Wednesday, October 26, 2016

// తొలిప్రేమ చిగురించిన వేళ//


"చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం " పేపర్ లో కనిపించిన వార్త కేసి చూస్తూ అనుకున్నాడు తనూ వస్తుందా ? ఒక సారి మళ్ళీ తనని కలవచ్చు ఉహూ వద్దు ఇప్పిడిలా కనిపించి మళ్ళీ ప్రశాంతం గా తన జీవితం లో ఎందుకు కొత్త అలజడి రేపడం. తను ఆలోచిస్తూ ఉండగానే విశ్వ నుండీ ఫోన్

"రేయ్ చందు వస్తున్నావా మన వాళ్ళంతా వస్తున్నారు మళ్ళీ అందరినీ కలవచ్చు .అందరికీ దూరం గా వెళ్లిపోయావ్ . ఇప్పుడైనా రారా  ఇదిగో మీ శైలు కూడా వస్తుందిలే . "

"లేదు విశ్వ నేను రావడం లేదు. అవును శైలు గురించి ఏమైనా తెలిసిందా ఎలా వుంది తను ?"

"లేదు చందు మన వాళ్ళెవరికీ తను ఎక్కడుందో తెలియదు. అసలు పెళ్లి అయ్యాక మళ్ళీ ఎవరికీ కనిపించ లేదు బహుసా ఎక్కడో ప్రశాంతంగా ఉంటుందిలే. మళ్ళీ నిన్ను కలవాల్సి వస్తుందనే అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది  . అయినా తను నిన్ను మర్చిపోయి హాయిగా బతికేస్తుంటే ఇంకా నువ్వు శైలు శైలు అంటూ సరే గాని నువ్వు వస్తున్నావా లేదా "
వద్దురా తన గురించి అలా అనకు అయినా నేను వస్తున్నా లే సరే నువ్వింతగా చెప్తే  రానంటానా  మళ్ళీ అందరినీ కలవాలని నాకూ ఉంది  విశ్వా అంటూ ఫోన్ లో సెలవు తీసుకుంటూ అనుకున్నాడు చందు ఎలాగైనా వెళ్ళాలి కాలేజీ చుట్టూ అల్లుకున్న అందమైన  జ్ఞాపకాలను మరొక్క సారి ఏరుకోవాలని .
***

తన ఇంటి దగ్గరే ఉండే శైలు  తను ఒకే స్కూల్ లో చదివే వారు . స్కూల్ లో తనని ఆట పట్టిస్తూ ఏడిపించి ఏడిపించి ఇంటికి వచ్చాక కూడా స్కూల్ బాగ్ పడేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వాళ్ళింటికి వెళ్లి తనని సతాయిస్తే కాని ఏమీ తోచేది కాదు . తను మాత్రం తక్కువ తిందా మగపిల్లలతో సమానంగా కాదులే ఇంకాస్త ఎక్కవే అల్లరి చేసి తను చేసే teasing మొత్తం వడ్డీ తో సహా తిరిగిచ్చేసేది .అయినా ఎందుకో తనంటే చాల ఇష్టం . క్లాసు లో ఎప్పుడూ ఇద్దరికీ కాంపిటీషన్ పోటీ పడి మరీ చదివేవాళ్ళు  .
టెన్త్ అవ్వగానే ఇద్దరికీ చెరో కాలేజీ లో చేర్పిస్తే బెటర్ లేకపోతె ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు .ఇంటర్ తేడా వస్తే కష్టం అని నాన్న మొత్తుకుంటున్నా పట్టుబట్టి మరీ శైలు  చేరిన కాలేజీ లో తనూ చేరాడు .

"ఇలా పదే పదే శైలు చుట్టూ తిరగకు ఎవరైనా చూస్తే బాగోదు ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నారా రేపో మాపో అత్తారింటికి వెళ్ళాసిన పిల్లా దాన్నల్లా విసిగించకు " అమ్మ మందలించిందో తెలియకుండా తనకి ఒక హింట్ ఇచ్చిందో తెలియదు కాని అప్పటి నుండీ శైలు అంటే ఇంకా ఒక స్పెషల్ ఇష్టం ఏదో పెరిగింది అనిపించింది.  దూరం జరగాలి అనుకుంటూనే ఇంకా ఇంకా తనకి దగ్గర అవ్వాలి అనిపిస్తోన్న   ఆ ఇష్టం ప్రేమే అన్న విషయం అర్ధం కావడానికి చందు కి ఎక్కువ రోజులు పట్టలేదు.  

ఓ రోజు శైలు కిష్టమైన చలం పుస్తకాన్ని తనకు ప్రెజెంట్ చేస్తూ  ఆ ఇష్టం ప్రత్యేకత ఏంటో కొన్ని అక్షరాల్లో   అందం గా ప్రెజెంట్  చేసి మరీ ప్రేమ లేఖగా ఇచ్చేసాడు

వోయ్ ఏంటిది ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే చంపుతా అని కోపంగా వెళ్ళిపోయింది శైలు.

తర్వాత తనతో పూర్తిగా మాట్లాడడం మానేసిన శైలు ని ప్రసన్నం చేసుకోడం కోసం చందు పడే పాట్లుని చూసి నవ్వుకునేది శైలు.

అక్క పెళ్ళికి ఒక రోజు ముందే వచ్చింది శైలు .. పందిట్లో అంతా సందడి సందడి గా ఉంది. ముహూర్తం తెల్లవారు జామున ఏమో అంతా మెలుకువ గా అటు ఇటూ తిరుగుతూ హడావిడి గా ఉన్నారు .

ఏయ్ శైలు అమ్మ పిలుస్తోంది డాబా మీద నీతో ఏదో పని ఉందట. చందు మాట విని దాబా మీద కి వెళ్లి అటు ఇటూ చూస్తూ ఆంటీ ఎక్కడ అని అడిగిన శైలు కు నవ్వుతూ చెప్పాడు చందు .అలా చెపితే తప్ప నువ్వు రావని
"చాల రోజుల నుండీ అడుగుతున్నా సమాధానం చెప్పకుండా దాటేస్తున్నావ్ . సూటిగా గా .. నా కళ్ళలోకి చూసి చెప్పు   శైలూ నేనంటే ఇష్టమేనా .. అయినా వెన్నెల్లో మెరుస్తోన్న నీ నవ్వు చెప్పేస్తోంది లే నేనంటే ఇష్టమే అని. “

“తెలుసుగా మళ్ళీ అడగడం దేనికి అంది నవ్వుతూ  “
“ కాని ఆ ముక్క ఏదో నా కళ్ళల్లోకి చూసి చెప్పెయోచ్చుగా  కాస్త రొమాంటిక్ గా “

“ ప్లీజ్ నన్ను వెళ్ళనీ చందుఇలా ఎవరైనా వస్తే బాగోదు అంటూ చేయి విడిపించుకొని వెళ్ళిపోయింది శైలు

అలా ఇంటర్ లో మొదలైన ప్రేమ ,, ఇంజనీరింగ్ కాలేజీ కి వచ్చేసరికి గాఢమైన ప్రేమగా మారిపోయింది ఒకరినొకరు విడిచి వుండలేనంతగా .

చదువు పూర్తవ్వగానే వాళ్ళిద్దరి ప్రేమ గురించి ఇంట్లో తెలియడం ,అప్పటి వరకూ  రెండు కుటుంబాల మద్య ఉన్న స్నేహం  రెండు కులాల మద్య భీకర  పోరాటం లా మారిపోయింది . తారస్థాయికి చేరిన ఈ గొడవలు ఇలా సాగుతుండగానే చందు వాళ్ళ బామ్మ  చనిపోయారన్న వార్తా విని వాళ్ళ కుటుంబం ఢిల్లీ వెళ్లారు. అక్కడే అంత్యక్రియలు ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తీ చేసుకొని పదిహేను రోజుల తర్వాత తిరిగి వచ్చిన చందుకు శైలు వాళ్ళ  కుటుంబం ఊరు విడిచి వెళ్ళిపోయింది అని తెలిసింది . ఆ తర్వాత శైలు ఎక్కడుందో ఏమైందో అని తన ఆచూకి కోసం చందు చేయని ప్రయత్నం లేదు



కాని ఈ లోగా తనకి వివాహం అయ్యిందనే వార్త మాత్రం తెలిసింది.  ఆ తర్వాత తన గురించిన సమాచారమే లేదు
.ఎన్ని రోజులు ఇలా అంటూ ఎప్పుడూ లెక్కలేసుకోలేదు చందు .  కంటి పాపను అదిమిపెట్టుకున్న వాళ్ళిద్దరి  క్షణాలను గుండెని పెకిలించినా రానంటున్న తన  రూపాన్ని అలా భద్రంగా దాచేసుకొని  ఉన్నంతలో హ్యాపీ గా గడపడానికి ప్రయత్నిస్తున్నాడు
 ---------------------------
"చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం “
మీటింగ్ ప్రారంభం అయ్యింది. ఒక్కోకరుగా పాత స్నేహితులు జాయిన్ అవుతూ ఉన్నారు. చందు కళ్ళు మాత్రం శైలు కోసం వెతుకుతూనే ఉన్నాయి . కాని తను మాత్రం రాలేదు. అందరినీ ఇలా కలుసుకోవడం చాల ఆనందంగా ఉన్నా శైలు కనిపించక పోడంతో ఒకింత నిరాశగా ఫీల్ అయ్యాడు చందు.  
“హాయ్ చందు ఎలా వున్నావ్ శైలు కోసం వెతుకుతున్నావా “  అంటూ పలకరించింది వర్ణిక

 “ హాయ్ వర్ణికా Iam fine శైలు  గురించి ఏమైనా తెలిసిందా “. ఆత్రుతగా అడిగాడు

" మధ్యనే తను నాకు కనిపించింది చందు   తను  ఇప్పుడు మీరిద్దరూ చదివిన జూనియర్  కాలేజీ లోనే లెక్చరర్ గా పనిచేస్తోంది. నిజానికి తనూ వద్దామనే అనుకుంది కాని ఎందుకో చివరి నిముషం లో మనసు మార్చుకొంది మళ్ళీ ప్రశాంతంగా ఉన్న నీ సంసారం లో అలజడిగా రావడం ఎందుకు అని ఆగిపోయింది"

సంసారమా మాట వింటూనే నవ్వేసాడు చందు అసలు నాకు పెళ్లి అయ్యిందని ఎవరు చెప్పారు అంటూ

అదేంటి ? రోజు  నీ మ్యారేజ్ అయ్యిందని చెప్పారు మీ నాన్న .

కులం తక్కువ వాడితో తన కూతురి ప్రేమ పరువు కు సంభదించిన విషయంగా భావించి  ఊరు విడిచి వెళ్ళారని తెలుసుగా. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లో  తనని ఆరునెలల పాటు  పూర్తిగా హౌస్ అరెస్ట్ చేసారు పాపం ఎక్కడకీ కదల నీకుండా.   తను నీకు ఫోన్ చేయడానికి వీలు లేని పరిస్థితి. వాళ్ళ బావతో బలవంతంగా నిశ్చయించిన పెళ్లి ఇష్టం లేక  చివరకి బావతో తన ప్రేమ విషయం చెప్పి అతని సహాయం తోనే ఆ ఇంటి నుండీ బయటపడింది.అక్కడ నుండీ పిన్ని ఇంటికి చేరిన వెంటనే మీ ఇంటికి  ఫోన్ చేసింది.  ఫోన్ ఎత్తిన మీ ఫాదర్ తన ఆచూకి తెలియక పోవడం తో  మరదలితో వివాహానికి చందు ఒప్పుకున్నాడని. వారం రోజుల క్రితం నీకు మీ మరదలితో  మ్యారేజ్ అయ్యిదని చెప్పారు . ఆ తర్వాత ఎప్పుడూ తనూ పెళ్లి మాట ఎత్తనివ్వలేదు  ప్రస్తుతం వంటరిగానే ఉంటోంది.
--- - -- --
మర్నాడు
క్లాసు అయిపోగానే బయటకు వచ్చిన శైలు కి కాలేజీ బయట బైక్ మీద కూర్చొని నవ్వుతూ  కూర్చున్న చందుని చూసి ఒక్క సారిగా కళ్ళు చమర్చాయి.  ఆశ్చర్య పోతూ చూసింది  . కాసేపు కలో నిజమో అర్ధం కాలేదు. పక్క సంతోషాన్ని మరో పక్క బాధని అదిమి పెట్టి ఎలాంటి భావన పైకి కనిపించకుండా అడిగింది

"ఎలా వున్నావ్ చందూ ?  "
" పెళ్లి చేసుకుందామా  శైలు "  
“సరే మీ ఆవిడని పరిచయం చేయి తన  పర్మిషన్ కూడా  తీసుకొని  చెప్తా అని నవ్వుతూ ఆత్రంగా అడిగింది
" ఎలా వున్నావ్ చందు ?
"కాలం గోడల మీద  మన  స్నేహాన్ని అందమైన స్మృతి చిహ్నంగా వేలాడదీస్తూ  కొన్ని జ్ఞాపకాలతో ఒంటరిగా చక్రవాకం ఆలపిస్తూ ఇలా ఉన్నా  ప్రస్తుతం single శైలు. అప్పుడు ప్రేమ కోసం దరఖాస్తు చేశాగా. ఇప్పుడు  మళ్ళీ మన పెళ్లి కోసం అప్లికేషను పెట్టా . అమ్మాయి గారు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే

"అంటే ....."
“ అయినా శైలు నిన్ను మరచి పోయి  నేను మాత్రం వేరే పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకున్నావ్ “
ఊపిరాడనివ్వని భావావేశం లో  చందూని గట్టిగా హత్తుకొని నవ్వుతూ అడిగింది  "పెళ్ళెప్పుడు చేసుకుందాం ?"
దూరం గా ఎక్కడి నుండో వినిపిస్తోంది  " దో దిల్ మిల్ రహీ హాయ్ .మగర్ చుప్ చుప్ కే "

అదే జూనియర్ కాలేజీ లో  పదేళ్ళ క్రితం అలా మొదలైన ప్రేమ. అనేక మలుపులు తిరిగి తిరిగీ  మళ్ళీ అదే కాలేజీ సాక్షిగా ఇద్దరి జీవితం గా మళ్ళీ అలా మొదలయ్యింది

No comments:

Post a Comment