// బాటసారి //
కంటి రెప్పని
అంటిపెట్టుకొని
ఆది అంతం లేని
సశేషమైన కలలా
వలస పక్షిలా
నిదుర దుప్పటి తొలగించి
మెలుకువల మధ్య
స్వప్నమై ఒదిగిపొతావ్
అంటిపెట్టుకొని
ఆది అంతం లేని
సశేషమైన కలలా
వలస పక్షిలా
నిదుర దుప్పటి తొలగించి
మెలుకువల మధ్య
స్వప్నమై ఒదిగిపొతావ్
గుండె లోతునుండి
ఆలోచనలు మదిస్తుంటే
సముద్ర ఘోషలా
అంతరంగాన్ని వినిపిస్తావ్
అగాధాలు ఆవరిస్తుంటే
వెన్నెల వంతెన వేసి
వెలుగు శిఖరం పై
నిలబెట్టి లోకాన్ని చూపిస్తావు
కారు చీకటి కమ్మినప్పుడు
దీపధారివై దారి చూపిస్తావ్
ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతుంటే
చుక్కానివై తీరం చేరుస్తావ్ .
ఊహకి వాస్తవానికి
చెరగని సరిహద్దులా .
గతం లో జారి పోతావ్
అంతలోనే ఉన్నట్లుండి
నా గమ్యమనిపిస్తావ్
నా జీవన రహదారిపై
అలుపెరుగని బాటసారిలా
అనుక్షణం నాతో
నడిచొస్తున్నావ్
ఎవరు నువ్వు ?
No comments:
Post a Comment