Thursday, October 27, 2016

స్త్రీ



దేశానికి స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది 
పగలైనా ఒంటరిగా స్వేచ్చగా తిరుగలేను..
దేశం నాకు ఆస్తిహక్కు ఇచ్చింది 
నా జీతం మీద హక్కే నాది కాదు 
దేశం నాకు వాక్స్వాతంత్రమూ ఇచ్చింది 
మతాలేవీ నవ్వే హక్కే ఇవ్వలేదు 

పురుళ్ళు నావే ,, నొప్పీ నాదే 
ఎందరిని కనాలనే నిర్ణయం నాది కాదు 
మాతృత్వం నా జన్మ హక్కే 
కడుపునా కాసే ఆడ పిండాన్ని కాపాడుకోలేను 

నా దేశం విద్యా హక్కు ఉందంది 
కానీ బడి కెళ్ళే నిర్ణయం నాన్నది 
రాజ్యాంగం నన్నో మనిషంది 
మానవ హక్కులూ ఇచ్చింది 
మతాలన్నీ హక్కులూ లాక్కొనాయి


నా లో మనిషి తనాన్ని నొక్కేసి 
నా ఆశలకీ , నా రూపానికీ 
నన్నడకుండానే ముసుగేసాయి 
అనాదిగా ,, మనుగడ పోరాటాలెన్నో
అయినా నేనెప్పుడూ 
మతాల చెరసాలలో 'బందీనే '
అవ్యక్తపు ఆశలకు, భావాలకు 
నేనో సజీవ శిల్పాన్నే

No comments:

Post a Comment