Thursday, October 27, 2016

ఊరి చివర

ఊరంతా నిదురపోతుంటే
ఊరి చివర కొన్ని వీధులు
మేల్కొంటాయ్
పేదరికానికి పౌడర్ మేకప్పేసి 
దేహానికి మోహపు అత్తరు అద్ది 
ప్లాస్టిక్ నవ్వులు కొన్ని 
ముఖాన పులుముకొని 
నడిరోడ్డుపై దేహ బేరాలు
మొదలవుతాయ్ 

వదిలేసిన మొగుడో ,
మోహం తీరిన ప్రియుడో
అంగడి సరుకుగా అమ్మేస్తే 
నిశీధిని కప్పుకొన్న
నలిగిన జీవితాలు కొన్ని 
నడిరాత్రే మెల్కొంటాయ్

దేహవాంఛతో, కక్కుర్తితో
అపవిత్ర వీధుల్లో
తిరిగే
'పవిత్రులు?' లెందరో

No comments:

Post a Comment