Thursday, October 27, 2016

ముగింపు చుక్క

వేధించే అమావాస్యలకి
ముగింపు చుక్కలా
మది గూటిలో పొదిగిన
ఆశలు కొన్ని
నీ అరచేతి వెన్నెలై 
లేత కాంతులేవో వర్షిస్తుంటే
చెదిరిన చినుకుల్లో
చిక్కుకున్న క్షణాలను
కొన్ని ఇష్టాలని
వదిలీ వదల్లేక
అక్కడే అలా వదిలేస్తూ
గడ్డి పూల మైదానం లో
గుచ్చుకుంటున్న
ముళ్లని దాటుకుంటూ
మెత్తని ఆకుల మధ్య హత్తుకున్న
నవ్వుల్ని తోడుగా తెచ్చుకొని
మహా అయిష్టంగానే  వచ్చేస్తాను
జీవితం ఎప్పుడూ గుడ్డి గువ్వేగా 
ఊహకి ..వాస్తవానికి మధ్య
మనిషినిలా వేలాడదీస్తూ

No comments:

Post a Comment