నిశ్శబ్దం కూడా
బయపెడుతుందని
నువ్వు లేని శూన్యం లో
కొన్ని ఏకాంతాలు నన్ను
పలకరించినప్పుడే తెలిసింది
బయపెడుతుందని
నువ్వు లేని శూన్యం లో
కొన్ని ఏకాంతాలు నన్ను
పలకరించినప్పుడే తెలిసింది
నా గుండె ఘోష
ఆ వీచే గాలి లో కలిసి
సుడిగాలిలా చుట్టేస్తుంటే
నా శ్వాసల్నికూడా
నియంత్రించలేని
ఓ అచేతన స్థితిలో
ఉండి పోతాను కాసేపు
ఒక్క సారిగా మళ్ళీ
నన్ను మధురోహాలలో నెట్టేసి
నీ కోసం వేచే క్షణాలు
యుగాలుగా మార్చేస్తున్నాయ్
యుగాలుగా మార్చేస్తున్నాయ్
కలల రహదారులు ఏవైనా
ఆ కలల గమ్యం మాత్రం
నువ్వే అనిపిస్తావ్
మెలుకువలోనూ
ఓ సజీవ శిల్పంగా
వెంటాడుతూ
నాకు నన్నే
అపరిచితను చేసేస్తున్నావ్
No comments:
Post a Comment