(మర్చి పోయిన చంద మామ కధలను మళ్ళీ గుర్తు చేయడానికి మంచి అవకాశం అనిపించి రాసాను . నిజానికి ఈ భేతాళ కధలు పిల్లల
ఆలోచన శక్తికి పదును పెట్టేవి. చుట్టూ ఉన్న సమాజాన్ని పిల్లకు అర్ధం అయ్యే రీతిలో చెప్పేవి. అందుకే బేతాళ
కధ రాయాలని చిన్న ప్రయత్నం
చందమామ భేతాళ
కధలు (స్వయం వరం )
పట్టువదలని విక్రమార్కుడు
చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే
మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని
బేతాళుడు, ‘‘రాజా, ఇంత అర్ధరాత్రివేళ, భీతిగొలిపే ఈ శ్మశాన వాతావరణం, ఏదో సాధించి
తీరాలన్న పట్టుదల కారణంగా, నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు, నాకు అనుమానం కలుగుతున్నది. ఇప్పుడు నీకో కధ చెపుతాను
అందులో
శ్రమ తెలియకుండా
విను "
పూర్వం కుంతలా
దేశాన్ని పాలించే రాజు చంద్ర వర్మకు పుత్ర సంతానం లేకపోవడం తో తన తదనంతరం రాజ్యాదికారాన్ని
చేపట్టేలా తన కూతురికి తగిన వరుడి కోసం చాటింపు వేయించాడు. ఎంతో మంది యువకులు రాగా
అనేక రాజు పెట్టిన అనేక పరీక్షలు తట్టుకొని
, చివర వరకూ నిల్చిన వాళ్ళు ఇద్దరూ రవి వర్మ, శశాంకుడు .
మహా రాజు తదుపరి పరీక్ష లో భాగంగా పెట్టిన
యుద్ద రంగ పరీక్షలో రవి వర్మ సునాయాసంగా శశాంకుడుని ఓడించాడు. అయితే తుది పరీక్షను నిర్వహించి తనకు కాబోయే వరుడిని తానే
ఎన్నుకుంటానని అడిగిన రాకుమారి మాటను కాదనలేక .. ఆ బాధ్యతను కూతురికే అప్పచెప్పాడు మాహారాజు.
రాజ్యం పూర్తిగా
కరువుతో సతమతఅవుతోంది . ఈ పరిస్థితి అని పూర్తిగా అధ్యయనం చేసి తగిన సూచనలు ఇచ్చి సమస్యని పరిష్కరించిన వ్యక్తినే
రాజ్యాధికారం అని ప్రకటించిన యువరాణి మాటలతో ఇద్దరూ యువకులు బయలుదేరారు.
కొన్ని రోజుల
తర్వాత ఇద్దరూ వచ్చి
ముందుగా రవి
వర్మ .ఇలా అన్నాడు. యువ రాణి మన పొరుగున ఉన్న
దేశాలు కొన్నిసుభిష్టంగా ఉన్నాయి. మన సైన్యం తో యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాలను
కూడా మన పాలనలోకి తెచ్చే వేస్తె అక్కడ పంటలతో దేశం లో కరువుని రూపు మాపవచ్చు .
శశాంకుడు మాత్రం
ఇలా చెప్పాడు
"యువరాణి
దేశం లో ఉన్న కరువు పరిస్థితుల్లో ఇప్పటికే ఖజానా నిండు కునే పరిస్థితులు . మళ్ళీ యుద్ధం అంటే అది మరింత భారం. ప్రజలు కూడా మానసికం
అందుకు సంసిద్ధం గా లేరు. దేశం లోని పరిస్థితి ని అవకాశంగా తీసుకొని కొందరు వ్యాపారులు
పెద్ద ఎత్తున ధాన్యాన్ని గోదాముల్లో నిలువ చేసారు. నిజానికి ఇప్పుడు దేశం లో ఉన్న కరువు
పరిస్థితి కి ప్రకృతి కొంత వరకే కారణం అయితే
,వ్యాపారుల అవకాశం వాదం మరింత సమస్యలు సృష్టిస్తోంది. వీరి పైన చర్యలు తీసుకొనే వ్యవస్థ
లేకపోవడమూ మరొక కారణం. ముందుగా వీరి వద్ద ఉన్న
సరకుని విడిపించడం, కొంత జరిమానా విధించి భవిష్యత్తులో
ఇలా జరుగ కుండా సరి అయినా వ్యవస్థకి రూప కల్పన చేయడం అవసరం. అందుకు ప్రణాళిక రూపొందించాను.
ఇక పొరుగున ఉన్న
దేశాల రాజుల తో ఇప్పుడు యుద్ధం కన్నా సంధి మేలు.
మన దేశం లో అధికం గా లభ్యం అవుతోన్న
లోహాలను ఎగుమతి చేసి అక్కడి నుండీ ధాన్యాన్ని
దిగుమతి చేసుకోడం ద్వారా రాజ్యం పై అదనపు భారం పడకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది
"
శశాంకుడు ని
కాబోయే భర్తగా నిర్ణయం తీసుకున్న యువరాణి తెలివికి అభినందిస్తూ , యువరాణి నిర్ణయం సరి
అయినదే అని తనకు కాబోయే అల్లుడిగా శశాంకుడుని
ప్రకటిస్తూ చాటింపు వేయమని సలహా ఇచ్చిన మహా మంత్రి కేసి ఆశ్చర్యం గా చూస్తూ మహా రాజు
ఇలా అడిగాడు
మహా మంత్రి మన యువరాణి నిర్ణయాన్ని గౌరవిస్తున్నా కాని .,వృత్తి
రీత్యా ఒక పూజారి యుద్ద రంగ విద్యలు కొద్దిగా తెలిసినప్పటికీ రవి వర్మ చేతిలో పలుమార్లు ఓటమి పాలయ్యాడు . అటు
వంటి వ్యక్తీ రాజ్య రక్షణ భారాన్ని ఎలా చేపట్ట గలడు. ఎటువంటి యుద్ద రంగ నైపుణ్యం కూడా
అతనిలో లేదు. రవి వర్మ క్షత్రియ నిపుణుడు అనేక యుద్ద విద్యల్లో ఆరి తేరిన వాళ్ళు అని అడిగిన మహా రాజు కు మంత్రి ఇచ్చిన సమాధానం నచ్చి ..వెంటనే
తనకు కాబోయే అల్లుడిగా ,తన తదనంతరం రాజ్యాన్ని చేపట్టే వ్యక్తీ గా
శశాంకుడుని ప్రకటిస్తూ
చాటింపు వేయించాడు .
భేతాలుడు కధ
చెప్పి,, విక్రమార్క తొలుత ఈ వివాహానికి అంగీకరించని రాజు తన నిర్ణయాన్ని మార్చుకోడానికి
గల కారణం ఏమయ్యి ఉంటుంది. నా ప్రశ్నకు సమాధానం
తెలిసీ చెప్పక పొతే ఏమవుతుందో నీకు తెలుసుగా అంటూ నవ్విన భేతాలుడు తో విక్రమార్కుడు
ఇలా అన్నాడు
రాజ్యాన్ని పాలించే
వ్యక్తీ పూర్తిగా ఇతురుల సలహాల మీద కాకుండా తన స్వంత మేథస్సుకు పదును పెట్టే నేర్పరి
అయ్యి ఉండాలి. అప్పుడే రాజ్యానికి సంభందించిన కీలక నిర్ణయాలు సత్వరమే తీసుకోగలుగుతాడు
.
ప్రజలకు మంచి
పాలన అందించే వ్యక్తీ ప్రజల మేలు కోరే మంచి
వ్యక్తిత్వం ఉన్న వాడయ్యి ఉండాలి . ఇక పొతే కార్య దీక్ష, పట్టుదల వున్న వ్యక్తికీ కొత్తగా విద్యలు
నేర్చుకోడం పెద్ద కష్టమేమీ కాదు. యుద్దరంగ విద్యలనూ త్వరలోనే ఔపోసన పట్టగలదు. అందుకే
యువరాణి పెట్టిన మేధస్సు ,వ్యక్తిత్వానికి
, కార్య దీక్ష
కు పెట్టిన పరీక్షల్లో
నెగ్గిన వ్యక్తినే భర్తగా ఎన్నుకుంది. రవి వర్మ కన్నా శశాంకుడు రాజ్యం లోని పరిస్థితిని
మరింత క్షుణంగా
అధ్యనం చేసాడు. అంతే కాదు ప్రజల మేలు కోరి వారి మీద , ఖజానా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని
మరింతా పన్ను భారం పడకూడదని యుద్దానికి బదులుగా సంధిని ప్రతిపాదించాడు. మెరుగైన పాలన
వ్యవస్థ లో భాగంగా వ్యాపారుల అక్రమ మార్గాని అరికట్టే వ్యవస్థకు రూప కల్పన చేసాడు.
అందుకే యువ రాణి నిర్ణయం సరి అయిందే అని భావించిన
మహా మంత్రి అదే విషయాన్నీ రాజు తో చెప్పాడు . అందుకు సంతృప్తి చెందినా మహారాజు యువరాణి నిర్ణయ్యాన్ని
గౌరవించి .. అతనిని తనకు వారసుడిగా ప్రకటించాడు అని సమాధానమిచ్చాడు .
విక్రమార్కుడుకి
ఈ విధం గా మౌన భంగం కావడం తో బేతాళుడు శవం తో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

No comments:
Post a Comment