మతమట, దేవుడట
మనిషెక్కడా ?
ఈ చేతులు పూజలకేనా అంటాడొకడు
గుజరాత్ మరణ హోమాన్ని మరచి
ఈ చేతులు దువా కేనా అంటాడొకడు
మనిషెక్కడా ?
ఈ చేతులు పూజలకేనా అంటాడొకడు
గుజరాత్ మరణ హోమాన్ని మరచి
ఈ చేతులు దువా కేనా అంటాడొకడు
బాంబులు పెట్టిన దువా చేతులనెన్నో మరచి
ఈ చేతులు ప్రార్ధన కేనా ప్రభూ అంటాడొకడు
చముర్లు యుద్దాల చేతులని మరచి
అణ్వాయుధాన్నితొడుక్కుని
హిట్లర్ జాత్యాహంకారాన్ని విమర్శిస్తాడొకడు
పాలస్తీనా మీద నిప్పులు కురిపిస్తూ
ఆ మతం ఈ మతం అన్నది లేదు
చెప్పేది అంతా శాంతి మత్రాలే
ఆచరణ అంతా యుద్ద తంత్రాలే
ఎదుటివాడి మతోన్మాదాన్ని విమర్శిస్తూ
తమ జాతి ఉన్మాదాలకు ముసుగేసి
ఎందుకీ ఇంతటి ఆత్మవంచన,
నీ మతం తప్పు , నీ మతం తప్పు అంటూ
ఎదుటి వాడి ని వెక్కిరిస్తూ
పురాణ పురుషులు తప్పైతే .
ఇప్పడు తీసుకొచ్చి ఉరేద్దామనా,
మత చరిత్రల తవ్వకాలెందుకు..
లోపాల వెతుకులాట ఎందుకు
తాతల తప్పులకు ,,
ఇప్పుడు కత్తులు దూసుకుంటూ
మంచి , చెడు వ్యక్తిగత లక్షణాలే ,,
సమూహ లక్షనాలెప్పుడూ కావన్న
ఇంగితం , విచక్షణా మరచి ,
మతం తొడుగులు తొడుక్కుని ,,
మానవత్వాన్ని వదిలేసి
ఎక్కడకీ ప్రస్తానం ?
No comments:
Post a Comment