఉంటే వెనక ఏ మ్యూజిక్ ఉండదు అంతా సైలెంట్ . ఉన్నట్లుండి ఆ బొమ్మ నవ్వుతుంది ఆ వెనుకే ఒక్కసారిగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక వెన్నులో వణుకే . సినిమాలో భయంకరమైన ముఖాలు లేవు దృశ్యాలు లేవు అయినా భయపెట్టిస్తాడు వర్మ .


కౌన్ అని ఓ హిందీ సినిమా ముగ్గురే ముగ్గురు .ఓ ఇల్లు సినిమా మొత్తం అక్కడే. అయినా రెండు గంటలు పాటు సినిమాని ఆపకుండా చూసేసా. ఆ మూడు క్యారెక్టర్ ల లోనే విలన్ ఎవరు అనే సస్పెన్స్ మైంటైన్ చేయడం నిజంగా హైలైట్ .చివర్లో ఊర్మిళ ఆమ్మో సూపర్ acting అసలు. ఇక్కడ కూడా ప్లేట్ లో ఉన్న బ్రెడ్ ముక్క భయపెట్టేస్తుంది.


మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సత్య అసలు అంత పెద్ద సినిమాకి చక్రి లాంటి చిన్న హీరో ని సెలెక్ట్ చేసుకోడం అదీ హిందీ పరిశ్రమకి ఏ మాత్రం పరిచయం లేని పేస్. అయినా సినిమా లో అది లోటు అనిపించదు. సత్య ,సర్కార్ .. .ఇండియా లో అంతర్లీనం గా రాజకీయాలను సినీ రంగాలను శాసిస్తోన్న మాఫియా ని తనదైన స్టైల్ లో చూపించాడు. వర్మ మార్క్ మాఫియా.


గాయం ,అంతం ,రంగీలా ,shool ,కంపెనీ, అనగనగా ఒక రోజు గోవిందా గోవిందా ఇలా ఎన్నో మంచి సినిమాలు తీసిన వర్మ కి సినిమాలు తీయడం మర్చిపోయారా లేదా ప్లాప్ తీయాలని కంకణం కట్టుకున్నారో తెలియదు కానీ .మొత్తానికి వర్మ మార్క్ సినిమా ఓ గడిచిపోయిన చరిత్రలా మిగిలిపోయింది.


వివాదాలు , ట్విట్టర్ ల జబ్బు నుండీ వర్మ కోలుకొని మళ్ళీ పాత వర్మలా మారిపోయి హీరోజబ్బు పట్టి పోయిన తెలుగు సినిమా కి మళ్ళీ వైవిధ్య మైన సినిమాలు అందించాలని కోరుకుంటూ


 ..GET WELL SOON. .from twitter disease 

1 comment:

  1. సింధూర గారు,
    వర్మకు సినీమా తీయటం‌ చేత కాకా కాదు, ఆ అందంగా తీయటం అనే కళని మర్చిపోయీ‌కాదు. ఆ గొప్ప సినిమా ఆడితే సరే కాసిని డబ్బులొస్తాయి. కెరీర్ చివరికి వస్తోంది. తొందరగా బాగా డబ్బుచేసుకోకపోతే ఫేడౌట్ అయ్యాక ఇబ్బందులు పడాలి కదా. అందుకని ఈజీగా డబ్బులొచ్చేలా ఆలోచిస్తున్నాడు. ఆట్టే పెట్టుబడి లేకుండానో లేదా అస్సలు రూపాయి కర్చు లేకుండానో సినిమాతీసి వదిలే గొప్ప తెలివి వర్మకే స్వంతం అని ఒప్పుకోవాలి. ఆల్‌టైం గ్రేట్ సినిమా తీద్దాం అని లెక్కలూ‌ ప్లానులూ వేసుకోవటం మాని ఇలా బుధ్ధిగా (మన దృష్టిలో బుధ్దిలేని) సినిమాలు తీసి హాయిగా పబ్బం గడుపుకుంటున్నాడు! అంతేనం

    ReplyDelete