// ఇదేనా అభ్యుదయం //
అభ్యుదయం అంటూ
హేతు వాదం అంటూ
మతాల మీదే
అడుగులేసుకుంటూ
ఎవడి మీద నీ పోరాటం
జరిగాయో లేదో తెలియని
పురాణ కధల వ్యధలు
కెలుకుతూ
ఉన్నాడో లేడో తెలియని
దేవుళ్ళ లోపాలు వెతుకుతూ
మత గ్రందాల ఈకలు పీకుతూ
రాచరికపు అరాచకాల పై
రచ్చ ఇప్పుడెందుకు
నేరం రుజువైతే
ఎవడికి ఉరేస్తావ్
ఏ శవాన్ని తిరిగి
తగలేస్తావ్
అవునులే
నీది కడుపు నిండిన బేరం కదా
చరిత్ర అవశేషాలే కాని
వర్తమాన విశేషాలు
ఏం కనిపిస్తాయి
మెలిపెట్టే ప్రేగుల్లోకి
నాలుగు మెతుకులు
పంపించేలేని అభాగ్యుల
నడుగు చెబుతాడు
నగారా మోగించాల్సింది
ముగిసిన గత చరిత్ర పై కాదని
నడుస్తున్న వ్యవస్థ పైన అని
హేతు వాదం అంటూ
మతాల మీదే
అడుగులేసుకుంటూ
ఎవడి మీద నీ పోరాటం
జరిగాయో లేదో తెలియని
పురాణ కధల వ్యధలు
కెలుకుతూ
ఉన్నాడో లేడో తెలియని
దేవుళ్ళ లోపాలు వెతుకుతూ
మత గ్రందాల ఈకలు పీకుతూ
రాచరికపు అరాచకాల పై
రచ్చ ఇప్పుడెందుకు
నేరం రుజువైతే
ఎవడికి ఉరేస్తావ్
ఏ శవాన్ని తిరిగి
తగలేస్తావ్
అవునులే
నీది కడుపు నిండిన బేరం కదా
చరిత్ర అవశేషాలే కాని
వర్తమాన విశేషాలు
ఏం కనిపిస్తాయి
మెలిపెట్టే ప్రేగుల్లోకి
నాలుగు మెతుకులు
పంపించేలేని అభాగ్యుల
నడుగు చెబుతాడు
నగారా మోగించాల్సింది
ముగిసిన గత చరిత్ర పై కాదని
నడుస్తున్న వ్యవస్థ పైన అని
No comments:
Post a Comment