!! 2. మనసు నడక !!
నీ మనసు
ప్రతిబింబం లో
నన్ను నేనుగా
చూసుకున్న క్షణం
నేను నేనుగా లేనన్న
ఓ నిజం
ఓ నిట్టూర్పుగా వినిపిస్తుంటే
మనసు మూల్లాల్లో
దాగి ఉన్న మబ్బు తునకలు
శ్రావణ మేఘాలై వర్షిస్తున్నట్లు
మనసుకు మాటకు
నువ్విలా వంతనేస్తూ
గుండె గొంతు పెదవులపై
కొన్ని పదాలుగా
నువ్వు విచ్చుకున్నప్పుడు
నా నుండీ నేను విడివడుతూ
నాకు నేనుగా నీలో నేనుగా
ఒదిగిపొతున్నా
మనంగా
మళ్ళీ మొదలవవలనేమో
దాటొచ్చిన దూరాలను
దగ్గర చేస్తూ
మనసు నడక
ఇప్పుడే మొదలైంది..
నీ గుండె చప్పుడుని
గమ్యంగా మలచుకొని
No comments:
Post a Comment