Thursday, October 27, 2016

ఓయ్ పోరాట యోధుడా

వంద కోట్ల భారతం లో 
అక్కడో ఎక్కడో ఒకటో రెండో 
చిన్న ఈదురు గాలి వీస్తే చాలు 
అసహనాల సునామీ ఆట
కొన్నాళ్ళు ఆడేసుకుంటాం
ఘర్ వాపసీలో 
అవార్డు వాపసీలో 
కొన్ని సానుభూతులు 
కొన్ని వ్యతిరేకతలు 
ఆవేశాక్షరాల్లో ముంచి 
దేశ జెండా పై ఆరేస్తాం 
భారత మాత కి జై 
కొట్టమంటూ ఒకడు 
కొట్టనంటూ ఒకడు 
సమస్యల చిట్టా రూపరేఖలేవీ 
మారబొవన్న నిజాన్ని 
అవసరార్ధం ఇష్టం గా మర్చిపోతూ
జీవన్మరణ సమస్య చేసేస్తాం 
వర్గీకరింపబడ్డ సమస్యల్లో 
మన వర్గం జెండాలు మాత్రమె ఏరుకుంటూ 
మండే సూర్యలమంటూ 
మైకు ముందు రంకెలేస్తాం 
~ ~
ఓయ్ పోరాట యోధుడా ||
ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించావా 
అన్నమై పుట్టాల్సిన అన్నదాత 
ఉరికొయ్యకు వేలాడుతుంటే 
వందకోట్ల అన్నపూర్ణ భారతం 
పురుగుల మందుల కూరలతో 
ప్లాస్టిక్ బియ్యాన్ని వండుకు తింటోంది 
మైకు ముందు గొంతెత్తి ఉపన్యాసాలు ఇద్దాం సరే
గొంతు తడపడానికి కాస్త స్వచ్చమైన నీళ్లేవి 
వాడెవడో కొట్టాడనో వీడెవడో తిట్టాడనో 
ఆత్మ గౌరవ పోరాటాలు చేద్దాం సరే 
అందుకు ఇంకొన్నాళ్ళు బతికుండాలిగా 
మరి దాని సంగతేం చేద్దాం
(ప్లాస్టిక్ బియ్యం బహిరంగం గా కొన్నేళ్లుగా సూపర్ మార్కెట్లో సైతం అమ్ముతున్నారని విన్న వార్త చూసి . దేశాన్ని పట్టి పీదిస్తోన్న కల్తీ , నేతల అవినీతి , నిరుద్యోగం లాంటి ఎన్నో పెద్ద సమస్యలు వదిలేసి చిన్న సమస్యల పై పెద్ద పెద్ద పోరాటాలు చేస్తున్న వారికి అంకితం )


No comments:

Post a Comment