మూసిన రెప్పలు
మూసిన
రెప్పలు
చీకట్లను
పరిచయించక
ముందే
పురా
స్మృతుల
వెన్నెల
అలికిడివై
కొన్ని
కలల్ని
ఇలా విసిరేయడం నీకలవాటే
ఎక్కడెక్కడి
దూరాలని దగ్గర చేస్తూ
తేమ రెక్కలపై
విరిగిపడ్డ
శూన్య శకలాలను
పెకిలిస్తూ
అకస్మాత్తుగా
స్వప్నంలోకి
నన్నిలా
నడిపించడం
నీకు
కొత్తేమీ కాదుగా
పాత గాలి పలకరిస్తూ
నిన్నిలా
మోసుకొస్తే
చేజారిన
కాలపు
చెమరింతల
గురుతులు
ఒంటరి
దీపాన్నిలా వెలిగిస్తుంటాయి
చెపితే
నమ్మవు కాని
అలౌకికమైన
ప్రేమను వర్షించే ఆ కళ్ళు
మనసుని
మంత్రించి కట్టడి చేస్తుంటే
లోకానికి
కాస్త దూరం గా
ఎప్పటినీ
ఆ స్వప్నం లోనే
నదిలా
నీతో ప్రవహించాలనే ఉంటుంది
No comments:
Post a Comment