// ఎడబాటు//
వెన్నెల శిఖరం పై
పచ్చిక బయళ్ళపై
దోబూచులాడిన ఊసులు . ,
ప్రకృతి ఒడిలో ఒదిగిపోతూ .
గ్రీష్మా తాపాన్ని
కౌగిట్లో బంధిస్తూ ..
హేమంతాల తో
పోరాటం చేస్తూ ,
ఆలపించిన రుతురాగాలు
మనపై వర్షించిన
వెన్నెల చినుకులు ..
అమృతం జల్లులో
తడిసిన మనసులు ..
ఎన్ని అనుభూతులో
మన ప్రణయం లో .
కదిలిపోయే క్షణాలన్నీ
కాలం లో లీనమయితే ..,
నను కదిలించిన
ఆ క్షణాలన్నీ ఒడిసి పట్టేసా
నా జ్ఞాపకాలో పొదిలో
దాచుకుందామని .
ఓ క్షణం ఈ కాలం
ఇక్కడే ఆగి పొతే ..,
ఈ సంతోషానంతా
ఇంకా ఇంకా , దోసిలి పట్టి ,,
దాచుకోవాలనుంది ....
మళ్ళీ ఏ ఎడబాటు
అలలు విడదీయకు ముందే
No comments:
Post a Comment