// నాణానికి
మరో వైపు //
ఇంత చదువుకున్న
వాడివి మరీ అంత సంస్కారం లేకుండా ఈ వయసులో తల్లి తండ్రులను వృద్దాశ్రమం లో చేర్పించడం
ఏమైనా బాగుందా . మీ ఆవిడ చూడనంటే మాత్రం మగాడివి
ఆ మాత్రం అదుపులో పెట్టలేవా బాబాయ్ అలా మందలిస్తుంటే
నిశ్శబ్దంగా వింటున్నాడు సమీర్
ఏరా మాట్లాడవే
నేనింతలా చెప్తూ ఉంటె నీ పాటికి నువ్వు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావ్. అవును పెద్దవాళ్ళ
మాట అంటే నీకు లేక్కేది తల్లి తండ్రులనే దిక్కూ మొక్కూ లేకుండా వృద్దశ్రమం లో వదిలేసిన
వాడివి ఇక నా మాటలకేం విలువ ఇస్తావ్ . నిన్నని ఏమి లాభం మా అన్నయ్య ఖర్మ ఇలా రాసుంది
నీ లాంటి కొడుకుని కానీ అనుభవిస్తున్నాడు
బాబాయ్ ఇక చాలు
ఆపు అని గట్టిగా అరవాలి అనిపించింది సమీర్ కి. కాని ఇక నుండీ ఇలాంటి మాటలు తనకు తప్పవు
అలవాటు చేసుకోవాలి .ఇప్పుడు సమాజం ముందు తను దోషిగా నిలబడాల్సిందే .అలా ఆలోచిస్తూ గతం
లోకి జారుకున్నాడు
……………………….
అమ్మకి కాస్త అనారోగ్యం చేసినప్పటి నుండీ చూస్తున్నా నీ ధోరణి. నాన్న మీద రోజు ఏదో ఒక కంప్లైంట్ చేస్తున్నావ్.
నాకు తెలుసు నీ బాధ వాళ్ళకి చాకిరీ చేయాల్సి
వస్తుందనేగా . చూడు అనితా నేను అందరి లాంటి వాడిని కాదు. అమ్మా నాన్న అంటే నాకు ప్రాణం
. వాళ్ళో నువ్వో తేల్చు కోవాల్సి వస్తే ముందు నువ్వే బయటకి వెళ్ళాల్సి వస్తుంది ..
ఆవేశం గా అరిచాడు సమీర్
ఇంతలో ఎంత మారి
పోయావ్ సమీర్ అసలు నేను చెప్తోంది విన్పించుకొనే ప్రయత్నం నువ్వు ఎందుకు చేయడం లేదు. అత్తయ్య గారికి అనారోగ్యం తో మంచం పట్టినప్పటి నుండీ
మావయ్య గారి ప్రవర్తన లో తేడా వస్తోంది. నువ్వు ఆఫీసు కి వెళ్లి నప్పటి నుండీ నాతో
అసభ్యం గా ప్రవర్తిస్తున్నారు . ఇక ఒక్క నిముషం ఇక్కడ ఉండలేను ప్లీజ్ అర్ధం చేసుకో
అనితా జస్ట్
స్టాప్ ఇట్. నాన్న గురించి ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు
. నాన్న ఏంటో నువ్వు చెపితే కానీ తెలుసుకోలేని
స్థితి లో నేను లేను. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతె జస్ట్ గెట్ అవుట్
అసలు ఏమైంది
సమీర్ కి తను ఏం చెప్పాలని అనుకుంటుందో కనీసం వినిపించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒకప్పుడు తనంటే ప్రాణం అనీ వెంటపడి తిరిగి తను
లేకుడా బతకలేనని చెప్పిన సమీర్ ఈరోజు తనని గెట్ అవుట్ అంటుంటే దుఖం ముంచుకొచ్చింది
అనితకి . ఛీ ఈ మనిషి కోసమేనా అమ్మ నాన్న అందరినీ వదిలేసి వచ్చేసింది. తన చుట్టూ ఎంత
అందమైన జీవితం ఊహించుకొంది తను. జీవితాంతం తోడుంటా అన్న మనిషి ఈరోజు ఇలా ఉబికి వస్తోన్న కన్నీళ్లు తుడుచుకొని
అమ్మకి ఫోన్ చేసింది.
సమీర్ ఈ వొక్క
సారి నేను చెప్పింది విను. మనం డాక్టర్ లతా గారి దగ్గర counselling వెళ్దాం.
మావయ్య గారి గురించి ఆవిడతో చెపితే ఏమైనా మావయ్య గారికి counselling ఇస్తారమో
.
డాక్టర్ లతా
అంటే తనకీ నమ్మకమే. వరసుకు తనకు పిన్ని కోర్ట్
లో లాయర్ కూడా అయినా తను విడాకుల కోసం వచ్చే ఎన్నో జంటలను తిరిగి కలపడం తనకు తెలుసు ఒక సారి వెళ్లి కలిస్తే కనీసం ఆవిడ అయినా అనిత మనసు మార్చే ప్రయత్నం చేయొచ్చు అనుకుంటూ సరే అన్నాడు
సమీర్.
జరిగింది అంతా
వివరంగా చెప్తోన్న అనితా కేసి చూస్తూ . ఇంట్లో మీ నాన్నకి తెలియకుండా CC TV పెట్టు
సమీర్ అనిత చెప్పిన దానిలో నిజం ఉందొ లేదో తెలుసుకోవచ్చు గా అంటూ సలహా
ఇచ్చిన పిన్ని కోసే ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సమీర్
అంటే పిన్నీ
నువ్వు నాన్నని అనుమానిస్తున్నావా ? నాన్న నా కంటే నీకు ఇంకా బాగా తెలుసు నాన్న మంచి
తనం గురించి ఎన్నో సార్లు చెప్పిన మనిషివి నువ్వే ఇలా అంటే ఎలా పిన్ని
కాదు రా సమీర్.
ప్రతి మనిషీ ప్రతి వక్కరి దగ్గర ఒకే లా ప్రవర్తిస్తాడు అనే గ్యారంటీ ఏమీ లేదు సమాజం
కోసం వేసుకొనే ముసుగులు కొన్ని ఉంటాయి. నాన్న ఒక తండ్రిగా మంచి వ్యక్తే అయ్యి ఉండవచ్చు
కాని పరాయి ఇంటి నుండీ వచ్చిన ఆడపిల్ల మీద అదే లా
ప్రవర్తిస్తాడని గ్యారంటీ ఏమీ లేదు గా.
తను నీతో చెప్పినా నువ్వు నమ్మవు అన్న ధైర్యం కూడా ఉండవచ్చు నాణానికి ఒక వైపే చూసి ఏది నిజమో చెప్పలేము. ఒక
వేళ అనిత చెప్పింది అబద్ధం అయితే అప్పుడే ఏం చేయాలో నిర్ణయం తీసుకోవచ్చు
సరే పిన్ని నాన్న
వచ్చే వారం ఊరు వెడుతున్నాడు ఈ లోపల పెట్టిస్తాను . తను చెప్పింది అబద్ధం అయితే నువ్వే మా ఇద్దరికీ విడాకులు
ఇప్పించేయాలి . అత్తా మామలు బరువు అనుకునే కోడలు నాకు భార్య కావడం ఇష్టం లేదు. అంటూ బయటకి వచ్చేసాడు సమీర్.
కొద్ది రోజుల
తరవాత ఆఫీసు నుండీ రాగానే దిగాలుగా ఉన్న అనిత ను చూస్తే మళ్ళీ ఏదో జరిగింది అని అర్ధం
అయింది. అనిత ఈ సారి ఏమీ మాట్లాడలేదు కాని తనకే కర్తవ్యమ్ అర్ధం అయ్యింది
అసలు నీ భార్యకు
ఇష్టం లేదురా మాతో కలిసి ఉండడం అందుకే ఇలాంటి వేషాలు వేస్తోంది . బోలెడు కట్నం ఇచ్చే
వాళ్ళను వదిలి తన వెంట పడీ మరీ పెళ్లి చేసుకుని అలుసై పోయావ్ . ఛీ ఇన్నాళ్ళు ఎంత గౌరవం
గా బ్రతికాను చివరకి ఇలా మాట పడాల్సి వస్తోంది నీ పెళ్ళాం మూలంగా. పెళ్ళాన్ని అదుపులో
పెట్టడం చేతకాని వాడివి అందుకే అది నిన్నలా ఆడిస్తోంది అంటూ ఆవేశపడుతోన్న నాన్నని చూసి
అసహ్యంగా చూసాడు అప్పుడే CC TV లో తను లేనప్పుడు నాన్న తనని ఎలా వేధిస్తోంది కళ్ళారా
చూసిన సమీర్ .
రేపే తననీ అమ్మని
దగ్గరలో ఉన్న వృద్దశ్రమం లో చేర్పించాలని నిర్ణయించుకొని మర్నాడు ఆ CC TV పుటేజి తో డాక్టర్ లత ని కలిసాడు సమీర్ తను తీసుకొన్న నిర్ణయం
ఆమె తో చర్చించాలని ఈ సారి ఒంటరిగానే వెళ్ళాడు.
అంత కరెక్ట్
గా ఎలా గెస్ చేసావ్ పిన్నీ ఆశ్చర్యం గా అడిగాడు.
అనిత చెప్పిన
దానిలో నిజాయితీ కనిపించిది సమీర్. తను ఎంతగానో నిన్ను ప్రేమించింది నీ కోసం అందరినీ
వదులుకొని వచ్చింది. కేవలం భాద్యత నుండీ తప్పించుకోవాలని నిన్ను వదులుకుంటుందా అనిపించింది
ఆ రోజు. తనతో చాల సేపు మాట్లాడాకా నీకు ఆ సలహా ఇచ్చాను. నీకు చెప్పడానికి ముందు తనూ
ఎంతో వేదన అనుభవించింది అని నాకు ఆ క్షణమే అర్ధం అయ్యింది. ఇప్పుడ నాణానికి మరో వైపు
చూసావు గా ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ..అంది డాక్టర్ లత
కాని నాన్న ఇంతా
నీచం గా ప్రవర్తించడం చూసాకా అసహ్యం వేస్తోంది. ఇక ఆ మనిషిని జీవితం లో క్షమించలేను
పిన్ని. తనని ఎంత బాధ పెట్టానో అపార్ధం చేసుకొని. అసలు నాన్న ఇలా ప్రవర్తించడం నాకే ఆశ్చర్యం గా ఉంది . నాన్నని మాత్రమే చేర్పించాలని అనుకున్నా కాని జీవితం చివర్లో అమ్మకి
నాన్న అసలు స్వరూపం చెప్పి ఆవిడకి ప్రశాంతతని
దూరం చేయాలని లేదు. అందుకే ఇద్దరినీ చేర్పిస్తున్నా అమ్మ నన్ను తిట్టుకొన్నా
పర్వాలేదు . నా కొడుకు మంచి వాడే కోడలే ఇలా మార్చేసింది అనుకొని అయినా తనకు తానూ సమాధాన
పడగలదు. కానీ నాన్న గురించి ఈ వయసులో ఇలా తెలిస్తే
తట్టు కోలేదు. ఇన్నాళ్ళు గౌరవం గా బ్రతికిన
నాన్నని సమాజం ముందు ఈ వయసులో దోషిగా నిలబెట్ట
లేను.
హ్మ్మ్ నిజం
సమీర్. ప్రతీ మనిషి లో కొన్ని బలహీనతలు ఉంటాయి. కొందరు సమాజ విలువలు , నైతిక విలువలకు
కట్టుబడి ఉంది ఆ బలహీనతలను జయిస్తారు. కాని కొందరు స్వార్ధ పూరితమైన వ్యక్తులకు తమ ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తారు . ఇలాంటి ఆలోచనలే
ప్రమాదం అనుకుంటే ఇంకా వారిని మరింత మూర్ఖులుగా మార్చే అశ్లీల వీడియో లు అంతర్జాల్లాన్ని
ముంచెత్తుతున్నాయి. అరచేతులో మొబైల్ ఒక బటన్ తో ప్రత్యక్షమయ్యే ఈ చిత్రాలు మనిషిని
మరింత ఉన్మాదిగా మారుస్తున్నాయి. తండ్రుల చేతుల్లోనే బలి అవుతున్న కధలు చదువుతూ ఉంటే..ఇక ఆడపిల్లని అత్తారింటికి పంపించాలి అన్నా భయపడే పరిస్థితులు
వచ్చేసాయి. ప్రతి విషయం లోనూ ఆందోళన చేసే మీ
లాంటి యువుకులు ఈ విషయం లో మౌనం వహించడం చాల ఆశ్చర్యం గా నూ, భాధ గానూ ఉంటుంది ఒక్కో
సారి అంది డాక్టర్ లత
అవును పిన్ని
నిజమే .ఇంత వరకూ ఆలోచించని విషయం మీద ఆలోచింప చేసావు. నా వంతు నేనూ అవేర్నెస్ తీసుకు
రావడానికి ప్రయత్నిస్తా అంటూ సెలవ్ తీసుకున్నాడు సమీర్
……………………….
జరిగిందందంతా
మరోసారి గుర్తు తెచ్చుకుంటూ . ఆలోచిస్తున్నాడు సమీర్
గతం లోనూ స్త్రీల
పై అత్యాచారాలు జరిగాయి కాని అప్పటికీ ఇప్పటికీ తేడా మనిషి చచ్చిపోయేలా హింస . వావి
వరుసలు లేవు. పసి పిల్లల మీద జరుగుతున్నాయి. ఇదంతా మాట్లాడితే వస్త్ర ధారణ అంటూ లెక్చర్ ఇచ్చేవాళ్ళకు సమాజం లో
కొదవ లేదు. అది ఒక కారణం అవ్వచ్చు కాని అరచేతి
మొబైల్ లో పూర్తి నగ్న దృశ్యాలు అనుక్షణం చూసే
ప్రస్తుత యుగం లో ఎక్కడో ఎవరో వేసుకున్న దుస్తులు వీటికి ప్రేరణ అంటూ నిందితులను కాపాడడానికి
ప్రయత్నించడం ఎంత హాస్యాస్పదం .
ఇలాంటి పరిస్థితి
మరే ఆడపిల్లకి రాకుండా సమాజం లో మార్పు కోసం తనూ భాగం కావాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు
No comments:
Post a Comment