Wednesday, October 26, 2016

//  వసంతం కోసం. //
ఎన్ని రోజులైందో నన్ను
నేను పారేసుకొని.. 
జీవిస్తున్నానో , 
బ్రతికేస్తున్ననో నాకే తెలియని 
ఓ అయోమయం లో 
నా జీవన ప్రయాణం 
అలల తాకిడి కి 
ఊగిస లాడుతూ ఉంటె , 
సరిగ్గా అప్పుడే 
ప్రభాత కిరణం లా 
నీ పరిచయం .., 

నా కావాల్సింది ఏదో 
నీకే తెలుసన్నట్లు .., 
నేను పోగొట్టుకున్నదేదో 
నీ దగ్గరే ఉన్నట్లు., 
నీ గుండె చప్పుడు 
చుక్కానిలా, , చేసి
స్నేహాన్ని అందించినప్పుడు 
అదిగో అప్పుడే 
నన్ను నేను పారేసుకున్నాను. 

నా గమ్యం నువ్వేనని పించేలా., 
నా హృదయాన్ని తట్టి లేపి , 
సడలిన జీవన 
వీణని శ్రుతి చేసి మీటావు 
లయ తప్పిన 
నా మనసు 
ఆ క్షణం నుండి 


ఎదురు చూస్తూనే ఉంటోంది 
నువ్వు వచ్చినప్పుడల్లా 
మోసుకొచ్చే వసంతం కోసం.

No comments:

Post a Comment