// 1 జీవన విధ్వంసం
//
మిట్ట మద్యాహ్నం
అసలే వేసవి . గతుకుల రోడ్డు మీద కార్ లో చాల దూరం ప్రయాణం చేసి రావడం .. .తీవ్ర మైన
దాహం తో గొంతు ఎండి పోతోంది.వెంట తెచ్చుకున్న బాటిల్స్ అయిపోడం తో చాల సేపటి నుండీ
ఉగ్గ బెట్టుకొని ఉన్నాడు ప్రతీక్ .. తనతో
పాటు వచ్చిన మిగిలిన ఇద్దరిదీ ఇంచు మించు అదే పరిస్థితి ఇంకో అర కిలోమీటర్ నడిస్తే
కాని ఊరు పొలిమేరకు చేరుకోలేమని డ్రైవర్ చెప్పిన విషయం గుర్తొచ్చింది
అయిదారేళ్ళ క్రితం వచ్చినప్పుడు ఇంతలా లేదు ఊరు. కాస్త పచ్చగా
పొలాలతో కళ కళ లాడుతూ ఉండేది. ఇప్పడు ఊరు కుచించుకు పోయింది.ఎక్కడా కను చూపు మేరలో
పచ్చటి జాడే లేదు .ఎక్కడ చూసిన బీడు భూములే. ఒకింత ఆశర్యానికి గురయ్యాడు ప్రతీక్ .
అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా .
" అక్కడ
బోర్ కనిపిస్తోంది సర్. "
డ్రైవర్ చెప్పడంతో
కారు దిగి దగ్గరలో ఉన్న బోర్ బావి దగ్గరకి వెళ్ళాడు కాస్త
గొంతు తడుపు కుందామని. అప్పటికే అందులో మిగిలి ఉన్న రెండు చుక్కలూ తాగేసి వెళ్లి పోయాయేమో
పక్షులు ఆ కాస్త నీరు కూడా లేవని బోర్ మొండి చేయి చూపించింది.
అతి కష్టం మీద
ఊరు చేరుకోగాని . ఓ చిన్న పూరి గుడిసె హోటల్ . కాస్త ప్రాణం లేచొచ్చింది. అక్కడే ఉన్న ఓ గ్లాస్
నీళ్ళు అందుకున్నాడు ..ఒకటే కెమికల్ వాసన.
"మంచి నీళ్ళు
తెమ్మంటే ఈ నీళ్ళు తెచ్చావేంటి ..చూడు ఎంత వాసన వస్తున్నాయో చూడు "
"అయి మంచి నీళ్ళే బాబు ..ఊరికి ఆ మద్య వచ్చిన ఫ్యాక్టరీ పుణ్యమా అని ఇప్పుడు ఈడ నీళ్ళు అంతా కలుషితం అయిపోనాయి బాబు . నీళ్ళే కాదు తినే తిండి . పీల్చే గాలి కూడా ఇప్పుడు ఇయే వాసనే. అక్కడ నుండీ వచ్చే వ్యర్దాలతో చెరువులు రసాయనాలతో నిండి .. పొలాలకు నీరు లేక ఎండి
పోయాయి .ఊరు అంతా ముక్కు మూసుకొని బ్రతకడం మాకు అలవాటు అయి పోనాది . మీరు ఊరికి కొత్త కదయ్యా మీకే అలవాటు అవుతుందిలే నెమ్మదిగా "
"హ్మ్మ్
ఇక్కడకి దగ్గరలో ఉన్న రామ పురం లో ఇలాంటి ఫ్యాక్టరీ
పెట్ట బోతున్నా . ఆ విషయం పైన ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ ని అద్యయనం చేయడానికి
వచ్చాను.. అయినా మీ అందరికీ పునరావాస లు వేరే చోట ఏర్పాటు చేసినట్లు విన్నానే.
"
" చేసారు
బాబు. కాని మేమంతా భూమి పుత్రులం .ఇక్కడ నేలను కాదని ఏడ బోయినా బతకలేము . మేము
ఉండగానే ఇట్టా నరికేస్తా పోతున్నారు . ఇక మేమూ వలస పొతే ఈ అడవి తల్లి నెవరు కాపాడుతారయ్య
. అడువులు పచ్చగా ఉంటేనే గదా అయ్యా వర్షాలు
పడేది భూసారం బాగుంటాది. అట్టా నరుకుతా బోతూ
ఉంటే .. ఏటి కేడాది ఎండలు మండి పోయి . వర్షాలు
లేక భూతాపానికి.. భూమిలో నీటి చుక్క లేకుంటే
ముందు ముందు ఎట్టా బతుకుతారయ్య. నీళ్ళ ప్రాజెక్ట్ ల కోసమూ అడవి తల్లిని నరుకుతా పోతా ఉన్నారు. పల్లానికి పోతా
దారంటా పొలాలని తడపల్సిన నీటిని ..స్వార్ధానికి ఎగువ ప్రాంతాల్లోనే ఆపేస్తా ఉండారు
"
" నిజమే
రంగయ్య కాని ఉద్యోగాలు కావలి అంటే తప్పదు కదా. సైన్స్ ఏదో పరిష్కారం కనుగొంటుంది లే
"
" మీరు
చెప్తా వుంటే నవ్వు వస్తుండాది ..మేమంటే చదువుకోనోల్లం ఇదంతా మాకు అర్ధం కాదు. కాని
మీరు చదూకున్నోల్లు నీరు గాలి అంతా పాడయ్యినాక ..ఇక ఎవరు చేసేది మాత్రం ఏటుటుందయ్యా
? మనిషి ఇజ్ఞానం ప్రకృతిని కొత్తగా తయారు చేయలేదు
కదా. నీరు .గాలి మనిషి పుట్టించగలడా ? అది ఆ దేవుడి ఇచ్చింది మన బతుకుల కోసం. ఇట్టా
కూర్చున్న కొమ్మనే నరుక్కునే ఇజ్ఞానం కన్నా . మా బోటొల్ల అజ్ఞానమే మేలు కదా. చెట్టూ చేమా కాపాడుకుంటా ముందు
తరాలను బతికిస్తున్నాం "
నెమ్మదిగా
ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా వారం క్రితం హారికకీ తనకీ మధ్య జరిగిన వాదన గుర్తొచ్చింది
.సరిగ్గా హరికీ ఇదే అంది కదూ
" be
practical హారిక ఇన్నాళ్ళు చాలీ చాలని జీతం తో ఒక పక్క ,,నా నైపుణ్యం
ప్రదర్శించే అవకాశం లేని ఉద్యోగాల్లో ఇమడలేక మరో పక్క. ఇక చాలు, ఇదిగో ఇన్నాళ్ళకి నా తెలివి తేటలు ఉపయోగించుకునే
అవకాశం వచ్చింది నువ్వెంత చెప్పిన ఈ కెమికల్
ఫ్యాక్టరీ లో partnership తీసుకోడం మాత్రం ఖాయం "
" అదేంటి
ప్రతీక్ నీకు తెలుసుగా ఆల్రెడీ ఇలాంటి కెమికల్
ఫాక్టరీస్ వలన కలుగుతున్న నష్టాల గురించి ప్రజల
తరపున నేను పోరాడుతున్న సంగతి . తెలిసి కూడా నువ్విలా ? విజ్ఞానం మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి.
కాని ప్రకృతిని ద్వంసం చేసేలా కాదు "
" ఎవరి
కోసం ఈ పోరాటాలు ఈ ఉద్యమాలు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి హారిక . నైతిక విలువలు
అన్నం పెట్టవు. నేను కాదంటే ఇంకోడు వస్తాడు .నేనీ అవకశం వదలదలుచుకోలేదు. ఇక ఈ విషయం లో ఇద్దరి మద్య వాదన అనవసరం . ఇంకో
వారం లో నేను చేరుతున్నాను నువ్వూ నాతో వస్తున్నావ్ అంతే "
తన అభిప్రాయం
కోసం ఎదురుచూడకుండా తన నిర్ణయాన్ని ప్రకటించేసినప్రతీక్
కేసి చూస్తూ ఉండి పోయింది భూములు కోల్పోతున్న
ఆదివాసీల గురించి , ఈ ప్రాజెక్ట్ కోసం నరకబడుతున్న అటవీ భూముల కోసం ఇన్నాళ్లుగా తను
పోరాడుతూ ఉంటె ఇప్పుడు ఇవేమీ పట్టనట్లు ప్రతీక్ ప్రవర్తించడం మింగుడు పడడం లేదు
"సారీ ప్రతీక్ ఈ ప్రాజెక్ట్ లో నేనూ భాగం కాలేను. ఇన్నాళ్ళు
ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతూ ఉన్న నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను అన్యాయం చేయలేను.
ఇప్పటి వరకూ అక్కడ ఉన్న ఫ్యాక్టరీ తో పాటు రేపు నువ్వు పెట్టబోయే ఫ్యాక్టరీ కి వ్యతిరేకం గా కూడా నా పోరాటం ఉంటుంది "
"ఓహ్ అయితే
నాకు వ్యతిరేకం గా ఆందోళన కూడా చేస్తావన్న
మాట . సరే ఇప్పుడే చెప్తున్నా నా నిర్ణయం మాత్రం మారదు. ప్రభుత్వ అనుమతులు అన్నీ వచ్చాక
ఎవరి కోసమో నా భవిష్యత్తు పణంగా పెట్టలేను "
" సరే నీ
ఇష్టం "
మళ్ళీ ఆ రోజు
తమ ఇద్దరి మద్యా జరిగిన సంభాషణ గుర్తొచ్చి . ఇప్పుడు ఇక్కడ చూసింది అంతా తలచుకుని ఆలోచన లో పడ్డాడు ప్రతీక్
" హలో భాస్కర్ నేను ఈ ఫ్యాక్టరీ విషయం లో నా నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నా
. ఈ ప్రాజెక్ట్ లో నేను భాగం కావడం లేదు :
" అదేంటి
ఇంత సడన్ గా "
" నాది
ఎంత తొందర పాటు చర్యో ఈ రోజే ప్రత్యక్షంగా చూసాను భాస్కర్. మన చుట్టూ ఉన్న ప్రకృతిని
మనమే ద్వంసం చేసుకుంటూ ..మన ముందు తరాలకి స్వచ్చమైన గాలి నీళ్ళు లేకుండా చేసి ఏమి సాధిస్తాం.
ఈ జీవన విధ్వంసం ఇక చాలు . ఇక పై వీటికి వ్యతిరేకం గా పోరాడానికే నిర్ణయించు
కున్నా "
ఈ విషయాన్ని
హారిక తోనూ చెప్పాలి . ఇక పై ప్రజల హక్కుల కోసం తాను చేస్తున్న పోరాటం లో తాను సైత్యం
ఓ సమిధగా మారడానికి నిశ్చయించు కున్నా అని
" డ్రైవర్
కారు మళ్ళించు మనం తిరిగి హైదరాబాద్ వెళుతున్నాం. రామా పురం వెళ్ళబోవడం లేదు
"
:ఈ విషయాన్ని
హారిక తోనూ చెప్పాలి . ఇక పై ప్రజల హక్కుల కోసం తాను చేస్తున్న పోరాటం లో తాను సైత్యం
ఓ సమిధగా మారడానికి నిశ్చయించుకున్న అని
No comments:
Post a Comment