Thursday, October 27, 2016

// అన్వేషణ //
అలల తాకిడికి తీరానికి 
వచ్చి పడ్డ చిరు గవ్వల్లా 
ఎక్కడి నుండో వచ్చి 
ఇలా కలల తీరం లో నను కలిసావు 
మళ్ళీ మళ్ళీ ఆ కెరటాలు 
వస్తూ పోతూ ఉంటాయి .. 
తీరంలో గవ్వలని తనలో 
కలిపేసుకుంటూ .. విసిరేస్తూ ,,
మనమూ అంతే 

ఇలా కలుసుకుంటూ ., విడిపోతూ ..
అయితేనేం .. నీ జ్ఞాపకాలే చాలవూ.. 
ఒంటరిగా ఉన్నా 
నువ్వు నా తో ఉన్నావనిపించేలా 


నా గుండె చేసి సందడి .. 
నీ ఊహలు .. అడగడుగునా 
నన్ను ప్రశ్నిస్తూ ఉంటాయిగా .. 
మళ్ళీ ఈ ఆనందం ఎప్పుడని .. 
అప్పుడు మళ్ళీ నిన్ను నేను 
వెతుక్కుంటూనే ఉంటా .., 
నువ్వు మిగిల్చిన ఆ జ్ఞాపకాల నీడల్లో

No comments:

Post a Comment