ఆత్రం గా రాలిపడే
ప్రతి చినుకు
భూమిని
ముద్దాడేటప్పుడల్లా
మట్టి శ్వాసలు కొన్ని
వీచే గాలిలో చేరి
ఊరి జ్ఞాపకాలని
మదిలో వేళ్లాడదీస్తాయి
నన్నొదిలేసి పోయిన
నా బాల్యం మళ్ళీ
వర్షం లో
కాగితపు పడవేసుకొని
తిరిగొచ్చేస్తుంది
వడగల్లను వడివడిగా
ఏరిన క్షణాలు కొన్ని
తొలకరి తడిమినప్పుడు
పుడమి మొక్కై
విచ్చుకొన్న దృశ్యాలు కొన్ని
కళ్ళ ముందు నర్తిస్తాయ్
మట్టి శ్వాసతో ఊరు
నాకు
కబురపిందేమో
అనిపిస్తుంది అప్పడే
మట్టి తో అనుభంధం
మరిచిపోయేది కాదని
ఊరు పిలుస్తోంది
ఓ సారి వచ్చి పొమ్మని
No comments:
Post a Comment