బాల్యం
నా వయసు చుట్టూ సంకెళ్ళు వేసి
నన్నో కాంక్రీటు మొక్కల పెంచేస్తూ
మీరు చెప్పుకుని సంబర పడుతోన్న
మీ చిన్ననాటి బాల్యస్మృతుల్లో
నన్ను నేను వెతుకుంటున్నా నాన్న
నన్నో కాంక్రీటు మొక్కల పెంచేస్తూ
మీరు చెప్పుకుని సంబర పడుతోన్న
మీ చిన్ననాటి బాల్యస్మృతుల్లో
నన్ను నేను వెతుకుంటున్నా నాన్న
నేను కోల్పోయిన
నా బాల్యం ఇప్పడు రోడ్డు మీద
నాలుగుస్థంబాలాట ఆడుతున్నట్లుంది
వర్షం లో కాగితపు పడవెక్కి
నన్ను వదిలేసి వెళ్లి పోయినట్లుంది
చదువుల సిలువ ఎక్కించి
నా బాల్యం చుట్టూ మేకులు కొట్టి
మెడకు మార్కుల షీట్ కట్టి
రాంకుల పందెం కోడిలా
చర్నాకోల్ జులిపిస్తూ
మీరు నన్ను పరుగులెత్తిస్తుంటే
అమ్మ నాన్నా ..ఒక్క సారి
అడగాలని ఉంది
నా బాల్యం కాస్త అప్పివ్వరూ
వర్షం లో వడగళ్ళు ఏరుకుంటూ
కాలువ గట్టున పరుగులెడుతూ
జామ చెట్టెక్కి అల్లరి చేస్తూ
ఆరు బయట కాసేపు ఆడుకుంటూ
అమ్మ చెప్పిన చందమామా కధలు
అర్ధరాత్రి కలలుగా కంటూ
కాసేపు కనీసం కొంచెం సేపు
ఓ పిల్లవాడిలా
జీవిన్చేస్తా నాన్న
అడగాలని ఉంది
నా బాల్యం కాస్త అప్పివ్వరూ
వర్షం లో వడగళ్ళు ఏరుకుంటూ
కాలువ గట్టున పరుగులెడుతూ
జామ చెట్టెక్కి అల్లరి చేస్తూ
ఆరు బయట కాసేపు ఆడుకుంటూ
అమ్మ చెప్పిన చందమామా కధలు
అర్ధరాత్రి కలలుగా కంటూ
కాసేపు కనీసం కొంచెం సేపు
ఓ పిల్లవాడిలా
జీవిన్చేస్తా నాన్న
No comments:
Post a Comment