Thursday, October 27, 2016

నా నేను

/నా నేను //

రాలిపడిన
పారిజాత పరిమళాలను
ఆస్వాదిస్తూ
చెప్పుకొన్న కబుర్లు ఎన్నో
గుండె అంచుల నుండి
ఒక్కో జ్ఞాపకం
జాలువారుతూ ఉంటె
కంటి రెప్పల మీద అధర చుంబనాల
ఆనవాళ్ళు చెరిపేస్తూ ,,
కన్నీరు సెలయేరై ప్రవహించేస్తూ ఉంటె ,
ఓ క్షణం రెక్కలు విప్పారుకొని
మళ్ళీ ఒక్కసారి  నన్ను నీకు
పరిచయిస్తూ
నీ ముందు
వాలిపోవాలని ఉంటుంది
~ ~ ~ ~
నా లో నేను
గడిపినప్పుడల్లా
కనిపించే నీ అస్తిత్వం ,,
నిను చేరాలను
ఉన్నా చేరుకోలేని
నా నిస్సహాయతను
వెక్కిరిస్తూనే ఉంటుంది
తెల్లవారినా
తెలవారని కలలా.
మళ్ళీ నా మౌన ప్రయాణం
మొదలవుతుంది ..

నా నేను
అనేకానేక నేనులుగా చీలిపోతూ
మన జ్ఞాపకాలు
భారాన్ని మోస్తూ
పగటిని వెలిగిస్తూ ఉంటాను
నీ తలపుల వెలుగులతో .

No comments:

Post a Comment