ఆపకు నేస్తం
నువ్వలా ద్వేషిస్తూనే
ఉండు
నువ్వలా
ద్వేషిస్తూనే ఉండు నేస్తం
వీలయితే
అదిగో ఆ కొండపక్కన
కొన్ని
గులక రాళ్లు
పోగేసి అవీ విసిరేయ్
నిన్ను
దాటి పరిగెత్తడం నాకూ అలవాటు
అవుతుందిలే
అయినా
లోకం కురిపించే వర్ణాలలో
తడవాలనే
తపనే నీకేం లేదుగా
మీ ముత్తాతలూ తాతలూ తండ్రులూ
ఎలా బతికేశారో అలాగే అచ్చు అలాగే
ఎదగని గొంగళీ
పురుగులా
ముళ్ళు
గుచ్చుకుంటున్నాబతికేసేయ్
ఓ రంగుల సీతాకోక చిలకలా
నువ్వెప్పటికీ
ఎగరలేవన్న నిజం
నా విజయం తో అయినా
నీకు
పరిచయం చేయాలిగా
నువ్వలాగే
నా మీద నాలుగు రాలేస్తూ
అక్కడే
ఆ దిగుడు బావిలోనే ఉండు
నీ జీవితం చుట్టూ
శతాబ్దాల
వారసత్వంగా వచ్చిన పాకుడు
రాళ్లతో
కంచె
ఒక్కటి నిర్మించుకుంటూ నువ్వూ
నువ్వు
విసిరే ప్రతీ
రాయితో
కసిగా విజయానికి
నిచ్చెనలేసుకుంటూ నేనూ
ఇలా సాగిపోద్దాం
నిన్ను
దాటి నేను చాలా దూరం
వచ్చేశానని
నన్నెప్పటికీ
నువ్వు అందుకోలేవని
ఆనక నా విజయం
చూసి తీరిగ్గా
బావి గట్టున
కూర్చుని భాధ పడుదువు గాని
( తన
కుల/మత/ప్రాంత పట్ల
మితిమీరిన స్వాభిమానంతో నిరంతరం ద్వేషం చిమ్మే ప్రతీ fanatic ఈ కవితలో
బావిలో కప్ప లాంటి వాడే
No comments:
Post a Comment