సగం తెరచిన అల్మారాలో
నిర్లక్ష్యంగా విసిరేయబడ్డ
అక్షరాల మూటల్లోనుండీ
అటూ ఇటూ ఎగురుతూ
కొన్ని వాక్యాలు
నెమలీకల్లా రాలుతుంటాయ్
పగటి వంటరి దారులకి
ఆరోజుకిక ఆఖరి మరణాన్ని లిఖిస్తూ
ఓ కలగా మళ్ళీ పుట్టడం మొదలెడతాను
కనురెప్పలను కాసేపు కావలి ఉంచి
తుఫానుకి చెల్లా చెదురైన ఆశల్ని
ఏరుకుంటూ
మనసు దాహాన్ని తీరుస్తూ
అప్పటి కొన్ని క్షణాలను కళ్ళు
దోసిళ్ళతో వంపుకొని వేలాడదీసుకుంటాయి
గుల్మొహార్ చెట్ల కింద
వదిలేసిన సాయంత్రాలు కొన్ని
నీ శ్వాసల్ని నిశ్శబ్దంగా వెంట
బెట్టుకొచ్చి
నిర్దయగా నిన్నోదిలేసిన నా మనసుని
నిందిస్తూ
ఆ
రాత్రికి జీవించడాన్ని మళ్ళీ
నేర్పిస్తాయి
నీ ఊపిరి పరిమళాల్ని ఆస్వాదిస్తూ
ఆ రాత్రికి జీవించడం పూర్తవుతుందో లేదో
మళ్ళీ ఓ ఉదయం నిస్సహాయం గా
No comments:
Post a Comment