" మద్యం మత్తు "
నాన్నతనమూ
ఇక మిధ్యేగా
అనుభందం
మద్యం తో కల్తీ అయ్యాక
నేరాలు మారినా
నేరస్తులు మారినా
మళ్ళీ మళ్ళీ వినిపించే
పాట మాత్రం అదే
" మద్యం మత్తు "
న్యాయస్థానాలు అవిటివయి
న్యాయం కుంటూతూ ఉంటే
శిక్షలు పడవని భరోసా
దొరికేసాక
మనిషి మనుగడకు
సంకెళ్ళు ఎందుకంటూ
తిరగ రాస్తున్న
మానవ హక్కుల చరిత్రలో
నేరగాళ్లకూ చోటు
దొరికాక
కల్తీ మద్యం ఎక్కించే కిక్కుకి
కిక్కేంచే 'అశ్లీల చిత్రాలు ' తోడైతే
వావి వరుసలు లేని
కొత్త నేరాలు పుట్టుకొస్తాయి
సమాజాన్ని బూతులతో వెక్కిరించే
అక్షరాలు రాసే సమయం కాదిది
ఫోటో కవితలతో సానుభూతి
పొందే అక్షరాలూ కాదిక కావాల్సింది
సమాజాన్ని సంస్కరిస్తూ
సమస్యలకి పరిష్కారం అయ్యే
అక్షరాలు కావాలి
నేరగాళ్ళపై ఆయుధాలుగా
గురి పెట్టే అక్షరాలు కావాలి
No comments:
Post a Comment