Thursday, October 27, 2016

అసహనాల ఆట

కొత్తగా కోల్పోయేదేమీ లేదు 
కోల్పోవడం
ఒక ఆనవాయితీ అయిన చోట 
అప్పడప్పుడూ మన స్థానాలు మారతాయి
కానిఈ అసహనాల ఆట 
నీకు నాకు అలవాటేగా డ్యూడ్ 

కన్విన్యంట్ గా మన మతాలు వాటి రక్త చరిత్రలు మరిచి 
నిన్ను నేను ..నన్ను నువ్వు సాధించుకోడం అలవాటయ్యాక 
కొత్తగా సాధించింది ఏమీ లేదు.. 
అప్పుడెప్పుడో 'మనం' గా ఉన్న ఇద్దరమూ 
ఇప్పడు నువ్వుగా ,,నేను గా మిగిలామంతే

చరిత్ర ...నుండీ పాఠాలు నేర్వడం వదలి 
గతాన్ని మార్చలేమనీ మరచి 
ఒకరి తప్పులొకరు ఎంచుతూ ..
సమయాన్ని కరిగిస్తూ పోతూ 
వర్తమానం ఓ తెల్ల కాగితంమని తెలిసీ 
భవిష్యత్తు లిఖిన్చుకోవడం మర్చిపోయాక 
నీకు నాకు భవిష్యత్తు కొత్తగా ఏముంటుంది ..
మన గుప్పెడు కలలూ
కలహాల కొలిమిలో మండిచేస్తూ
అదే రక్త చరిత్రనే
వారసత్వపు ఆస్తిగా తిరిగి అందించడం తప్ప


No comments:

Post a Comment